పెట్రోల్ బంకులోనే Ola స్కూటర్ల చార్జింగ్.. BPCL పెట్రోల్ బంకుల వద్ద ఓలా హైపర్ చార్జర్లు..!

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్‌ను భారతదేశంలో ప్రారంభించి సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) సంస్థ, ఇటీవలే తమ స్కూటర్లను కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, ఓలా ఎలక్ట్రిక్ తమ కస్టమర్లకు స్కూటర్ల చార్జింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు చార్జింగ్ మౌళిక సదుపాయాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది. పబ్లిక్ చార్జింగ్ పాయింట్లతో పాటుగా పెట్రోల్ బంకుల వద్ద కూడా తమ హైపర్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.

పెట్రోల్ బంకులోనే Ola స్కూటర్ల చార్జింగ్.. BPCL పెట్రోల్ బంకుల వద్ద ఓలా హైపర్ చార్జర్లు..!

ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారతదేశంలో ప్రారంభించడానికి ముందే, కంపెనీ దేశవ్యాప్తంగా హైపర్‌చార్జర్ అనే ఫాస్ట్ చార్జింగ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించడం మొదలుపెట్టింది. ఓలా ఎలక్ట్రిక్ ఈ దేశవ్యాప్తంగా మొత్తం 400 నగరాల్లో 1,00,000 ప్రదేశాలు మరియు టచ్‌పాయింట్‌లలో ఈ హైపర్‌ఛార్జర్‌లను చేయనుంది. తాజాగా, ఇప్పుడు బ్రిటీష్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL) పెట్రోల్ బంకుల వద్ద కూడా ఓలా తమ హైపర్‌చార్జర్లను ఇన్‌స్టాల్ చేస్తోంది.

పెట్రోల్ బంకులోనే Ola స్కూటర్ల చార్జింగ్.. BPCL పెట్రోల్ బంకుల వద్ద ఓలా హైపర్ చార్జర్లు..!

ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లు ఇప్పుడు ఈ పెట్రోల్ బంకులు వద్ద తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఈ హైపర్ చార్జర్ల సాయంతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు కేవలం నిమిషాల వ్యవధిలోనే తమ స్కూటర్ బ్యాటరీలను చార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ యొక్క హైపర్‌చార్జర్‌లు కేవలం 18 నిమిషాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలను 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ చేయగలవు. ఈ చార్జ్ సాయంతో ఓలా ఎలక్ట్రిక్ గరిష్టంగా 75 కి.మీ వరకు సరిపడా రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది.

పెట్రోల్ బంకులోనే Ola స్కూటర్ల చార్జింగ్.. BPCL పెట్రోల్ బంకుల వద్ద ఓలా హైపర్ చార్జర్లు..!

వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల చార్జింగ్ కోసం గంటలతరబడి వేచి ఉండే సమయాన్ని ఇది ఆదా చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ రాబోయే రోజుల్లో తమ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించే ప్రణాళిక గురించి వెల్లడి చేశారు. ఓలా ఎలక్ట్రిక్ ఈ ఏడాది చివరి నాటికి భారతదేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం దాదాపు 4,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని అగర్వాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో తెలిపారు.

పెట్రోల్ బంకులోనే Ola స్కూటర్ల చార్జింగ్.. BPCL పెట్రోల్ బంకుల వద్ద ఓలా హైపర్ చార్జర్లు..!

ఈ హైపర్‌ఛార్జర్‌లను ప్రస్తుతం BPCL పెట్రోల్ పంపుల వద్ద మరియు S1 మరియు S1 ప్రో కస్టమర్‌ల కోసం నివాస సముదాయాల వద్ద అమర్చుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్ ప్రారంభమైందని, ప్రస్తుతం వీటిని ప్రధాన BPCL పంపులు మరియు నివాస సముదాయాల వద్ద ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి 4,000 పాయింట్లకు పైగా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భవీష్ అగర్వాల్ తన ట్విట్టర్‌లో తెలిపారు.

పెట్రోల్ బంకులోనే Ola స్కూటర్ల చార్జింగ్.. BPCL పెట్రోల్ బంకుల వద్ద ఓలా హైపర్ చార్జర్లు..!

ఈ హైపర్ చార్జింగ్ నెట్‌వర్క్ ను భారతదేశం అంతటా ఇన్‌స్టాల్ చేస్తున్నామని, జూన్ 2022 చివరి వరకు వినియోగదారులందరూ దీనిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చని అగర్వాల్ చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో, ఓలా ఎలక్ట్రిక్ తమ మొదటి హైపర్‌చార్జర్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఓలా హైపర్‌చార్జర్ వినియోగదారులకు అతుకులు లేని ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

పెట్రోల్ బంకులోనే Ola స్కూటర్ల చార్జింగ్.. BPCL పెట్రోల్ బంకుల వద్ద ఓలా హైపర్ చార్జర్లు..!

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగదారులు ఈ చార్జింగ్ పాయింట్లను మరో ఆరు నెలల పాటు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా హైపర్‌చార్జర్ నెట్‌వర్క్‌లోని ఒక పాయింట్‌కి చేరుకుని, మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జింగ్ పాయింట్‌లోకి ప్లగ్ చేయడమే. ఇందులో ఓలా ఎలక్ట్రిక్ యాప్‌ని ఉపయోగించి రియల్ టైమ్‌లో చార్జింగ్ స్టేటస్‌ను కూడా పర్యవేక్షించుకునే అవకాశం ఉంటుంది మరియు ఇది సేవ కోసం చెల్లింపును కూడా అనుమతిస్తుంది.

పెట్రోల్ బంకులోనే Ola స్కూటర్ల చార్జింగ్.. BPCL పెట్రోల్ బంకుల వద్ద ఓలా హైపర్ చార్జర్లు..!

కంపెనీ వెబ్‌సైట్ నెట్‌వర్క్ లొకేషన్‌లను ఛార్జ్ చేయడానికి సిటీ వారీ ప్లాన్‌ను లిస్ట్ చేస్తుంది. అనేక టైర్ I మరియు టైర్ II నగరాలు ఈ హైపర్ ఛార్జింగ్ నెట్‌వర్క్ పరిధిలోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే, కంపెనీ గడచిన ఆగస్ట్ 15వ తేదీన భారత మార్కెట్లో తమ ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. దేశీయ విపణిలో వీటి ధరలు వరుసగా రూ. 99,999 మరియు రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

పెట్రోల్ బంకులోనే Ola స్కూటర్ల చార్జింగ్.. BPCL పెట్రోల్ బంకుల వద్ద ఓలా హైపర్ చార్జర్లు..!

ఇందులో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జ్ పై దాదాపు 120 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఇందులో 3.97 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్‌ మరియు 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ ఉంటాయి. అలాగే, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 180 కిమీల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఈ స్కూటర్ మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. రైడర్ ఎంచుకునే మోడ్ ని బట్టి స్కూటర్ యొక్క వేగం మరియు రేంజ్ మారుతూ ఉంటాయి. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Now you can charge your ola s1 at bpcl pumps ola electirc started installing hyperchargers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X