కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

జపనీస్ టూవీలర్ బ్రాండ్ Honda అందిస్తున్న పాపులర్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్స్ Africa Twin లో కంపెనీ ఓ సరికొత్త 2022 మోడళ్లను ఆవిష్కరించింది. ప్రస్తుత మోడళ్లతో పోల్చుకుంటే ఈ కొత్త మోడళ్లలో డిజైన్ పరంగా అనేక మార్పులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

Honda తమ Africa Twin మోటార్‌సైకిళ్ల యొక్క ప్రస్తుత తరం జీవితకాలాన్ని మరింత విస్తరించేందుకు ఇందులో గణనీయమైన మార్పులను చేసింది. ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న Africa Twin మోడల్ దాదాపు ఐదు సంవత్సరాల క్రితం పరిచయం చేయబడింది. గతేడాది ఆరంభంలోనే కంపెనీ దీనిని స్వల్పంగా రీడిజైన్ చేసి, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ గా మార్కెట్లో విడుదల చేసింది.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

Honda Africa Twin మొత్తం రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఇందులో సాధారణ ఆఫ్రికా ట్విన్ పూర్తిగా హార్డ్‌కోర్ ఆఫ్-రోడింగ్ ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టగా, అడ్వెంచర్ స్పోర్ట్స్ వెర్షన్‌ను విస్తృత శ్రేణి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టారు. ఈ రెండు మోటార్‌సైకిళ్లు యూరో 5 (భారత్‌లో బిఎస్6 కి సమానమైన) ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

కొత్త 2022 Africa Twin మోటార్‌సైకిళ్లలో కాస్మెటిక్ మార్పులు మినహా మెకానికల్ చేంజెస్ లేవు. ఇందులో పెద్ద లోగో ఉన్నందున బిగ్ లోగో అని పిలువబడే కొత్త కలర్ థీమ్‌తో వీటిని పరిచయం చేశారు. Africa Twin Adventure Sport వేరియంట్‌లో ఇప్పుడు వెనుక వైపు లగేజ్ క్యారియర్‌ను స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా అందిస్తున్నారు.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

అడ్వెంచర్ స్పోర్ట్స్ వేరియంట్‌లో జోడించిన కొత్త కలర్ స్కీమ్‌ను క్రాక్డ్ టెర్రైన్ అని పిలుస్తారు మరియు ఇందులో ఐదు-దశలుగా సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్ ఉంటుంది. మునపటి మోడల్‌లో ఇది ఫిక్స్‌డ్ యూనిట్ రూపంలో ఉండి, సర్దుబాటు చేయటానికి వీలుగా ఉండేది కాదు.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

ఈ విండ్‌షీల్డ్ పాత వెర్షన్ కన్నా 110 మిమీ పొట్టిగా ఉంటుంది. అయినప్పటికీ, ఇది దాని గరిష్ట సెట్టింగ్‌లో, విండ్‌బ్లాస్ట్ నుండి అందించే రక్షణ పాత అడ్వెంచర్ స్పోర్ట్ మాదిరిగానే ప్రభావవంతంగా ఉంటుంది. ఇకపోతే, ఇందులో డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ కూడా స్వల్పంగా సవరించారు. ఇప్పుడు ఇది మొదటి మరియు రెండవ గేర్లలో తక్కువ వేగం వద్ద కూడా మెరుగైన ప్రతిస్పందనతో చాలా సున్నితమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

ఈ కొత్త మోటారుసైకిల్‌లో ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఎక్స్‌టర్నల్ క్రాష్ ప్రొటెక్టివ్ ఫ్రేమ్, పెద్ద ఇంధన ట్యాంక్, ట్యూబ్‌లెస్-రెడీ స్పోక్డ్ అల్లాయ్ వీల్స్, బాష్ ప్లేట్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 6.5 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్, కార్నరింగ్ లాంప్స్, హీటెడ్ గ్రిప్స్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

అలాగే, వీటిలోని ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్ల విషయానికి వస్తే, 2022 Africa Twin డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిల్ సిక్స్ యాక్సిస్ ఐఎమ్‌యూతో వస్తుంది. ఇందులో ఏబిఎస్, రియర్-లిఫ్ట్ కంట్రోల్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, డిసిటి కార్నర్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

అంతే కాకుండా, ఈ మోటార్‌సైకిల్‌ను నిటారుగా ఉంచడానికి, మూడు-స్థాయిల వీలీ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు రైడింగ్ మోడ్స్ (టూర్, అర్బన్, గ్రావెల్, ఆఫ్-రోడ్ మరియు రైడర్ ప్రకారం కస్టమైజ్ చేసుకోదగిన రెండు ప్రోగ్రామ్‌లు) ఉంటాయి.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

వీటిలోని మెకానికల్స్‌ను గమనిస్తే, ముందు భాగంలో 230 మిమీ ట్రావెల్‌తో కూడిన షోవా 45 మిమీ కార్ట్రిడ్జ్-టైప్ ఇన్వెర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో 220 మిమీ ట్రావెల్‌తో మోనో-షాక్ సస్పెషన్ ఉంటాయి. ఈ రెండింటినీ పూర్తిగా సర్దుబాటు చేసుకోవచ్చు.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు డ్యూయెల్ 310 మిమీ డిస్క్స్, వెనుక వైపు 256 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ మోటారుసైకిల్ డ్యూయల్ పర్పస్ టైర్లను అమర్చారు, ఇందులో ముందు వైపు 21 ఇంచ్, వెనుక వైపు 18 ఇంచ్ టైర్లను ఉపయోగించారు.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2022 Honda Africa Twin లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులోని 1084 సిసి పారలల్-ట్విన్ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని మరియు 6250 ఆర్‌పిఎమ్ వద్ద 105 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

మరికొన్ని వారాల్లోనే ఈ కొత్త 2022 Honda Africa Twin మోటార్‌సైకిళ్ల ధరలను కంపెనీ ప్రకటిస్తుంది. ఈ కొత్త వెర్షన్ ముందుగా అంతర్జాతీయ మార్కెట్‌లలో విడుదల కానుంది, అనంతరం ఇది భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త 2022 Honda Africa Twin అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ

ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న 2020 మోడల్ Honda Africa Twin అడ్వెంచర్ స్పోర్ట్స్ మాన్యువల్ వెర్షన్ ధర రూ. 15.98 లక్షలు కాగా, డిసిటి వేరియంట్ ధర రూ. 17.52 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది Honda BigWing (హోండా బిగ్‌వింగ్) డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడుతోంది.

Most Read Articles

English summary
New 2022 honda africa twin adv motorcycle unveiled with new colour options
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X