Just In
- 2 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- 2 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు
- 2 hrs ago
భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ వస్తోంది.. ధర తలచుకుంటేనే షాక్..!
- 3 hrs ago
కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]
Don't Miss
- News
స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
- Movies
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు
ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ జావా మోటార్‌సైకిల్స్, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫోర్టీ టూ (42) మోడల్‌లో ఓ కొత్త 2021 వెర్షన్‌ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ సరికొత్త 2021 జావా ఫోర్టీ టూ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.1.84 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్‌లో సరికొత్త ఫీచర్లు, కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మరియు మూడు కొత్త పెయింట్ స్కీమ్ ఆప్షన్లు ఉన్నాయి.

ముందుగా కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌ను పరిశీలిస్తే, ఈ కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ ఇప్పుడు మూడు కొత్త రంగులో లభిస్తుంది. అవి: సీరియస్ వైట్, ఆల్-స్టార్ బ్లాక్ మరియు ఓరియన్ రెడ్. ఈ మూడు పెయింట్ స్కీమ్స్‌లో కూడా ఫ్యూయెల్ ట్యాంక్‌పై రేసింగ్ స్ట్రైప్స్‌తో కూడిన ‘42' నెంబర్ మరియు ‘క్లాసిక్ లెజెండ్స్' అనే బాడీ గ్రాఫిక్స్ ఉంటాయి.

ఇక ఈ కొత్త మోడల్‌లోని ఫీచర్ల విషయానికి వస్తే, ఈ మోటారుసైకిల్ ఇప్పుడు బార్-ఎండ్ మిర్రర్లతో లభిస్తుంది. రైడర్ మరియు పిలియన్ రైడర్ కోసం విస్తృత మరియు సౌకర్యవంతమైన సీట్స్, రీడిజైన్ చేయబడిన సైడ్ స్టాండ్, ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి.

జావా మోటార్‌సైకిల్స్ ఈ ఫోర్టీ టూ మోడల్ కోసం హెడ్‌ల్యాంప్ గ్రిల్ మరియు ఫ్లై-స్క్రీన్‌లను యాక్ససరీలుగా అందిస్తోంది. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కోసం ఈ మోటార్‌సైకిల్ సస్పెన్షన్ సెటప్‌ను కంపెనీ స్వల్పంగా రీట్యూన్ చేసింది. కాకపోతే, ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పు లేదు.

మునుపటి జావా ఫోర్టీ టూ మోడల్‌లో ఉపయోగించిన 293సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌నే ఈ కొత్త మోడల్‌లోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 27 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

అయితే, ఈ కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్‌లోని ఇంజన్ ఇప్పుడు క్రాస్-పోర్ట్ ప్రవాహంతో వస్తుంది, ఇది మెరుగైన శుద్ధీకరణ, ఇంధన సామర్థ్యం (మైలేజ్), బలమైన యాక్సిలరేషన్‌ను ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా, దీని డ్యూయెల్ ఎగ్జాస్ట్ పైపుల నుండి మరింత బలమైన థ్రోటల్ ఎగ్జాస్ట్ నోట్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ కొత్త మోడల్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా సపోర్ట్ చేస్తాయి. మునుపటితో పోలిస్తే, ఈ కొత్త మోటారుసైకిల్ ఇప్పుడు 2 కిలోల తక్కువ (172 కిలోగ్రాముల) బరువును కలిగి ఉండి మెరుగైన పనితీరును అందిస్తున్న జావా తెలిపింది.

కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ కోసం బుకింగ్‌లు మరియు టెస్ట్ రైడ్‌లు వెంటనే ప్రారంభమవుతాయని, త్వరలోనే ఈ మోటార్‌సైకిల్ డెలివరీలను కూడా ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఆసక్తిగల కస్టమర్లు ఈ కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్‌ను ఆన్‌లైన్‌లో కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న 181 జావా మోటార్‌సైకిల్ డీలర్‌షిప్‌ల ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు.