అమ్మకాల్లో ప్రపంజనం సృష్టించిన Okinawa: 2021 లో ఒక లక్ష సేల్స్

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న సమయంలో ఒకినావా (Okinawa) కంపెనీ కూడా దేశీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. కంపెనీ భారతీయ విఫణిలో హై-స్పీడ్ మరియు లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెఎరుగుతున్న డిమాండ్ కారణంగా ఒకినావా అమ్మకాలు ఈ సంవత్సరం ఏకంగా 1 లక్ష యూనిట్లను విక్రయించినట్లు అధికారికంగా తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అమ్మకాల్లో ప్రపంజనం సృష్టించిన Okinawa: 2021 లో ఒక లక్ష సేల్స్

నివేదికల ప్రకారం, కంపెనీ భారతదేశంలో విక్రయించిన మొత్తం అమ్మకాలలో Okinawa iPraise+ మరియు Praise Pro స్కూటర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో దాదాపు వీటి అమ్మకాలు 60 శాతం నుంచి 70 శాతం వరకు ఉన్నాయని కంపెనీ తెలిపింది. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను పెంచడానికి తన పరిధిని నిరంతరం పెంచుతూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ భారతదేశంలోని 400కు పైగా డీలర్‌షిప్‌లకు తన కార్యకలాపాలను విస్తరించింది. ఇందులో టైర్-2, టైర్-3 మరియు గ్రామీణ మార్కెట్లు అలాగే దేశంలోని మెట్రో నగరాలు కూడా ఉన్నాయి.

అమ్మకాల్లో ప్రపంజనం సృష్టించిన Okinawa: 2021 లో ఒక లక్ష సేల్స్

ఒకినావా కంపెనీ ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో అత్యాధునిక అనుభవ కేంద్రం ఒకినావా గెలాక్సీని ప్రారంభించిన విషయం కూడా తెలిసిందే. అంతే కాకూండా రాబోయే సంవత్సరంలో భారతదేశంలో మరో 50 ఒకినావా గెలాక్సీ స్టోర్‌లను ప్రారంభించడానికి కంపెనీ సిద్ధమవుతోంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కంపెనీ యొక్క అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని స్పష్టంగా తెలుస్తోంది.

అమ్మకాల్లో ప్రపంజనం సృష్టించిన Okinawa: 2021 లో ఒక లక్ష సేల్స్

కంపెనీ సాధించిన ఈ విక్రయాలను గురించి, ఓకినావా ఆటోటెక్ ఎమ్డి మరియు వ్యవస్థాపకుడు జీతేందర్ శర్మ మాట్లాడుతూ.. ఒకినావాపై ప్రజలు చూపుతున్న విశ్వాసానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. మేము కస్టమర్ల విశ్వాసానికి ఎప్పుడూ బద్దులమై ఉంటాము. కావున ఇంత గొప్ప విజయాన్ని సాధించగలిగాము అని ఆయన అన్నారు.

అమ్మకాల్లో ప్రపంజనం సృష్టించిన Okinawa: 2021 లో ఒక లక్ష సేల్స్

అంతే కాకూండా మా ఉత్పత్తులలో మంచి నాణ్యత మరియు మంచి పరిధిని అందిస్తున్న కారణంగా ఎక్కువమంది కొనుగోలుదారులు మా ఉత్పత్తులను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడానికి మరియు కస్టమర్లకు మరింత చేరువకు చేరుకోవడానికి కంపెనీ యొక్క పరిధిని సర్వీస్ వంటి వాటిని విస్తరిస్తామని కూడా అయన అన్నారు.

అమ్మకాల్లో ప్రపంజనం సృష్టించిన Okinawa: 2021 లో ఒక లక్ష సేల్స్

ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంచడం మరియు అన్ని రకాల అపోహలను తొలగించడం కోసం మేము మొదటి నుండి కృషి చేస్తూనే ఉన్నాము. మార్కెట్లో యువ కస్టమర్లను ఆకర్శించడానికి కూడా మేము తగిన ప్రయత్నాలు చేస్తున్నాము. అంతే కాకూండా ప్రస్తుత తరానికి కావలసిన అన్ని ఫీచర్లను కూడా మేము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అందించడానికి కృషి చేస్తున్నామని కూడా అయన అన్నారు.

అమ్మకాల్లో ప్రపంజనం సృష్టించిన Okinawa: 2021 లో ఒక లక్ష సేల్స్

మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు పురుడుపోసుకుంటున్న సమయంలో కొనుగోలుదారులు కూడా ఆధునిక ఉత్పత్తులను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున కంపెనీ కూడా వారి అభిరుచికి తగిన విధమైన ఉత్పతులను అందించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

అమ్మకాల్లో ప్రపంజనం సృష్టించిన Okinawa: 2021 లో ఒక లక్ష సేల్స్

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా రాయితీలను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి ఫేమ్-2 కింద సబ్సిడీ కూడా లభిస్తుంది. ఇందులో భాగంగానే ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైనా కూడా ఫేమ్-2 స్కీమ్ కింద దాదాపు రూ. 17,900 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

అమ్మకాల్లో ప్రపంజనం సృష్టించిన Okinawa: 2021 లో ఒక లక్ష సేల్స్

ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు మొత్తం తీసివేయగా కంపెనీ ఫ్లాగ్‌షిప్ Okinawa iPraise+ ధర రూ. 99,708 (ఎక్స్-షోరూమ్) కి చేరింది. అంతే కాకుండా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను మోడల్‌ను బట్టి రూ.7,200 మరియు రూ.17900 మధ్య తగ్గుతుంది. ఈ తగ్గుదల కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

అమ్మకాల్లో ప్రపంజనం సృష్టించిన Okinawa: 2021 లో ఒక లక్ష సేల్స్

కంపెనీ యొక్క Okinawa iPraise+ విషయానికి వస్తే, ఇది బ్రాండ్‌లో అత్యధికంగా అమ్మకాలను జరిపిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ కి దేశీయ మార్కెట్లో మునుపటికంటే కూడా ఇప్పుడు దాదాపు మూడు రెట్లు డిమాండ్ పెరిగింది. Okinawa iPraise+ ఎలక్ట్రిక్ స్కూటర్ 1 కిలోవాట్ BLDC ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఇది పోర్టబుల్ బ్యాటరీతో జత చేయబడింది.

అమ్మకాల్లో ప్రపంజనం సృష్టించిన Okinawa: 2021 లో ఒక లక్ష సేల్స్

Okinawa iPraise+ స్కూటర్ ఒక్క ఛార్జ్‌కు గరిష్టంగా 160 కి.మీ రైడింగ్ పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా ఇది కేవలం 1 గంట సమయంలో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. కావున వినియోగదారుల యొక్క సమయాన్ని కూడా బాగా ఆదా చేస్తుంది. అయితే ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసుకోవడానికి గరిష్టంగా 3 గంటల సమయం పడుతుంది.

అమ్మకాల్లో ప్రపంజనం సృష్టించిన Okinawa: 2021 లో ఒక లక్ష సేల్స్

Okinawa iPraise+ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 58 కి.మీ. ఇందులో ఆధునిక టెక్నాలజీ కూడా ఉపయోగించబడి ఉంటుంది. ఈ స్కూటర్ మొబైల్ అప్లికేషన్ మరియు mdash Okinawa ఎకో వంటి యాప్‌లకు కూడా కనెక్ట్ చేయబడింది. ఈ యాప్ స్కూటర్ యొక్క వినియోగాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి అధునాతన మరియు ఆధునిక ఫీచర్స్ మరియు టెక్నాలజీలను కలిగి ఉన్న కారణంగా కంపెనీ ఏకంగా 1 లక్ష యూనిట్లను విక్రయించగలిగింది.

Most Read Articles

English summary
Okinawa scooters crosses 1 lakh electric vehicles sales in year 2021 details
Story first published: Wednesday, December 22, 2021, 13:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X