కొంపముంచుతున్న సెమీకండక్టర్ చిప్‌ షార్టేజ్.. డెలివరీ డేట్ మళ్ళీ పెంచేసిన Ola: ఇక డెలివరీలు అప్పుడే..!!

దేశీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న సమయంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రవేశించిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) అనతి కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ కారణంగానే కంపెనీ ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించింది. అయితే కంపెనీ త్వరలో డెలివరీలను ప్రారంభిస్తామని ఇంతకుముందు తెలిపింది. అంతకంటే ముందు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ కూడా ప్రారంభించింది. కానీ ఇప్పుడు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు మరింత ఆలస్యం కానున్నట్లు కంపెనీ తెలిపింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొంపముంచుతున్న సెమీకండక్టర్ చిప్‌ షార్టేజ్.. డెలివరీ డేట్ మళ్ళీ పెంచేసిన Ola: ఇక డెలివరీలు అప్పుడే..!!

భారతదేశంలో సెమీకండక్టర్ చిప్‌ కొరత కారణంగా దేశంలోని దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఉత్పత్తి మరియు డెలివరీలను ఆలస్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఓలా కంపెనీ డెలివరీలు ఇప్పుడు రెండు వారాల నుండి ఒక నెల వరకు వాయిదా వేసినట్లు సమాచారం. ఇది కస్టమర్లను ఎక్కువ నిరాశకు గురిచేసే అవకాశం ఉంది.

కొంపముంచుతున్న సెమీకండక్టర్ చిప్‌ షార్టేజ్.. డెలివరీ డేట్ మళ్ళీ పెంచేసిన Ola: ఇక డెలివరీలు అప్పుడే..!!

కంపెనీ ఇంతకు ముందు అందించిన సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ నెలాఖరుకల్లా కస్టమర్లను చేరుకోనున్నట్లు తెలిసింది. కానీ ఇప్పుడు వెలువడిన తాజా సమాచారం ప్రకారం, డెలివరీలు ఇప్పుడు 2021 డిసెంబర్ మధ్య నుంచి లేదా డిసెంబర్ చివరి నాటికి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే, మొదటి బ్యాచ్ డెలివరీ డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 30 మధ్య జరిగే అవకాశం ఉంది.ఓలా ఎలక్ట్రిక్ మొదటి సారి సెమీకండక్టర్ చిప్ కొరత వల్ల డెలివరీ ఆలస్యం చేస్తోంది. కస్టమర్లు దీనిని గమనించాలి.

కొంపముంచుతున్న సెమీకండక్టర్ చిప్‌ షార్టేజ్.. డెలివరీ డేట్ మళ్ళీ పెంచేసిన Ola: ఇక డెలివరీలు అప్పుడే..!!

డెలివరీలు ఆలస్యం అవుతున్నాయని, ఓలా స్కూటర్ బుక్ చేసుకున్న కస్టమర్‌లకు కంపెనీ ఒక మెయిల్ పంపింది. అంతే కాకుండా ఈ సందేశంలో డెలివరీలో ఆలస్యం అనివార్యమని పేర్కొంటూ కస్టమర్‌లకు క్షమాపణలు కూడా చెప్పింది. స్కూటర్లను కస్టమర్లకు వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు ఉత్పత్తిని పెంచుతున్నట్లు కంపెనీ హామీ ఇచ్చింది.

కొంపముంచుతున్న సెమీకండక్టర్ చిప్‌ షార్టేజ్.. డెలివరీ డేట్ మళ్ళీ పెంచేసిన Ola: ఇక డెలివరీలు అప్పుడే..!!

Ola Electric నవంబర్ 10 న Ola S1 మరియు S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం తుది చెల్లింపు విండోను ఓపెన్ చేసింది. వినియోగదారులకు వాహనాలను ఈ సమయానికి డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది. అదే తేదీన, కంపెనీ బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు కోల్‌కతాలో వినియోగదారుల కోసం టెస్ట్ రైడ్‌లను కూడా ప్రారంభించింది.

కొంపముంచుతున్న సెమీకండక్టర్ చిప్‌ షార్టేజ్.. డెలివరీ డేట్ మళ్ళీ పెంచేసిన Ola: ఇక డెలివరీలు అప్పుడే..!!

దీని తరువాత, నవంబర్ 19 న, కంపెనీ ముంబై, చెన్నై, హైదరాబాద్, కొచ్చి మరియు పూణే వంటి మరో ఐదు నగరాల్లో టెస్ట్ రైడ్‌లను ప్రారంభించింది. కంపెనీ ఇప్పుడు డిసెంబర్ మధ్య నాటికి 1,000 నగరాలు మరియు పట్టణాలలో టెస్ట్ రైడ్‌లను ప్రారంభించబోతోంది. ఈ ప్రోగ్రామ్ కింద కంపెనీ తన S1 మరియు S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్‌లను అందిస్తుంది. కంపెనీ దీనిని దేశంలోనే అతిపెద్ద EV టెస్ట్ డ్రైవ్ ప్రోగ్రామ్ అని పిలుస్తోంది. టెస్ట్ రైడ్ ఈవెంట్‌కు చాలా సానుకూల స్పందన వచ్చిందని కంపెనీ ఇది వరకే తెలిపింది.

కొంపముంచుతున్న సెమీకండక్టర్ చిప్‌ షార్టేజ్.. డెలివరీ డేట్ మళ్ళీ పెంచేసిన Ola: ఇక డెలివరీలు అప్పుడే..!!

సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ తన టెస్ట్ రైడ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించబోతున్న నగరాలలో సూరత్, తిరువనంతపుర, కోజికోడ్, విశాఖపట్నం, విజయవాడ, కోయంబత్తూర్, వడోదర, భువనేశ్వర్, తిరుప్పూర్, జైపూర్ మరియు నాగ్‌పూర్ ఉన్నాయి. 2021 నవంబర్ 27 నుంచి ఈ నగరాలలో టెస్ట్ రైడ్ ప్రారంభం కానుంది.

కొంపముంచుతున్న సెమీకండక్టర్ చిప్‌ షార్టేజ్.. డెలివరీ డేట్ మళ్ళీ పెంచేసిన Ola: ఇక డెలివరీలు అప్పుడే..!!

దేశీయ మార్కెట్లో ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల విషయానికి వస్తే, Ola S1 యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, Ola S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). ఇవి రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కొంపముంచుతున్న సెమీకండక్టర్ చిప్‌ షార్టేజ్.. డెలివరీ డేట్ మళ్ళీ పెంచేసిన Ola: ఇక డెలివరీలు అప్పుడే..!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

కొంపముంచుతున్న సెమీకండక్టర్ చిప్‌ షార్టేజ్.. డెలివరీ డేట్ మళ్ళీ పెంచేసిన Ola: ఇక డెలివరీలు అప్పుడే..!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

కొంపముంచుతున్న సెమీకండక్టర్ చిప్‌ షార్టేజ్.. డెలివరీ డేట్ మళ్ళీ పెంచేసిన Ola: ఇక డెలివరీలు అప్పుడే..!!

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Ola electric scooters delivery delayed due to shortage of chips details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X