విదేశీ ఎగుమతికి సిద్దమవుతున్న Ola Electric Scooter; పూర్తి వివరాలు

''ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్'' (Ola Electric Scooter) ఈ పేరుకి ఇప్పుడు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఎంతోమంది వినియోగదారులు ఎన్నో రోజులుగా ఎదురుచూసిన ఈ స్కూటర్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో విడుదలైంది. అయితే ఈ స్కూటర్ ఇప్పుడు భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది.

విదేశీ ఎగుమతికి సిద్దమవుతున్న Ola Electric Scooter; పూర్తి వివరాలు

Ola Electric Scooter ఎగుమతి 2022 నుంచి ఎగుమతి చేయబడతాయని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కంపెనీ అమెరికాకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని ఆయన తన అధికారిక ట్వీట్‌లో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఖండాంతరాలు దాటడానికి సిద్ధంగా ఉంది.

విదేశీ ఎగుమతికి సిద్దమవుతున్న Ola Electric Scooter; పూర్తి వివరాలు

Ola కంపెనీ యొక్క Electric Scooter దేశీయ మార్కెట్‌లో అతి తక్కువ కాలంలోనే సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు దాని ఉనికిని ఇతరదేశాల్లో కూడా చాటుకోవడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఓలా కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని తమిళనాడులో నిర్మిస్తోంది. ఈ కొత్త ప్లాంట్ లో ప్రతి సంవత్సరం 10 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే అవకాశం ఉంది.

విదేశీ ఎగుమతికి సిద్దమవుతున్న Ola Electric Scooter; పూర్తి వివరాలు

Ola కంపెనీ తన మొదటి Electric Scooter ని భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను (S1 మరియు S1 Pro) విడుదల చేసింది. ఈ స్కూటర్ల ధరల విషయానికి వస్తే ఓలా S1 ధర రూ. 99,999 కాగా, S1 ప్రో ధర రూ. 1,29,999. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదలకాకముందే అత్యంత ప్రజాదరణ పొందింది.

విదేశీ ఎగుమతికి సిద్దమవుతున్న Ola Electric Scooter; పూర్తి వివరాలు

Ola Electric Scooter 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో శక్తినిస్తుంది, ఇది 3.92 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడుతుంది. ఈ స్కూటర్ 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దాదాపు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, కంపెనీ ఫాస్ట్ ఛార్జర్‌తో, ఈ బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయవచ్చు.

విదేశీ ఎగుమతికి సిద్దమవుతున్న Ola Electric Scooter; పూర్తి వివరాలు

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లలో కనిపించని అనేక కొత్త ఫీచర్లను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 181 కిమీ వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు.

విదేశీ ఎగుమతికి సిద్దమవుతున్న Ola Electric Scooter; పూర్తి వివరాలు

Ola Electric Scooter మూడు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 10 ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. Ola Electric Scooter యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

విదేశీ ఎగుమతికి సిద్దమవుతున్న Ola Electric Scooter; పూర్తి వివరాలు

ఓలా కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. అయితే త్వరలో ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసినట్లతే ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ మార్కెట్లో మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఉంటుంది.

విదేశీ ఎగుమతికి సిద్దమవుతున్న Ola Electric Scooter; పూర్తి వివరాలు

Ola Electric భారతదేశం అంతటా హైపర్‌ఛార్జ్ నెట్‌వర్క్ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగానే కంపెనీ భారతదేశంలోని 400 నగరాల్లో ఒక లక్షకు పైగా ఛార్జింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేయనుంది. దీనికోసం కంపెనీ $ 2 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది.

విదేశీ ఎగుమతికి సిద్దమవుతున్న Ola Electric Scooter; పూర్తి వివరాలు

ఓలా కంపెనీ ఇంకా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభించలేదు. కంపెనీ ఇంకా ఏ నగరంలోనూ తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను ప్రారంభించలేదు. కానీ కంపెనీ స్కూటర్లను నేరుగా కస్టమర్ ఇంటికే డోర్ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. దీని ప్రకారం స్కూటర్ పొందడానికి కస్టమర్ షోరూమ్‌కు వెళ్లవలసిన అవసరం లేదు.

విదేశీ ఎగుమతికి సిద్దమవుతున్న Ola Electric Scooter; పూర్తి వివరాలు

Ola Electric Scooter ప్రారంభించారు, కానీ దీనికి సంబంధించిన షోరూమ్ మరియు డీలర్ షిప్ లేదు కావున కొనుగోలుదారులకు డీఐ సర్వీస్ పరిస్థితి ఏంటి అనే అనుమానం రావచ్చు, కానీ కంపెనీ దీని కోసం డోర్-స్టెప్ సర్వీస్‌ను అందిస్తుంది. స్కూటర్‌లో ఏదైనా సమస్య ఉంటే, ఆ కంపెనీ టెక్నీషియన్‌లు స్కూటర్ రిపేర్ చేయడానికి కస్టమర్ ఇంటికి వెళ్తారు. Ola Electric Scooter మొబైల్ అప్లికేషన్ మరియు వెబ్‌సైట్‌లో సర్వీస్ రిక్వెస్ట్ సౌకర్యం అందించబడుతుంది.

Most Read Articles

English summary
Ola electric scooter to be exported to america in 2022 details
Story first published: Sunday, September 5, 2021, 8:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X