S1 మరియు S1 Pro స్కూటర్ డెలివరీలు ఎప్పుడో తెలిపిన Ola: పూర్తి వివరాలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Electric Scooter) బుక్ చేసుకున్న కస్టమర్లందరూ కూడా ఇప్పుడు డెలివరీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ గురించి ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు లేదా బుక్ చేసుకున్న వారు టెస్ట్ రైడ్ చేయవచ్చు. కంపెనీ ఈ అవకాశం డెలివరీకి ముందే ప్రారంభించింది.

S1 మరియు S1 Pro స్కూటర్ డెలివరీలు ఎప్పుడో తెలిపిన Ola: పూర్తి వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2021 నవంబర్ చివరి వారంలో ప్రారంభమవుతాయి. కంపెనీ మొదట డెలివరీలను, మొదట బుక్ చేసుకున్న వారికి అందిస్తుంది. కావున నవంబర్ చివరి వారం నుండి మార్చి చివరి వరకు దశలవారీగా డెలివరీ చేయనున్నట్లు తెలుస్తుంది.

S1 మరియు S1 Pro స్కూటర్ డెలివరీలు ఎప్పుడో తెలిపిన Ola: పూర్తి వివరాలు

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్ ప్రక్రియ యొక్క రెండవ దశ 2021 డిసెంబర్ చివరిలో ప్రారంభమవుతుంది. అయితే అప్పుడు బుక్ చేసుకున్న కస్టమర్లకు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి డెలివరీ చేయబడుతుంది. Ola యొక్క కొత్త EV స్కూటర్ కొనుగోలు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరుగుతుంది.

S1 మరియు S1 Pro స్కూటర్ డెలివరీలు ఎప్పుడో తెలిపిన Ola: పూర్తి వివరాలు

Ola యొక్క కొత్త EV స్కూటర్ల కొనుగోలు కోసం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 1.50 లక్షల కంటే ఎక్కువ మంది కస్టమర్లు బుక్ చేసుకోవడంతో, కంపెనీ ప్రధాన బ్యాంకుల భాగస్వామ్యంతో ఆకర్షణీయమైన EMI ఎంపికలను కూడా అందిస్తోంది. కావున కొనుగోలుదారులు ఓలా ఫైనాన్షియల్ సర్వీస్ ద్వారా కూడా ఈ కొత్త స్కూటర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు.

S1 మరియు S1 Pro స్కూటర్ డెలివరీలు ఎప్పుడో తెలిపిన Ola: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో Ola S1 ధర రూ.99,999 కాగా, Ola S1 Pro ధర రూ. 1,29,999 వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపైనా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను కూడా కొనుగోలుదారులు వినియోగించుకోవచ్చు. కావున ఈ సబ్సిడీల కింద వీటి ధర మరింత తక్కువగా ఉంటుంది.

S1 మరియు S1 Pro స్కూటర్ డెలివరీలు ఎప్పుడో తెలిపిన Ola: పూర్తి వివరాలు

కొత్త Ola ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలను అందించడానికి అభివృద్ధి చేయబడిన Ola ఎలక్ట్రిక్ యాప్, వాహన కొనుగోలు, డెలివరీ, కస్టమర్ సర్వీస్ మరియు ఇన్సూరెన్స్ వంటి వాటిని గురించి తెలియజేస్తుంది. కావున ఇది వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

S1 మరియు S1 Pro స్కూటర్ డెలివరీలు ఎప్పుడో తెలిపిన Ola: పూర్తి వివరాలు

Ola Electric స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

S1 మరియు S1 Pro స్కూటర్ డెలివరీలు ఎప్పుడో తెలిపిన Ola: పూర్తి వివరాలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ డిజైన్ విషయానికి వస్తే, ఇది సింపుల్‌గా కనిపించే ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది.

S1 మరియు S1 Pro స్కూటర్ డెలివరీలు ఎప్పుడో తెలిపిన Ola: పూర్తి వివరాలు

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్, కాంటూర్డ్ సీట్లు, అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

S1 మరియు S1 Pro స్కూటర్ డెలివరీలు ఎప్పుడో తెలిపిన Ola: పూర్తి వివరాలు

Ola Electric Scooter యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

S1 మరియు S1 Pro స్కూటర్ డెలివరీలు ఎప్పుడో తెలిపిన Ola: పూర్తి వివరాలు

Ola Electric స్కూటర్ 3.9 కిలో వాట్ సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో సుమారు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఓలా అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను చేర్చింది.

S1 మరియు S1 Pro స్కూటర్ డెలివరీలు ఎప్పుడో తెలిపిన Ola: పూర్తి వివరాలు

ఓలా S1 ఒక పూర్తి ఛార్జ్‌పై 121 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, అయితే హై-ఎండ్ వేరియంట్ S1 Pro మాత్రం 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. అంతే కాకూండా, ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

Most Read Articles

English summary
Ola electric revealed s1 s1 pro electric scooter delivery timeline
Story first published: Wednesday, November 17, 2021, 12:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X