ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభించిన Ola; ముందు డెలివరీ ఎవరికంటే?

Ola Electric దేశీయ మార్కెట్లో 2021 ఆగష్టు 15 న S1 మరియు S1 Pro అనే రెండు వేరియంట్లను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు వరుసగా ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 99,999 మరియు రూ. 1,29,999. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశీయ మార్కెట్లో విడుదలవ్వకముందే, బుకింగ్స్ ప్రారంభించబడ్డాయి. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతాయని కంపెనీ తెలియజేసింది.

ఈ రోజు నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభించిన Ola; ముందు డెలివరీ ఎవరికంటే?

ఈ రోజు నుంచి (08 సెప్టెంబర్ 2021) ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్లను బుక్ చేసేటప్పుడే, వినియోగదారులు స్కూటర్ యొక్క రంగు మరియు వేరియంట్‌ను ఎంచుకోవాలి. అయితే బుక్ చేసుకున్న కస్టమర్లు మిగిలిన అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించినట్లైతే కంపెనీ డెలివరీ తేదీని వెల్లడిస్తుంది.

ఈ రోజు నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభించిన Ola; ముందు డెలివరీ ఎవరికంటే?

కంపెనీ ఇంతకు ముందు తెలిపిన ప్రకారం Ola ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ డెలివరీ పద్ధతిలో కస్టమర్లకు అందించబడుతుంది. కంపెనీ ఈ డెలివరీలను కూడా ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు అందించడానికి ప్రాధాన్యత వహిస్తుంది. అంతహీ కాకుండా మొదటి బ్యాచ్ స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే డెలివరీ చేయబడుతుంది.

ఈ రోజు నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభించిన Ola; ముందు డెలివరీ ఎవరికంటే?

కంపెనీ ఇది వరకు అందించిన సమాచారం ప్రకారం, టెస్ట్ డ్రైవ్ అక్టోబర్ నెలలో ప్రారంభమవుతుంది. వినియోగదారులు టెస్ట్ రైడింగ్ చేసిన తరువాత కూడా బుకింగ్స్ రద్దు చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలన్నీ కూడా కంపెనీ కస్టమర్ల కోసం అందించింది.

ఈ రోజు నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభించిన Ola; ముందు డెలివరీ ఎవరికంటే?

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కస్టమర్ల సౌలభ్యం కోసం, ఫైనాన్స్ సదుపాయాలను అందించడానికి HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్ మరియు టాటా క్యాపిటల్‌ వంటి వాటితో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ బ్యాంకులు ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి.

ఈ రోజు నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభించిన Ola; ముందు డెలివరీ ఎవరికంటే?

పైన తెలిపిన బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు మాత్రమే కాకుండా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, HDFC ఫస్ట్ బ్యాంక్, Indusind Bank,, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు Yes బ్యాంక్ వంటివి కూడా ఉన్నట్లు, ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ Varun Dubey (వరుణ్ దూబే) తెలిపారు.

ఈ రోజు నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభించిన Ola; ముందు డెలివరీ ఎవరికంటే?

కొనుగోలుదారులలో ఫైనాన్సింగ్‌ని ఎంచుకునే వారు ఆప్షన్‌ని పొందగలగాలి. అప్పుడే బ్యాంకుల నుంచి ఫైనాన్స్ సదుపాయాన్ని పొందవచ్చు. ఇందులో ఈఎమ్ఐ కూడా కేవలం రూ. 2,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ అతి తక్కువ ఈఎమ్ఐ ఆప్సన్ కూడా ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

ఈ రోజు నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభించిన Ola; ముందు డెలివరీ ఎవరికంటే?

Ola Electric Scooter మూడు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. Ola Electric Scooter యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ తో లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. అంతే కాకుండా ఇది మంచి మైలేజ్ అందిస్తూ వాహనవినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు.

ఈ రోజు నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభించిన Ola; ముందు డెలివరీ ఎవరికంటే?

Ola Electric Scooter 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో శక్తినిస్తుంది, ఇది 3.92 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడుతుంది. ఈ స్కూటర్ 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దాదాపు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, కంపెనీ ఫాస్ట్ ఛార్జర్‌తో, ఈ బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఈ రోజు నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభించిన Ola; ముందు డెలివరీ ఎవరికంటే?

అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Electric Scooter) ఇప్పుడు దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లో కూడా అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ Ola Electric Scooter ఎగుమతి 2022 నుంచి ఎగుమతి చేయబడతాయని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఖండాంతరాలు దాటడానికి సిద్ధంగా ఉంది.

Most Read Articles

English summary
Ola electric scooter sales starts from today features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X