భారత్‌లో అడుగుపెట్టిన 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్; ధర & వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ట్రయంఫ్ తన 2021 బోన్‌విల్ బాబర్‌ను ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో ఈ కొత్త ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ ధర రూ. 11.75 లక్షలు. ఈ కొత్త బైక్ అప్డేటెడ్ ఫీచర్స్ మరియు అప్డేటెడ్ ఇంజిన్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారత్‌లో అడుగుపెట్టిన 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్; ధర & వివరాలు

కొత్త 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్ కి బ్లాక్ అవుట్ లుక్ ఇవ్వబడింది. దీనితో పాటు దీనికి ఇప్పుడు 77 యాక్ససరీస్ ఆప్సన్ కూడా ఇవ్వబడింది. ఈ బైక్ లో 1200 సిసి, హై టార్క్ బ్రిటిష్ ట్విన్ ఇంజన్ అమర్చబడింది. ఈ ఇంజన్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద 78 బిహెచ్‌పి శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 106 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.

భారత్‌లో అడుగుపెట్టిన 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్; ధర & వివరాలు

కొత్త 2021 బోన్‌విల్ బాబర్‌ యొక్క ఇంజిన్ యూరో 5 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తక్కువ ఉద్గారాలను మరియు ఎక్కువ మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ 12 లీటర్ల సామర్యం కలిగిన పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంటుంది. ఇది మునుపటి కంటే కూడా 33 శాతం ఎక్కువ పరిధిని ఇస్తుంది.

MOST READ:మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన పియాజియో: వివరాలు

భారత్‌లో అడుగుపెట్టిన 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్; ధర & వివరాలు

ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్ రెండు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి రోడ్ మరియు రైన్ మోడ్స్. ఇందులో త్రాటల్ కంట్రోల్ కోసం రైడ్ బై వైర్ సిస్టమ్ కూడా ఇందులో ఇవ్వబడింది. ఇందులో ట్విన్ ఎయిర్‌బాక్స్ ఇంటేక్ అనేది సీటు లోపల ఉంచబడుతుంది.

భారత్‌లో అడుగుపెట్టిన 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్; ధర & వివరాలు

ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా వాహనదారునికి మంచి రైడింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఈ బైక్ లో 47 మిమీ ఫ్రంట్ ఫోర్క్ మరియు 16 ఇంచెస్ వీల్ కలిగి ఉంది. ఈ బైక్ యొక్క వెనుక వైపు వైడ్ వీల్ సెటప్ కూడా అందుబాటులో ఉంటుంది. క్లాసిక్ వైర్ స్పోక్ డిజైన్ రెండు చక్రాలపై బ్లాక్ రిమ్స్ తో అందించబడింది.

MOST READ:ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

భారత్‌లో అడుగుపెట్టిన 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్; ధర & వివరాలు

కొత్త 2021 బాబర్‌ అవాన్ కోబ్రా టైర్లతో పాటు, బ్రెంబో యొక్క 2 పిస్టన్ కాలిపర్ మరియు ట్విన్ డిస్క్‌లతో అమర్చారు, కానీ వెనుకవైపు ఒకే డిస్క్ సెటప్ అందించబడుతుంది. ఇందులో భద్రతను మరింత మెరుగుపరచడానికి ఎబిఎస్ మరియు స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా ఇవ్వబడ్డాయి.

భారత్‌లో అడుగుపెట్టిన 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్; ధర & వివరాలు

ఈ బైక్ లో ఫ్లోటింగ్ అల్యూమినియం సీటు ఉంటుంది, ఇది హార్డ్-టెయిల్ లుక్ లో ఉంది. ఇందులో ఉన్న సీటు 690 మిమీ ఎత్తును కలిగి ఉంది. బైక్ యొక్క రైడింగ్ పొజిషన్ అడ్జస్ట్ చేయవచ్చు, అంతే కాకూండా ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇందులో అడ్జస్ట్ చేయవచ్చు.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేసిన మరో బాలీవుడ్ స్టార్, ఎవరో తెలుసా?

భారత్‌లో అడుగుపెట్టిన 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్; ధర & వివరాలు

2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌లో స్టీల్ ఫెండర్లు, ఫ్లాట్ బార్‌లు, అడ్జస్టబుల్ లివర్‌లు, క్లాసిక్ రియర్ డ్రమ్ బ్రేక్ ఇన్స్పైర్డ్ హబ్, సైడ్ మౌంటెడ్ ఇగ్నీషియన్ బారెల్, బ్లాక్ కలర్ బార్ అండ్ మిర్రర్, ఎల్‌ఇడి బుల్లెట్ ఇండికేటర్ మరియు కొత్త న్యూ సిగ్నేచర్ ఫుల్ ఎల్ఇడి హెడ్‌లైట్ ఇవ్వబడింది.

భారత్‌లో అడుగుపెట్టిన 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్; ధర & వివరాలు

ఈ బైక్ లో మెరుగైన దృశ్యమానత కోసం సిగ్నేచర్ ఎల్ఈడి డిఆర్ఎల్ తో అందించబడింది. ఇది కొత్త బ్లాక్ ఇంజిన్ కవర్ మరియు స్ప్రాకెట్ కవర్ కలిగి ఉంది. ఇది కొత్త డయల్ ఫేస్, ఇంటిగ్రేటెడ్ వార్నింగ్ లైట్ కలిగి ఉంది. 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్ మూడు కలర్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. అవి న్యూ మాట్టే స్ట్రోమ్ గ్రే మరియు మాట్టే ఐరన్‌స్టోన్, న్యూ కార్డోవన్ రెడ్ మరియు క్లాసిక్ జెట్ బ్లాక్ కలర్స్.

MOST READ:లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

Most Read Articles

English summary
2021 Triumph Bonneville Bobber Launched In India. Read in Telugu.
Story first published: Tuesday, May 25, 2021, 14:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X