Ola Electric ఫ్యాక్టరీలో మహిళలకు పెద్ద పీట; 10,000 మందికి ఉపాధి

'Ola' ఈ రోజు భారతదేశంలో అందరి చూపు దీనిపైనే ఉంది. ఎందుకంటే ఇటీవల దేశీయ మార్కెట్లో ఒక కొత్త అధునాతన ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ స్కూటర్ భారతీయ మార్కెట్లో విడుదల కాకముందే అత్యంత ప్రజాదరణ పొందింది. అంతే కాకూండా Ola కంపెనీ నిర్మిస్తున్న ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారం అవుతుంది, అంతే కాకుండా ఇది పూర్తిగా మహిళా కార్మికులతో నడిచే ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారం కూడా అవుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో మహిళలకు పెద్ద పీట; ఎందుకంటే?

ఇందులో భాగంగానే ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో 10,000 మంది మహిళా కార్మికులు పనిచేస్తారు. ఇందులో మొత్తం వ్యవహారాలు కూడా మహిళల చేస్తుల్లోనేఉంటుంది. 'ఆత్మనిర్భర్ భారత్‌కు ఆత్మనిర్భార్ మహిళలు కావాలి' ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో 10,000 కంటే ఎక్కువమంది మహిళలు నిర్వహిస్తారని గర్వంగా తెలుపుతున్నాను, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మహిళల కర్మాగారం అవుతుందని Ola సీఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.

ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో మహిళలకు పెద్ద పీట; ఎందుకంటే?

ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఫ్యాక్టరీ మొదటి దశ పూర్తి కాగానే, పూర్తి సామర్థ్యంతో, సంవత్సరానికి రెండు మిలియన్ యూనిట్లను విడుదల చేయగలదు. ఇది ప్రపంచంలోని అన్నిదేశాల డిమాండ్స్ తీర్చగలదు. వచ్చే ఏడాది నుండి అమెరికాకు కూడా ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చేయనుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో మహిళలకు పెద్ద పీట; ఎందుకంటే?

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కస్టమర్ల సౌలభ్యం కోసం, ఇప్పుడు ఫైనాన్స్ సదుపాయాలను అందించడానికి HDFC Bank, ICICI Bank, Kotak Mahindra Prime మరియు Tata Capital వంటి వాటితో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ బ్యాంకులు ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి.

ఇవి మాత్రమే కాకుండా, Bank of Baroda, Axis Bank, HDFC First Bank, Indusind Bank, AU Small Finance Bank, Jan Small Finance Bank మరియు Yes Bank వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ వెసులుబాటు కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో మహిళలకు పెద్ద పీట; ఎందుకంటే?

Ola దేశీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను (S1 మరియు S1 Pro) గత నెలలోనే విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో, ఓలా ఎస్ 1 ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 99,999 కాగా మరియు ఓలా S1 Pro ధర రూ .1,29,999 (ఎక్స్-షోరూమ్). ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 కిలో వాట్ సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో మహిళలకు పెద్ద పీట; ఎందుకంటే?

ఓలా స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో సుమారు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఓలా అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను చేర్చింది.

ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో మహిళలకు పెద్ద పీట; ఎందుకంటే?

ఓలా S1 ఒక పూర్తి ఛార్జ్‌పై 121 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, అయితే హై-ఎండ్ వేరియంట్ S1 Pro మాత్రం 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. అంతే కాకూండా, ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో మహిళలకు పెద్ద పీట; ఎందుకంటే?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో మహిళలకు పెద్ద పీట; ఎందుకంటే?

ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదల చేసింది, మరియు బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కానీ డెలివరీలు ఇంకా ప్రారంభించలేదు. కంపెనీ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 15 నుంచి అమ్మకాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో మహిళలకు పెద్ద పీట; ఎందుకంటే?

ఓలా కంపెనీ ఇంకా ఏ నగరంలోనూ తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను ప్రారంభించలేదు. ప్రారంభ దశలో, ఓలా తన స్కూటర్లను డోర్-స్టెప్ డెలివరీని ప్రారంభిస్తుంది. కావున కస్టమర్ స్కూటర్ పొందడానికి షోరూమ్‌కు వెళ్ళవలసిన అవసరం లేదు. స్కూటర్ కస్టమర్ ఇంటికి డోర్ డెలివరీ చేయబడుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో మహిళలకు పెద్ద పీట; ఎందుకంటే?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం, కంపెనీ డోర్-స్టెప్ సర్వీస్‌ను అందిస్తుంది. అంటే, స్కూటర్‌లో ఏదైనా సమస్య ఉంటే, ఆ కంపెనీ టెక్నీషియన్‌లు స్కూటర్ రిపేర్ చేయడానికి కస్టమర్ ఇంటికి వెళ్తారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మొబైల్ అప్లికేషన్ మరియు వెబ్‌సైట్‌లో సర్వీస్ రిక్వెస్ట్ సౌకర్యం అందించబడుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో మహిళలకు పెద్ద పీట; ఎందుకంటే?

ఓలా స్కూటర్ ప్రిడిక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా వినియోగదారులకు నిర్వహణ సంబంధిత హెచ్చరికలను అందిస్తూనే ఉంటుంది. తదుపరి దశలో కంపెనీ స్కూటర్‌ను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో విక్రయించవచ్చని ఓలా తెలిపింది. దీని కోసం, కంపెనీ దేశంలోని అనేక నగరాల్లో తన డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. వచ్చే మూడు నెలల్లో దేశంలోని ప్రతి నగరంలో ఒక కస్టమర్ టచ్ పాయింట్‌ను కంపెనీ ప్రారంభిస్తుంది.

Most Read Articles

English summary
Ola future factory will be the largest all women factory to employ 10000 women workers
Story first published: Tuesday, September 14, 2021, 12:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X