Ola ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి లేటెస్ట్ అప్డేట్.. చూసారా..!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Electric Scooter) భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి చాలామంది కస్టమర్లు దీని కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే కంపెనీ బుకింగ్స్ స్వీకరించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ఇంకా జరగలేదు. దీనిపైనా కంపెనీ ఒక స్పష్టమైన సమాచారం కూడా అందించడం లేదు. కంపెనీ ఇంతకుముందు అందించిన సమాచారం ప్రకారం, సెమికండక్టర్ల కొరత కారణంగా డెలివరీలు ఇప్పుడు ఒక నెల వరకు వాయిదా వేసినట్లు తెలిపింది.

ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీపై లేటెస్ట్ అప్డేట్స్ అందించిన Ola

అంతే కాకూండా కంపెనీ, తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న కొంతమంది కస్టమర్‌లకు కొనుగోలు సమయాన్ని పొడిగించినట్లు వారికి ఒక ఇమెయిల్ ద్వారా తెలియజేసింది. Ola ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క సెకండ్ బ్యాచ్ సేల్స్ 2021 నవంబర్ 01 నుంచి జరగవలసి ఉంది, కానీ ఇది కూడా వాయిదా పడింది.

ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీపై లేటెస్ట్ అప్డేట్స్ అందించిన Ola

నివేదికల ప్రకారం, కంపెనీ ఇప్పుడు 2022 జనవరి నెలలో తన స్కూటర్‌లను విక్రయించడం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ తేదీని పొడిగించడానికి ఖచ్చితమైన కారణాన్ని కంపెనీ వినియోగదారులకు చెప్పలేదు. బుకింగ్ విండోతో పాటు, S1 మరియు S1 ప్రో యొక్క డెలివరీలు కూడా ఆలస్యం అవుతాయని కంపెనీ తెలిపింది.

ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీపై లేటెస్ట్ అప్డేట్స్ అందించిన Ola

కంపెనీ ఇంతకుముందు తెలిపిన సమాచారం ప్రకారం, డెలివరీలు ఈ ఏడాది అక్టోబర్ మరియు నవంబర్ మధ్య జరగవలసి ఉంది. కానీ సేల్స్ విండోలోని కొన్ని సమస్యల వల్ల అది కాస్త వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఓలా కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ మాత్రం ప్రారంభించింది. టెస్ట్ రైడ్ చేసిన చాలామంది వినియోగదారుల నుంచి ఒక పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది.

ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ విండోను 2021 సెప్టెంబర్ మధ్యలో ఓపెన్ చేసింది. ప్రస్తుతం, కంపెనీ మొదటి బ్యాచ్ స్కూటర్లను కస్టమర్లకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. దేశీయ మార్కెట్లో ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల విషయానికి వస్తే, Ola S1 యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, Ola S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). అయితే దేశీయ మార్కెట్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీల వల్ల ఈ ధర చాలా అరకు తగ్గుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీపై లేటెస్ట్ అప్డేట్స్ అందించిన Ola

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీపై లేటెస్ట్ అప్డేట్స్ అందించిన Ola

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీపై లేటెస్ట్ అప్డేట్స్ అందించిన Ola

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కస్టమర్ల సౌలభ్యం కోసం, ఫైనాన్స్ సదుపాయాలను అందించడానికి HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్ మరియు టాటా క్యాపిటల్‌ వంటి వాటితో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ బ్యాంకులు ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి. కావున ఇది కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీపై లేటెస్ట్ అప్డేట్స్ అందించిన Ola

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి. అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీపై లేటెస్ట్ అప్డేట్స్ అందించిన Ola

ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ ఒక ప్రత్యేక డిమాండ్‌పై నెదర్లాండ్స్ ఎంబసీకి తొమ్మిది (9) కస్టమైజ్డ్ Ola S1 ప్రో స్కూటర్‌లను అందజేసింది. ఈ తొమ్మిది స్కూటర్లు భారతదేశంలోని నెదర్లాండ్స్ యొక్క మూడు దౌత్య కార్యకలాపాలలో ఉపయోగించబడతాయి. ఇవి కస్టమ్ నారింజ రంగులో అందించబడతాయి మరియు స్కూటర్లు నెదర్లాండ్స్ అధికారిక లోగోను కూడా కలిగి ఉంటాయి.

Most Read Articles

English summary
Ola rescheduled opening of purchase window for electric scooters
Story first published: Friday, November 26, 2021, 14:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X