మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తికి బరిలో దిగిన Ola: ధర కూడా చాలా తక్కువ..

భారతీయ మార్కెట్లో S1 మరియు S1 Pro స్కూటర్లు విడుదల చేసి అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందిన Ola Electric ఇప్పుడు తాజాగా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కావున ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సమీప భవిష్యత్తులో తన లైనప్‌ను విస్తరించడం ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఒక సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది.

మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తికి బరిలో దిగిన Ola: ధర కూడా చాలా తక్కువ..

Ola Electric కంపెనీ ఇందులో భాగంగానే ప్యాసింజర్ వాహన విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. కావున దీని కోసం ఎలక్ట్రిక్ కారు అభివృద్ధికి కీలకమైన సిబ్బందిని నియమించుకున్నట్లు కూడా నివేదికల ద్వారా తెలుస్తోంది. కావున కంపెనీ త్వరలో ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉంది.

మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తికి బరిలో దిగిన Ola: ధర కూడా చాలా తక్కువ..

బెంగుళూరు ఆధారిత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ మళ్ళీ విడుదల చేయనున్న వెహికల్ మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చని నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే తక్కువ ధర కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తికి బరిలో దిగిన Ola: ధర కూడా చాలా తక్కువ..

కంపెనీ యొక్క తాజా నివేదికల ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఈ-స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 కింద ప్రారంభించబడుతుంది, అంతే కాకుండా ఇది కంపెనీ యొక్క ద్విచక్ర వాహన శ్రేణిలో ఎంట్రీ-లెవల్ మోడల్‌గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఓలా సిరీస్ ఎస్ అని పేరు పెట్టవచ్చని భావిస్తున్నారు.

మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తికి బరిలో దిగిన Ola: ధర కూడా చాలా తక్కువ..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరును ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ రిజిస్టర్ చేసింది. ఈ కొత్త ఈ-స్కూటర్ చాలా అరకు S1 సిరీస్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ ని మరింత సరసమైనదిగా చేయడానికి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కొన్ని ఫీచర్లను తీసివేసే అవకాశం ఉంటుంది. కావున అది కంపెనీ యొక్క అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుంది.

మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తికి బరిలో దిగిన Ola: ధర కూడా చాలా తక్కువ..

S1 స్కూటర్ లో ఉన్న 3 కిలోవాట్ బ్యాటరీని తక్కువ రేటింగ్ ఉన్న బ్యాటరీతో భర్తీ చేయడం ఖర్చులను తగ్గించుకోవడానికి అత్యంత సులువైన మార్గం. ఈ బ్యాటరీ తక్కువ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని పంపుతుంది. ఇది మరింత మంచి పనితీరుతో పాటు తక్కువ సింగిల్-ఛార్జ్ పరిధికి దారి తీస్తుంది. తక్కువా మోటార్ స్పెసిఫికేషన్‌లతో కూడా, కొత్త ఈ-స్కూటర్ 75 నుంచి 80 కిమీ/గం గరిష్ట వేగంతో ప్రయాణింస్తుంది. అంతే కాకుండా ఇది ఒకే ఛార్జ్‌పై సుమారు 100 కిమీ పరిధిని కూడా అందించే అవకాశం ఉంటుంది.

మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తికి బరిలో దిగిన Ola: ధర కూడా చాలా తక్కువ..

అయితే ప్రస్తుతం రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పవర్‌ట్రెయిన్ వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అంతే కాకూండా కంపెనీ రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ లో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, స్పీకర్లు మరియు కీలెస్ ఇగ్నిషన్ వంటి ఫీచర్లను కూడా తొలగించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు రిమోట్ బూట్ లాక్/అన్‌లాక్, ప్రాక్సిమిటీ లాక్/అన్‌లాక్, వాయిస్ అసిస్టెంట్, వైఫై కనెక్టివిటీ మరియు జియో-ఫెన్సింగ్ వంటి ఇతర ప్రీమియం ఫీచర్‌లను కూడా తొలగించే అవకాశం ఉంటుంది.

మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తికి బరిలో దిగిన Ola: ధర కూడా చాలా తక్కువ..

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇప్పటికే ఉన్న మోడళ్లలో అమర్చిన 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ స్థానంలో నార్మల్ స్టీల్ వీల్స్‌ను ఉపయోగించవచ్చు. ఓలా స్కూటర్ యొక్క ఈ కొత్త వేరియంట్ ధర తక్కువగానే ఉంటుంది. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ S1 యొక్క ప్రస్తుత ధర రూ. 1 లక్ష కంటే తక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న FAME-II మరియు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతో ఈ ధర మరింత తగ్గుతుంది.

మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తికి బరిలో దిగిన Ola: ధర కూడా చాలా తక్కువ..

Ola కంపెనీ తీసుకురానున్న కొత్త ఎలక్ట్రిక్ ధరను రూ. 70 వేల నుండి రూ. 80 వేల మధ్య ఉంచే అవకాశం ఉంటుంది. ఈ ధర కారణంగా దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందుతున్న హోండా యాక్టివా మరియు టీవీఎస్ జుపిటర్ వంటి వాటికి ఇది ప్రత్యర్థిగా ఉంటుంది.

మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తికి బరిలో దిగిన Ola: ధర కూడా చాలా తక్కువ..

Ola Electric ఇప్పటికే భారతీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. అవి Ola S1 మరియు Ola S1 ప్రో స్కూటర్లు. ఈ రెండు స్కూటర్లు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. Ola S1 స్కూటర్ 2.98 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగిస్తుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 121 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అయితే Ola S1 Pro స్కూటర్ 3.97 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. కావున డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

Most Read Articles

English summary
Ola electric to launch new electric scooter at more affordable price details
Story first published: Monday, November 15, 2021, 13:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X