దేశీయ మార్కెట్లో Aprilia SR 160 విడుదల రేపే.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎప్రిలియా (Aprilia) భారతీయ మార్కెట్లో తన కొత్త ఎప్రిలియా ఎస్ఆర్ 160 (Aprilia SR 160) స్కూటర్‌ను 2021 నవంబర్ 16 న అంటే రేపు అధికారికంగా విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే కంపెనీ తాజాగా తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో కొత్త స్కూటర్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో Aprilia SR 160 విడుదల రేపే.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

ఎప్రిలియా (Aprilia) విడుదల చేయనున్న ఈ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే డెలివరీలు మాత్రం ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత నవంబర్ నెల చివరి రోజులలో ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.

దేశీయ మార్కెట్లో Aprilia SR 160 విడుదల రేపే.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

కంపెనీ విడుదల చేసిన ఈ స్కూటర్ టీజర్‌ ప్రకారం, ఈ కొత్త స్కూటర్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఎప్రిలియా ఎస్ఆర్ 160 ఫ్రంట్ లుక్ మరింత దూకుడుగా మరియు స్లిమ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇప్పుడు హాలోజన్ హెడ్‌లైట్ యూనిట్ స్థానంలో, పూర్తిగా ఎల్ఈడీ యూనిట్ వ్యవస్థాపించబడింది. కొత్త ఎప్రిలియా SR 160 యువ కస్టమర్లను ఆకర్శించడానికి తగిన ప్రయత్నాలలో భాగంగా ఈ స్కూటర్ ని చాలా వరకు అప్డేట్ చేసింది.

దేశీయ మార్కెట్లో Aprilia SR 160 విడుదల రేపే.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

అయితే మార్కెట్లో సిద్దమైన ఈ స్కూటర్ గురించి ప్రస్తుతానికి, ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. అయితే విడుదల సమయంలో దీనికి సంబంధించిన మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ ఉంటుందని తెలుస్తుంది.

దేశీయ మార్కెట్లో Aprilia SR 160 విడుదల రేపే.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

అంతే కాకుండా ఇందులో, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఒకే సీటుకు బదులుగా, బైక్ లాంటి స్ప్లిట్ ఇప్పుడు మెరుగైన కుషనింగ్‌తో ఇవ్వబడుతుందని భావిస్తున్నారు. గ్రాబ్ రైల్ కూడా మునుపటి కంటే పెద్దదిగా ఉండనుంది.

దేశీయ మార్కెట్లో Aprilia SR 160 విడుదల రేపే.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

కొత్త ఎప్రిలియా SR 160 స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లను పొందుతుంది. అయితే వెనుక వైపున స్ప్రింగ్-లోడెడ్ సింగిల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఇది కాకుండా, స్కూటర్ యొక్క అల్లాయ్ వీల్స్‌పై 14 ఇంచెస్ ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో Aprilia SR 160 విడుదల రేపే.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త ఎప్రిలియా SR 160 రెడ్, వైట్, బ్లాక్, గ్రే మరియు బ్లూ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అయితే కంపెనీ ఈ స్కూటర్ యొక్క ఇంజిన్‌ను మార్చే అవకాశం లేదు. ఇందులో, ప్రస్తుత మోడల్‌లోని అదే 160.03 సిసి ఇంజన్ ఉపయోగించబడుతుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. ఇంజిన్ 10.84 బిహెచ్‌పి పవర్ మరియు 11.6 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో Aprilia SR 160 విడుదల రేపే.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

కొత్త ఎప్రిలియా SR 160 స్కూటర్ భారతీయ మార్కెట్లో కొత్త ఎప్రిలియా SXR 160 మాక్సీ స్కూటర్‌కు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొత్త స్కూటర్‌లో కంపెనీ అదే సస్పెన్షన్, బ్రేక్‌లు మరియు ఇతర హార్డ్‌వేర్‌లను ఉంచుతుంది. బుకింగ్ వెబ్‌సైట్‌లో స్కూటర్ ధర రూ. 1.06 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే) గా ఉంది.

దేశీయ మార్కెట్లో Aprilia SR 160 విడుదల రేపే.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

భారతదేశంలో ఎప్రిలియా యొక్క కొత్త వాహనాల విషయానికి వస్తే, కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో RS 660 స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ భారతదేశంలో రూ. 13.39 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేయబడింది. ఎప్రిలియా RS 660 బైక్ భారత మార్కెట్ కి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా తీసుకురాబడుతోంది. ఈ కారణంగా ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో Aprilia SR 160 విడుదల రేపే.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

ఎప్రిలియా RS 660 బైక్ మూడు కలర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది. అవి అపెక్స్ బ్లాక్, లావా రెడ్ మరియు యాసిడ్ గోల్డ్ కలర్స్. ఈ బైక్ 659 సిసి ప్యారలల్ ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. కావున ఇది 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 99 బిహెచ్‌పి పవర్ మరియు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ బైక్‌లో స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది.

దేశీయ మార్కెట్లో Aprilia SR 160 విడుదల రేపే.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

భారతదేశంలో ఎప్రిలియా RS 660 బైక్, హోండా CBR 650R, కవాసకి నింజా 650 మరియు KTM 790 డ్యూక్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో, అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. కావున దేశీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతుంది.

Most Read Articles

English summary
New aprilia sr 160 launch date revealed features engine specs details
Story first published: Monday, November 15, 2021, 10:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X