కొత్త కలర్‌లో దర్శనమిచ్చిన బజాజ్ పల్సర్ 150 బైక్ : వివరాలు

ప్రముఖ ద్విచక్రవాహన సంస్థ అయిన బజాజ్ ఆటో యొక్క ప్రముఖ మోడల్స్ లో ఒకటి బజాజ్ పల్సర్ 150. ఇది కంపెనీ యొక్క అత్యధిక అమ్ముడైన బైక్, ఈ బీఏ కి ఇప్పటికి దేశీయ మార్కెట్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. చాలామంది యువ కస్టమర్లు ఈ బైక్ నే ఎక్కువ ఇష్టపడతారు. అయితే కంపెనీ ఇప్పుడు ఈ బైక్ ను వైట్ కలర్ ఆప్షన్‌లో ప్రవేశపెట్టింది.

కొత్త కలర్‌లో దర్శనమిచ్చిన బజాజ్ పల్సర్ 150 బైక్ : వివరాలు

కొత్త వైట్ కలర్ లో ప్రవేశపెట్టిన ఈ బజాజ్ పల్సర్ 150 బైక్ ఇటీవల బజాజ్ డీలర్‌షిప్‌లో గుర్తించబడింది. కొత్త కలర్ లో దర్శనమిచ్చిన ఈ బైక్ యొక్క వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది డ్యూయల్ టోన్ కలర్ ఆప్సన్ లో బ్లాక్ అండ్ వైట్ కలయికలో చూడవచ్చు. దీనికి చాలా చోట్ల రెడ్ యాక్సెంట్స్ కూడా ఇవ్వబడ్డాయి. వీటివల్ల ఈ బైక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కొత్త కలర్‌లో దర్శనమిచ్చిన బజాజ్ పల్సర్ 150 బైక్ : వివరాలు

పల్సర్ 150 యొక్క ఈ కొత్త వేరియంట్‌లో ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ గమనించవచ్చు. దీనితో పాటు, మడ్‌గార్డ్‌లో కార్బన్ ఫైబర్ స్టిక్కరింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా గ్లోస్ బ్లాక్ ట్రీట్‌మెంట్‌ను చూడవచ్చు. ఇది బ్లాక్ అవుట్ అల్లాయ్ వీల్‌పై రిమ్స్‌లో రెడ్ స్ట్రిప్స్ చూడవచ్చు.

MOST READ:చెక్కతో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారు చేసిన కేరళైట్; వావ్ అంటున్న నెటిజెన్స్!

కొత్త కలర్‌లో దర్శనమిచ్చిన బజాజ్ పల్సర్ 150 బైక్ : వివరాలు

దీని ఇంజిన్ గేర్‌బాక్స్, సెంట్రల్ బాడీ ప్యానెల్, ఎగ్జాస్ట్ పైప్ మరియు ఇంజిన్ గార్డ్‌ను బ్లాక్ కలర్‌లో ఉంచారు. కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ రియర్ ఫెండర్ మరియు టూల్‌బాక్స్ కవర్‌లో చూడవచ్చు. దీనితో పాటు బజాజ్ పల్సర్ 150 బ్రాండింగ్ రూపకల్పనలో స్వల్ప మార్పులు చేయబడ్డాయి.

కొత్త కలర్‌లో దర్శనమిచ్చిన బజాజ్ పల్సర్ 150 బైక్ : వివరాలు

ఈ బైక్ లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్, ఎగ్జాస్ట్ కవర్, మాట్టే ఫినిష్ మరియు పిలియన్ గ్రాబ్ రైల్ వంటివి గ్లోస్ బ్లాక్‌లో ఉంచబడ్డాయి. ఇందులో కూడా మునుపటిలాగే సగం డిజిటల్ మరియు సగం అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వబడింది.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

కొత్త కలర్‌లో దర్శనమిచ్చిన బజాజ్ పల్సర్ 150 బైక్ : వివరాలు

ఇక ఈ కొత్త కలర్ బజాజ్ 150 బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది సాధారణ పల్సర్ 150 కు సమానంగా ఉంటుంది. దీనికి 149.5 సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఇవ్వబడుతుంది, ఇది 13.8 బిహెచ్‌పి శక్తిని మరియు 13.4 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

ఈ కొత్త వేరియంట్‌లో డ్యూయల్ స్ప్రింగ్‌తో సస్పెన్షన్ మరియు రియర్ ప్రీలోడ్ కోసం టెలిస్కోపిక్ ఫోర్కులు ఉంటాయి. దీనితో పాటు, బ్రేకింగ్ కోసం ఫ్రంట్ డిస్క్ మరియు రియర్ డ్రమ్ లేదా డిస్క్ బ్రేక్ ఆప్సన్ ఇవ్వబడుతుంది.

MOST READ:పార్కింగ్ సమయంలో కంట్రోల్ తప్పిన పోర్స్చే మాకాన్ ; తృటిలో తప్పిన ప్రమాదం

కొత్త కలర్‌లో దర్శనమిచ్చిన బజాజ్ పల్సర్ 150 బైక్ : వివరాలు

ఇవి కాకుండా, బజాజ్ పల్సర్ 150 బైక్ 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది సంస్థ యొక్క మూడు నియాన్ కలర్ ఎంపికలు (నియాన్ రెడ్, నియాన్ ఎల్లో మరియు నియాన్ సిల్వర్ల) కలిగి ఉంది. ఈ కొత్త ఎడిషన్ ధర ప్రామాణిక వేరియంట్ కంటే 2000 నుంచి 3000 రూపాయలు అధికంగా ఉంటుంది.

Image Courtesy: Jet wheels

Most Read Articles

English summary
2021 Bajaj Pulsar 150 New Color Option. Read in Telugu.
Story first published: Tuesday, March 16, 2021, 9:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X