ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ & టైమ్ ప్రకటించిన ఓలా; చూసారా!!

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతోమంది కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కంపెనీ దీని గురించి ప్రతి రోజు ఏదో ఒక కొత్త న్యూస్ విడుదల చేస్తూనే ఉంది. కంపెనీ ఇంతకు ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా లాంచ్ తేదీ మాత్రమే కాకుండా లాంచ్ అయ్యే సమయాన్ని కూడా కంపెనీ విడుదల చేసింది.

ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ & టైమ్ ప్రకటించిన ఓలా; చూసారా!!

ఓలా కంపెనీ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం ఆగష్టు 15 అంటే భారత స్వాతంత్య దినోత్సవం రోజున మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలకు ముందే మార్కెట్లో మంచి రెస్పాన్స్ పొందింది. ఈ కారణంగానే చాలామంది కస్టమర్లు ఈ స్కూటర్ కొనుగోలుకై వేచి చూస్తున్నారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ & టైమ్ ప్రకటించిన ఓలా; చూసారా!!

ఓలా కంపెనీ ఇప్పటికే ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లో 1 లక్ష యూనిట్ల బుకింగ్స్ దాటింది. ఒక వెహికల్ విడుదలకు ముందు ఇంత భారీ సంఖ్యంలో బుకింగ్స్ పొందటం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు.

ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ & టైమ్ ప్రకటించిన ఓలా; చూసారా!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి కేవలం 499 రూపాయలు చెల్లింది బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,000 నగరాల నుండి బుకింగ్‌లను అందుకుని ఒక కొత్త రికార్డ్ కైవసం చేసుకుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ & టైమ్ ప్రకటించిన ఓలా; చూసారా!!

కంపెనీ ఇంకా ఈ స్కూటర్ ధరను అధికారికంగా ప్రకటించలేదు, కావున ఇడుదల సమయంలో ధర కూడా ప్రకటించబడుతుంది. ఆ సమయంలో మీకు ధర సమంజసం కాదనిపిస్తే బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు మీ బుకింగ్ అమౌంట్ రీఫండ్ అవుతుంది. దీనికి ఎలాంటి రద్దు ఛార్జీలు ఉండవు.

ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ & టైమ్ ప్రకటించిన ఓలా; చూసారా!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ. 1 లక్షలోపు ఉంటుందని భావిస్తున్నాము. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటలో ఉన్న ఫేమ్ 2 సబ్సిడీ మరియు రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు మొత్తం అందుకున్న తరువాత ఈ స్కూటర్ మరింత తక్కువా దహరకు లభించే అవకాశం ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ & టైమ్ ప్రకటించిన ఓలా; చూసారా!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, కలర్ ఎల్సిడి డిస్‌ప్లే, క్లౌడ్ కనెక్టివిటీ, నావిగేషన్ టెక్నాలజీ, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ మరియు అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ & టైమ్ ప్రకటించిన ఓలా; చూసారా!!

ఇప్పటికే వెల్లడైన సమాచారం ఓలా స్కూటర్‌ను S1 మరియు S1 ప్రో అనే రెండు వేరియంట్లలో తీసుకువచ్చే అవకాశం ఉంది. రెండు వేరియంట్‌లను 'S' సిరీస్ స్కూటర్ కింద విక్రయించవచ్చు. అయితే, ఈ మోడళ్ల పేర్లను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ ఇదివరకే ప్రకటించింది. కావున కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ స్కూటర్ ఎంచుకోవచ్చు.

ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ & టైమ్ ప్రకటించిన ఓలా; చూసారా!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ కంపెనీ నేరుగా హోమ్ డెలివరీ చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించింది. కస్టమర్లు కూడా ఎక్కువా సంఖ్యంలో హోమ్ డెలివరీ విధంగా ఎంచుకుంటున్నారు. కావున ఈ స్కూటర్ బుక్ చేసుకున్న భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు అందించబడుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ & టైమ్ ప్రకటించిన ఓలా; చూసారా!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కిలోవాట్ నుండి 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఇవ్వవచ్చు. ఫాస్ట్ ఛార్జర్‌తో, ఈ స్కూటర్‌ను కేవలం 18 నిమిషాలలో 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. అదే సమయంలో, నార్మల్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ & టైమ్ ప్రకటించిన ఓలా; చూసారా!!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయినా తరువాత 100 నుంచి 150 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్స్ కలిగి ఉండటం వల్ల, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో చేర్చబడుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ & టైమ్ ప్రకటించిన ఓలా; చూసారా!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 ఎక్స్‌కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకూండా బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు కూడా ప్రత్యర్థిగా ఉండనుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కోసం ఎంతోమంది ఆసక్తిగా చూస్తున్నారని మనం ఇదివరకే చెప్పుకున్నాం. అయితే ఈ స్కూటర్ విడుదలైన తర్వాత కస్టమర్లను సంతోషపెట్టగలదా అనేది త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Ola electric scooter launch on 15th august bookings delivery details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X