చివరిదశలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం

భారత మార్కెట్లో విడుదలకు ముందే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఓలా'. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వాహనప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కోసం ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్' ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీని వెల్లడించారు.

చివరిదశలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం

ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్' ప్రకటన ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆగస్టు 15 న భారతదేశంలో విడుదల చేయనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ కూడా దాదాపుగా సిద్ధంగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ యొక్క ఏరియల్ ఫోటోను షేర్ చేశారు.

చివరిదశలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం

ఇక్కడ ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ ఏ దశలో ఉందొ మీరు చూడవచ్చు. భవిష్ అగర్వాల్ ఫ్యూచర్ ఫ్యాక్టరీ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి "గ్రౌండ్ జీరో" అనే ట్యాగ్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ 500 ఎకరాల స్థలంలో మెగా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

చివరిదశలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం

ద్విచక్ర వాహనాల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కర్మాగారాన్ని అభివృద్ధి చేయడానికి తమిళనాడు ప్రభుత్వంతో డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ రూ. 2,400 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్లాంట్ కోసం భూ సేకరణ ఈ ఏడాది జనవరిలో పూర్తయింది మరియు ఫిబ్రవరి చివరి నుండి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

చివరిదశలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం

ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ మొదటి దశ త్వరలో ప్రారంభించబడుతుందని మరియు రికార్డు సమయంలో ఫ్యాక్టరీని కార్యరూపం దాల్చడానికి కావలసిన సమయం వంటివి కూడా ప్రణాళికలో రూపొందించామని ఓలా ఎలక్ట్రిక్ తెలియజేసింది. ఈ ఫ్యాక్టరీ ప్రారంభ దశలో 20 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తుంది.

చివరిదశలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం

ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఈ మెగా ఫ్యాక్టరీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణి కోసం ఓలా ఎలక్ట్రిక్ యొక్క గ్లోబల్ తయారీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడ తయారు చేయబడిన ఎలక్ట్రిక్ స్కూటర్లు భారతదేశంలో విక్రయించడమే కాకుండా యూరోప్, యుకె, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనుంది.

చివరిదశలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం

ఈ తయారీ కర్మాగారం భారతదేశపు అత్యంత ఆటోమేటెడ్ ప్లాంట్ అని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది, ఎందుకంటే ఇది ఓలా సొంత ఇంజిన్ మరియు టెక్నాలజీ ద్వారా శక్తిని పొందుతుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా పూర్తిగా మనదేశంలోనే తయారై విదేశాలకు కూడా ఎగుమతి కానుంది.

ఈ ఫ్యాక్టరీ పూర్తిగా సిద్దమైన తర్వాత ఇందులో దాదాపు 5,000 రోబోట్లు మరియు ఆటోమేటెడ్ గైడెడ్ వాహనాలు మోహరించబడతాయి. అంతే కాకుండా ఈ ఫ్యాక్టరీ 4.0 టెక్నాలజీని ప్రవేశపెట్టినప్పటికీ ఫ్యాక్టరీ 10,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీ వల్ల ఇంత పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుంది.

చివరిదశలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం

ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవాలనుకే కస్టమర్లు కేవలం 499 రూపాయలకు బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే కంపెనీ ఆడించిన సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎస్1 మరియు ఎస్1 ప్రో అనే రెండు వేరియంట్లలో తీసుకువచ్చే అవకాశం ఉంది. రెండు వేరియంట్‌లను 'S' సిరీస్ కింద విక్రయించే అవకాశం ఉంది.

చివరిదశలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం

మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్స్ స్కూటర్ కి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి సమాచారం త్వరలో తెలుస్తుంది. ఇందులో స్పెసిఫికేషన్‌లు మొదలైనవి కూడా అదే రోజున తెలుస్తాయి. ఓలా స్కూటర్ బుకింగ్ రద్దు చేసుకునే కస్టమర్లకు వారి బుకింగ్ అమౌంట్ ని కూడా తిరిగి పొందవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర దాదాపు 1 లక్ష రూపాయల లోపు ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.అంతే కాకూండా ఇప్పుడు దేశంలో అమలులో ఉన్న ఫేమ్-2 సబ్సిడీ మరియు రాష్ట్ర ప్రభుత్వాల డిస్కౌంట్స్ తరువాత మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది.

చివరిదశలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం

ఓలా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 10 రంగుల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. ప్రస్తుతం, కంపెనీ ఈ స్కూటర్‌ను డీలర్‌షిప్‌లో విక్రయించడంతోపాటు హోమ్ డెలివరీ కూడా చేయడానికి సుముఖత చూపిస్తుంది. ఎక్కువమంది ప్రజలు హోమ్ డెలివరీ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల కంపెనీ ఈ విధానం కూడా ఆచరిస్తుంది.

చివరిదశలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కిలోవాట్ నుండి 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఇవ్వవచ్చు. ఫాస్ట్ ఛార్జర్‌తో, ఈ స్కూటర్‌ను కేవలం 18 నిమిషాలలో 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. అదే సమయంలో, నార్మల్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది.

ఓలా యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక అప్డేటెడ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ డ్యూయల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, కలర్ ఎల్సిడి డిస్‌ప్లే, క్లౌడ్ కనెక్టివిటీ, నావిగేషన్ టెక్నాలజీ, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ మరియు అల్లాయ్ వీల్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

చివరిదశలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ.. త్వరలో ఉత్పత్తి ప్రారంభం

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయినా తరువాత 100 నుంచి 150 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్స్ కలిగి ఉండటం వల్ల, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో చేర్చబడుతుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 ఎక్స్‌కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకూండా బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు కూడా ప్రత్యర్థిగా ఉండనుంది.

Most Read Articles

English summary
Ola ev mega factory almost ready for production soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X