Just In
- 31 min ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 42 min ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 50 min ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
- 1 hr ago
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
Don't Miss
- News
నవీన్ పట్నాయక్ అపాయింట్మెంట్ కోరిన జగన్-తొలిసారి- ఎందుకో తెలుసా ?
- Movies
RIP Vivek Sir వివేక్ మృతితో శోక సంద్రంలో సినీ తారలు.. అనుభూతులను గుర్తు చేసుకొంటూ ఎమోషనల్
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Sports
IPL 2021: టఫ్ ఫైట్: ఎదురుగా ఉన్నది ఏనుగు..సన్‌రైజర్స్ పరిస్థితేంటీ? ప్రిడిక్షన్స్ ఇవీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టీవీఎస్ నుండి సరికొత్త 2021 స్టార్ సిటీ ప్లస్ బైక్ వస్తోంది: టీజర్ విడుదల
చెన్నైకి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత పాపులర్ 110సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్ 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్'లో కంపెనీ ఓ కొత్త 2021 మోడల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కంపెనీ ఓ కొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది.

కొత్త 2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మోటార్‌సైకిల్ అప్‌గ్రేడెడ్ డిజైన్ మరియు ఫీచర్లతో రావచ్చని సమాచారం. కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌ను స్పెషల్ ఎడిషన్‌గా విడుదల చేస్తారా లేక కేవలం కొత్త కలర్ ఆప్షన్‌లో మాత్రమే విడుదల చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

టీజర్‌లో చూపించిన ఫొటో ప్రకారం, ఈ బైక్ జనవరి 2020లో విడుదలైన బిఎస్6 స్టార్ సిటీ ప్లస్ మాదిరిగానే కనిపిస్తుంది. టీవీఎస్ ఈ పాపులర్ బైక్‌ను కొత్త డిజైన్ మరియు బిఎస్6 ఇంజన్‌తో గతేడాది జనవరిలో మార్కెట్లో విడుదల చేసింది.
MOST READ:టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ ఆ "లైన్" దాటితే, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు!

కొత్త స్టార్ సిటీ ప్లస్‌లో పెద్ద ఎల్‌ఈడీ హెడ్‌లైట్, పెద్ద హెడ్‌లైట్ కౌల్, కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు ఫీచర్ అప్‌డేట్‌లు ఉన్నాయి. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌లో ఉపయోగించిన బిఎస్6 ఇంజన్ ఎకో-థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది మునుపటి కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది.

టీవీఎస్ తమ అపాచీ సిరీస్ బైక్‌లలో కూడా ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. కొత్తగా చేసిన అప్‌డేట్స్‌లో భాగంగా, ఈ బైక్‌లో యుఎస్‌బి మొబైల్ ఛార్జర్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 5-స్టెప్ అడ్జస్టబల్ రియర్ సస్పెన్షన్ మరియు ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

ఈ మోటార్‌సైకిల్‌లో ఇరువైపులా డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో ఉపయోగించిన బిఎస్6 109సిసి ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ గరిష్టంగా 7,350 ఆర్‌పిఎమ్ వద్ద 8.08 బిహెచ్‌పి శక్తిని మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

సిటీలో కానీ లేదా పల్లెల్లో కానీ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. దీని మెయింటినెన్స్ మరియు రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ బైక్ లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
MOST READ:భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

ప్రస్తుతం మార్కెట్లో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ధర రూ.65,865 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మరి ఈ కొత్త వేరియంట్ ధరను కంపెనీ ఎలా నిర్ణయిస్తుందో వేచి చూడాలి. ఈ కొత్త బైక్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

టీవీఎస్ మోటార్ గడచిన జనవరి 2021లో మొత్తం 2,94,596 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (జనవరి 2020లో) కంపెనీ అమ్మకాలు 2,05,216 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 26 శాతం పెరిగాయి.
MOST READ:మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో