డెలివరీలు, టెస్ట్ రైడ్ విషయంలో Ola ఎలక్ట్రిక్ ఎందుకింత జాప్యం

అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్ "Ola Electric Scooter". ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదలకాకముందు నుంచి భారీ అంచనాలను కైవసం చేసుకుంది. అయితే ఇది 2021 ఆగష్టు 15 న అధికారికంగా విడుదల చేయబడింది. అయితే కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం, Ola ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలు నవంబర్ నుండి ప్రారంభమవుతాయని తెలిసింది. కానీ దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు.

ఇప్పటికీ కొలిక్కిరాని Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు, టెస్ట్ రైడ్ కూడా.. ఎందుకీ ఆలస్యం

కంపెనీ తన ఎలక్ట్రిక్స్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ 2021 నవంబర్ 10 నుండి ప్రధాన నగరాల్లో ప్రారంభించనున్నట్లు కూడా ఇదివరకే తెలిపింది. అయితే ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ యొక్క భారీ డిమాండ్ కారణంగా ఈ ఏడాది డిసెంబర్ 16 నుండి నెక్స్ట్ బ్యాచ్ బుకింగ్ ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

ఇప్పటికీ కొలిక్కిరాని Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు, టెస్ట్ రైడ్ కూడా.. ఎందుకీ ఆలస్యం

అయితే Ola ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క తదుపరి బ్యాచ్ విక్రయాన్ని నవంబర్ 1 నుండి ప్రారంభించాలని కంపెనీ ఇంతకుముందు తెలిపింది, కానీ ఇప్పుడు దానిని రద్దు చేసి, విక్రయాలను మరింత ముందుకు సాగించింది. కొనుగోలు మరియు డెలివరీ మధ్య నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి మరియు ఇప్పటికే ఉన్న ఆర్డర్‌లకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇలా చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఇప్పటికీ కొలిక్కిరాని Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు, టెస్ట్ రైడ్ కూడా.. ఎందుకీ ఆలస్యం

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ జూలైలో భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది, అయితే భారత స్వాతంత్య్రదినోత్సవం రోజున విడుదలైంది. ఆ రోజు నుంచి కంపెనీ బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం ఒకరోజులో లక్షకు పైగా బుకింగ్స్ స్వీకరించగలిగింది.

ఇప్పటికీ కొలిక్కిరాని Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు, టెస్ట్ రైడ్ కూడా.. ఎందుకీ ఆలస్యం

కంపెనీ 2021 సెప్టెంబర్ 15 నుంచి విక్రయాలను ప్రారంభించింది. విక్రయాలు ప్రారంభమైన 2 రోజుల్లో కంపెనీ దాదాపు 5,500 స్కూటర్లు విక్రయించినట్లు తెలిపింది. వీటి ధర సుమారు రూ. 1,100 కోట్లు. ఇది నిజంగా అద్భుతమైన రికార్డ్. తరువాత కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను త్వరగా ప్రారంభించడానికి తగిన ప్రయత్నాలు చేస్తుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొంత ఆలస్యం అవుతూనే ఉంది.

ఇప్పటికీ కొలిక్కిరాని Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు, టెస్ట్ రైడ్ కూడా.. ఎందుకీ ఆలస్యం

సాధారణంగా, ఏదైనా కొత్త మోడల్‌కు సంబంధించిన డెలివరీలకు సంబంధించిన విక్రయాలు జరిగిన కేవలం ఒక నెలలోపే ప్రారంభమవుతాయి, కానీ ఇప్పటివరకు Ola ఎలక్ట్రిక్ స్కూటర్‌ డెలివరీలు ఇంకా జరగటం లేదు. ఇది చాలా ఆలస్యం అవుతోంది. అయితే మొదటి బ్యాచ్‌కు సంబంధించిన డెలివరీ నవంబర్‌లో ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది, అయితే మొదటి రోజు ఎక్కడా డెలివరీ ప్రారంభించబడలేదు. అదే సమయంలో, డెలివరీ తేదీ గురించి కంపెనీ ఇప్పటికీ వినియోగదారులకు తెలియజేయలేదు, కాబట్టి వినియోగదారులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు మళ్లీ ఆలస్యం కావచ్చని ఊహిస్తున్నారు.

ఇప్పటికీ కొలిక్కిరాని Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు, టెస్ట్ రైడ్ కూడా.. ఎందుకీ ఆలస్యం

ఇక Ola ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ విషయానికి వస్తే, కంపెనీ 2021 అక్టోబర్‌ నెలలోనే ప్రధాన నగరాల్లో టెస్ట్ రైడ్ ప్రారంభించబడుతుందని తెలిపింది. అయితే ఇది కూడా నవంబర్ 10 వాయిదా పడింది. అయితే ఈ తేదీలో అయినా టెస్ట్ రైడ్ జరుగుతుందా.. లేదా అనేది ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే, డేట్, టైమ్ మరియు ప్లేస్ వంటివాటికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇంతవరకు అధికారికంగా తెలియజేయలేదు. కావున టెస్ట్ రైడ్ పైన కూడా కస్టమర్లు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికీ కొలిక్కిరాని Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు, టెస్ట్ రైడ్ కూడా.. ఎందుకీ ఆలస్యం

చాలా మంది కస్టమర్‌లు ఏదైనా వాహనాన్ని టెస్ట్ రైడ్ చేసి దానిని పూర్తిగా పరీక్షించి కొనుగోలు చేస్తారు, అయితే అయితే కంపెనీ టెస్ట్ రైడ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా అమ్మకాలను పరిమితం చేయాలనుకుంటోంది. కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని ప్రారంభించినప్పటికీ, నెలకు ఎన్ని యూనిట్లు తయారు చేయనున్నారనే దానిపై కూడా అధికారిక సమాచారం ఇవ్వలేదు. అటువంటి పరిస్థితిలో, రాబోయే కొత్త కస్టమర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ కోసం ఎంతకాలం వేచి ఉండాలనే దానిపై సమాచారం అందుబాటులో లేదు.

ఇప్పటికీ కొలిక్కిరాని Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు, టెస్ట్ రైడ్ కూడా.. ఎందుకీ ఆలస్యం

Ola కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పెట్టిన తరుణంలో దేశవ్యాప్తంగా 1,000 నగరాలకు పైగా దాదాపు 1 లక్ష హైపర్‌చార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు తెలిపింది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు కేవలం ఒక్క హైపర్‌చార్జర్ స్టేషన్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసింది. అది కూడా కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో మొదటి హైపర్ ఛార్జర్ స్టేషన్ ఏర్పాటు చేసింది.

ఇప్పటికీ కొలిక్కిరాని Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు, టెస్ట్ రైడ్ కూడా.. ఎందుకీ ఆలస్యం

ప్రస్తుతం కేవలం ఒక్క హైపర్ ఛార్జింగ్ స్టేషన్ మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల, డెలివరీలు త్వరలో ప్రారంభమయితే, వాటికి ఛార్జింగ్ సదుపాయాలను గురించి చాలామంది కంపెనీ కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే కంపెనీ దీనికి ఎటువంటి పరిష్కారం సూచిస్తుందో తెలియాల్సి ఉంది.

ఇప్పటికీ కొలిక్కిరాని Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు, టెస్ట్ రైడ్ కూడా.. ఎందుకీ ఆలస్యం

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

Ola కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ కి మంచి ప్రజాదరణ ఉన్నప్పటికీ, కంపెనీ చేస్తున్న ఈ ఆలస్యం వల్ల కస్టమర్లతో కొంత అభిప్రాయం బేధం ఏర్పడే అవకాశం ఉంటుంది. కావున కంపెనీ వీలైనంత త్వరగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ మరియు దానికి కావాల్సిన ఛార్జింగ్ సదుపాయాలపైన ఒక ఖచ్చితమైన అధికారిక ప్రకటన చేయాలి. అప్పుడే కస్టమర్లకు కొంత ఉపశమనం కలుగుతుంది.

Most Read Articles

English summary
Ola electric scooter delivery bookings details
Story first published: Tuesday, November 2, 2021, 13:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X