ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రియులను ఎంతగానో ఊరిస్తూ వచ్చిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదలైంది. రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 మరియు ఎస్1 ప్రో అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. మరియ వేరియంట్ల వారీగా ఈ స్కూటర్లలో లభించే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం రండి.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

వేరియంట్లు, ధరలు:

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. ఇందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలపై అందిస్తున్న సబ్సిడీలే కారణంగా. కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్-2 పథకం మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈవీ విధానాల ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సబ్సిడీ ప్రయోజనాలు లభిస్తాయి. వీటి ధరలు ఇలా ఉన్నాయి:

గుజరాత్

ఓలా ఎస్ 1: రూ. 79,999

ఓలా ఎస్ 1 ప్రో: రూ. 1,09,999

ఢిల్లీ

ఓలా ఎస్ 1: రూ. 85,099

ఓలా ఎస్ 1 ప్రో: రూ. 1,10,149

రాజస్థాన్

ఓలా ఎస్ 1: రూ. 89,968

ఓలా ఎస్ 1 ప్రో: రూ. 1,19,138

మహారాష్ట్ర

ఓలా ఎస్ 1: రూ. 94,999

ఓలా ఎస్ 1 ప్రో: రూ. 1,24,999

ఇతర రాష్ట్రాలు

ఓలా ఎస్ 1: రూ. 99,999

ఓలా ఎస్ 1 ప్రో: రూ. 1,29,999

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చాలా సింపుల్ డిజైన్‌తో మరియు లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించారు. ముందు వైపు పెద్ద హంగామా లేకుండా, ఫ్రంట్ ప్యానెల్‌లోనే అమర్చిన రెండు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు, హ్యాండిల్ బార్‌లో అమర్చిన ట్విన్ పాడ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, డ్యూయెల్ టోన్ హ్యాండిల్ బార్, బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్స్ వంటి డిజైన్ ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

అలాగే, ఫ్రంట్ ఆప్రాన్‌లో చాలా చిన్న అక్షరాలతో ఉన్న ఓలా బ్యాడ్జ్ కనిపిస్తుంది. పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్‌లో బ్లాక్ కలర్‌లో ఉండి, బాడీలో ఇమిడిపోయినట్లుగా స్టైలిష్ సైడ్ స్టాండ్, విశాలమైన రైడర్ మరియు పిలియన్ రైడర్ సీట్, వెనుక ప్యానెల్‌లో అమరిపోయినట్లుగా ఉండే పిలియన్ రైడర్ ఫుట్ పెగ్స్, పిలియన్ రైడర్ కోసం గ్రాబ్ రెయిల్ మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కూడిన రియర్ టెయిల్ ల్యాంప్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులోని అన్ని ఫీచర్లను హ్యాండిల్‌బార్‌లో అమర్చిన పెద్ద 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను ఉపయోగించి కంట్రోల్ చేయవచ్చు. ఈ స్కూటర్ స్మార్ట్ కనెక్ట్ ఫీచర్‌తో వస్తుంది. అంతేకాదు, ఇందులో ఈ-సిమ్ ఫీచర్ కూడా ఉంటుంది. దీని సహాయంతో స్కూటర్ ఇంటర్నెట్ మరియు మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ మరియు ఎస్ఎమ్ఎస్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా అందించబడ్డాయి. ఇవే కాకుండా, స్కూటర్ యొక్క ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో అనేక విడ్జెట్‌లు కూడా ఉంటాయి. ఇవి వాతావరణం, ఉష్ణోగ్రత, కాల్ అలర్ట్, మెసేజింగ్, నావిగేషన్, మ్యాప్స్ వంటి అనేక ఫీచర్లను యాక్సెస్ చేయడానికి యూజర్‌ను అనుతిస్తాయి.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బిల్ట్-ఇన్ స్పీకర్ కూడా ఉంటుంది. ఇది సంగీతాన్ని వినడానికి మరియు రైడింగ్ చేసేటప్పుడు స్కూటర్ నుండి ధ్వని వచ్చేలా చేయడానికి ఉపయోగపడుతుంది. రైడర్‌కు నచ్చినట్లుగా స్కూటర్ ఎగ్జాస్ట్ సౌండ్‌ను మార్చుకునే వెసలుబాటు కూడా ఇందులో ఉంటుంది.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

ఇందులోని సౌండ్ మోడ్‌లో స్కూటర్ సౌండ్‌ను ఎంచుకోవడానికి అనేక ఆప్షన్లు ఉంటాయి. ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో వాయిస్ అసిస్టెన్స్ కూడా ఇవ్వబడింది, దీని సహాయంతో కాల్ రిసీవ్ / రిజెక్ట్, నావిగేషన్ మరియు ఇతర ఫీచర్‌లను కంట్రోల్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

బ్యాటరీ, పవర్ మరియు రేంజ్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండు మోడళ్లలో 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. అయితే, వీటి బ్యాటరీ సామర్థ్యం మాత్రం వేర్వేరుగా ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌లను తొలగించడానికి వీలు ఉండదు. తప్పనిసరిగా స్కూటర్‌కు చార్జర్‌ను కనెక్ట్ చేయటం ద్వారానే వీటిని చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు స్కూటర్ల పవర్, రేంజ్ వివరాలు ఇలా ఉన్నాయి:

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 :

రేంజ్ - 121 కిమీ

గరిష్ట వేగం - గంటకు 90 కిమీ

రైడింగ్ మోడ్స్ - నార్మల్, స్పోర్ట్స్

ఛార్జింగ్ - 18 నిమిషాల్లో 75 కిమీ సరిపడా ఛార్జ్

బ్యాటరీ సామర్థ్యం - 2.98 కిలో వాట్ అవర్

ఓలా ఎస్ 1 ప్రో :

రేంజ్ - 181 కిమీ

గరిష్ట వేగం - గంటకు 115 కిమీ

రైడ్ మోడ్ - నార్మల్, స్పోర్ట్, హైపర్

ఛార్జింగ్ - 18 నిమిషాల్లో 75 కిమీ సరిపడా ఛార్జ్

బ్యాటరీ సామర్థ్యం - 3.97 కిలో వాట్ అవర్

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా 750 వాట్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో వస్తాయి. దీని సాయంతో స్కూటర్‌ను పూర్తిగా చార్జ్ చేయటానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది. అయితే, ఓలా ఫాస్ట్ ఛార్జర్ పాయింట్ వద్ద వీటిని కేవలం 60 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో, వీటిని కేవలం 18 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే గరిష్టంగా 75 కిలోమీటర్ల దూరం నడపడానికి ఛార్జ్ లభిస్తుంది.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

బుకింగ్, అమ్మకాలు మరియు ఉత్పత్తి

ఆసక్తిగల కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవటం కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, రూ.499 టోకెన్ అమౌంట్ చెల్లించడం ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌ని ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్‌లు సెప్టెంబర్ నుండి కొనుగోలు చేయవచ్చు, అయితే స్కూటర్ డెలివరీలు మాత్రం అక్టోబర్ నుండి ప్రారంభం కానున్నాయి.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

ప్రస్తుతం, స్కూటర్ అమ్మకం కోసం డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించలేదు. మాకున్న సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ ఈ స్కూటర్‌ను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ డెలివరీలు కూడా నేరుగా కస్టమర్ ఇంటికే వచ్చే అవకాశం ఉంది.

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిస్ స్కూటర్ వేరియంట్ వారీ ఫీచర్లు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తమిళనాడులోని ఓలా గిగా ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో, కంపెనీ ప్రతి సంవత్సరం 10 మిలియన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యాధునిక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Ola electric scooter s1 and s1 pro variant wise features specs details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X