ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్; ఇప్పుడు కొత్త కలర్స్‌లో కూడా

ఇండియన్ మార్కెట్లో ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి తగిన అన్ని సన్నాహాలను సిద్ధం చేస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి ముందే కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఓలా కంపెనీ సిఈఓ భవిష్ అగర్వాల్ అధికారికంగా విడుదల చేశారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్; ఇప్పుడు మీకు నచ్చిన కలర్ ఎంచుకోండి

ఓలా కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలా ఉంటాయో ఇది వరకే చూసారు. కానీ ఇప్పుడు లీకైన ఫోటోలను మీరు గమనించినట్లయితే ఇందులో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏ కలర్స్ లో రానున్నాయి అనే సంగతి మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ మీకు గమనించినట్లతే ఓలా ఎలక్ట్రిక్స్ స్కూటర్లు పింక్ మరియు బ్లాక్ కాకుండా, బ్లూ కలర్ ఆప్సన్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్; ఇప్పుడు మీకు నచ్చిన కలర్ ఎంచుకోండి

ఇటీవల విడుదలైన ఓలా ఎలక్ట్రిక్స్ స్కూటర్ టీజర్ వీడియోలో భవీష్ అగర్వాల్ బ్లాక్ స్కూటర్ రైడ్ చేయడం చూడవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ టీజర్ వీడియోలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంటుంది, మరియు రైడింగ్ కి అనుకూలంగా ఉంటుందా.. లేదా అనే విషయాలను అంచనా వేయవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్; ఇప్పుడు మీకు నచ్చిన కలర్ ఎంచుకోండి

ఇక్కడ ఉన్న ఫోటోలలో మీరు గమనించినట్లయితే, ఇది స్లిమ్ డిజైన్ కలిగి ఉన్నటు తెలుస్తుంది. స్కూటర్‌లో ఇచ్చిన టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కూడా ఇక్కడ గమనించవచ్చు. దీనితో పాటు, స్కూటర్‌లోని హెడ్‌లైట్, టైల్ లైట్, ఓలా బ్యాడ్జింగ్ మరియు సైడ్ ప్యానెల్స్‌ను కూడా చూడవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్; ఇప్పుడు మీకు నచ్చిన కలర్ ఎంచుకోండి

కంపెనీ నివేదికల ప్రకారం ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఓలా స్కూటర్ యొక్క డిజైన్ నెదర్లాండ్స్‌కు చెందిన ఎటర్గో స్కూటర్ ఆధారంగా రూపొందించబడింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్; ఇప్పుడు మీకు నచ్చిన కలర్ ఎంచుకోండి

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా వరకు ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉటుంది. ఈ స్కూటర్‌లో ట్విన్ పాడ్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్ లైట్, ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అల్లాయ్ వీల్స్, సింగిల్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఇవ్వబడినట్లు ఇదివరకు మనకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తుది. ఇవి మాత్రమే కాకుండా, ఈ స్కూటర్‌లో అతిపెద్ద బూట్ స్పేస్ కూడా లభిస్తుందని కంపెనీ పేర్కొంది. స్కూటర్‌లో 50 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ లభిస్తుంది, ఇది పెట్రోల్‌తో నడిచే స్కూటర్ల కంటే చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్; ఇప్పుడు మీకు నచ్చిన కలర్ ఎంచుకోండి

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లోని బ్యాటరీ విషయానికి వస్తే, దీని గురించి కంపెనీ ఎక్కువ సమాచారం అందించలేదు, కానీ ఇది ఒక ఛార్జ్ రహో ఏకంగా 150 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగలదు. ఈ స్కూటర్ కేవలం 18 నిమిషాల ఛార్జ్‌లో 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ స్కూటర్‌లో కంపెనీ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌ను అందించనుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి రెండు నుండి రెండున్నర గంటలు సమయం పడుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్; ఇప్పుడు మీకు నచ్చిన కలర్ ఎంచుకోండి

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానున్న తమిళనాడు ప్లాంట్ లో జరగనుంది. ఇక్కడ కంపెనీ నిర్మిస్తున్న ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కేంద్రం కానుంది. ఇక్కడ ప్రారంభ దశలో సంవత్సరానికి 20 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయబడతాయి. అంతే కాకుండా ఒక్కడా కార్యకలాపాలు పూర్తిగా ప్రారంభమైన తర్వాత, ఈ ప్లాంట్ కి ప్రతి సంవత్సరం 10 మిలియన్ వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్; ఇప్పుడు మీకు నచ్చిన కలర్ ఎంచుకోండి

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ https://olaelectric.com లో బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క బుకింగ్ కోసం కేవలం 499 రూపాయలు చెల్లించాలి. స్కూటర్లను ప్రీ-బుక్ చేసిన వినియోగదారులకు మొదటి డెలివరీ చేయబడుతుంది. కావున ఆసక్తి గల కస్టమర్లు త్వరగా బుక్ చేసుకోవాలి.

Most Read Articles

English summary
Ola Electric Scooter Spotted In All Colour Options. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X