నవంబర్ 10వ తేదీ నుండి Ola S1 మరియు S1 Pro టెస్ట్ రైడ్స్ షురూ..

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తమ Ola S1 మరియు S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకున్న కస్టమర్లు నవంబర్ 10 వ తేదీ నుండి ఎస్1 మరియు ఎస్1 ప్రో స్కూటర్లను టెస్ట్ రైడ్ చేయవచ్చని కంపెనీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

నవంబర్ 10వ తేదీ నుండి Ola S1 మరియు S1 Pro టెస్ట్ రైడ్స్ షురూ..

Ola S1 మరియు S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ తమ ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తోంది. తమిళనాడులోని చెన్నై సమీపంలో దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న, ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉత్పత్తి కానున్నాయి. ఈ ప్లాంట్ లో పురుషులతో పాటుగా దాదాపు 10,000 మంది మహిళలు కూడా పనిచేయనున్నారు.

నవంబర్ 10వ తేదీ నుండి Ola S1 మరియు S1 Pro టెస్ట్ రైడ్స్ షురూ..

ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను గడచిన ఆగస్టు 15 న భారతదేశంలో విడుదల చేసింది. దేశీయ విపణిలో వీటి ధరలు వరుసగా రూ. 1 లక్ష మరియు రూ. 1.30 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ గత సెప్టెంబర్ నెలలో రెండు రోజుల పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఫైనల్ బుకింగ్ విండోని ఓపెన్ చేసి ఉంది. ఇప్పటికీ, ఈ స్కూటర్ పట్ల ఆసక్తి గల కస్టమర్లు రూ. 499 చెల్లించి, దీనిని రిజర్వ్ చేసుకోవచ్చు.

నవంబర్ 10వ తేదీ నుండి Ola S1 మరియు S1 Pro టెస్ట్ రైడ్స్ షురూ..

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో పెర్ఫార్మెన్స్, రేంజ్ మరియు ఛార్జింగ్

ఈ రెండు స్కూటర్లలో Ola S1 అనేది చాలా ప్రాథమికమైన మోడల్. అయితే ఇది దాని పవర్ ఫిగర్‌లలో ఎక్కువ భాగం ఇందులో ఖరీదైన S1 Pro మోడల్ తో పంచుకుంటుంది. ఏదేమైనప్పటికీ, ఈ రెండు ఎలక్ట్రిక్ ఓలా స్కూటర్లు కూడా ఇంటీరియర్ పర్మనెంట్ మాగ్నెట్ టైప్ (IPM) మిడ్-డ్రైవ్ మోటారు ద్వారా పనిచేస్తాయి. ఈ మోటార్ 7.37 బిహెచ్‌పి శక్తిని మరియు 58 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

నవంబర్ 10వ తేదీ నుండి Ola S1 మరియు S1 Pro టెస్ట్ రైడ్స్ షురూ..

ఈ రెండు మోడళ్లలో (ఎస్1, ఎస్1 ప్రో) ప్రధానమైన మార్పు దాని బ్యాటరీ ప్యాక్ రూపంలో ఉంటుంది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.98 kWh బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంటుంది, ఇది పూర్తి ఛార్జ్‌పై 121 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. కాగా, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.97 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 181 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

నవంబర్ 10వ తేదీ నుండి Ola S1 మరియు S1 Pro టెస్ట్ రైడ్స్ షురూ..

పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఎస్1 ప్రో లోని బ్యాటరీ ప్యాక్ ను సాధారణ వాల్ సాకెట్‌తో చార్జ్ చేయడానికి సుమారు ఆరు గంటల ముప్పై నిమిషాల సమయం పడుతుంది. కాగా, ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లోని చిన్న బ్యాటరీ ప్యాక్ ను పూర్తిగా చార్జ్ చేయడానికి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది. అయితే, వీటిని ఓలా హైపర్‌ చార్జర్‌ సాయంతో కనెక్ట్ చేసినప్పుడు S1 మరియు S1 Pro రెండు మోడళ్లను కేవలం 18 నిమిషాల్లో 75 కిలోమీటర్ల రేంజ్ కు సరిపడా చార్జ్ చేసుకోవచ్చు.

నవంబర్ 10వ తేదీ నుండి Ola S1 మరియు S1 Pro టెస్ట్ రైడ్స్ షురూ..

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండూ మోడళ్లలో కూడా రెండు రకాల రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. అవి - నార్మల్ మరియు స్పోర్ట్స్. అయితే, ఖరీదైన ఎస్1 ప్రో మోడల్ మాత్రం అదనంగా హైపర్ అనే మూడవ రైడింగ్ మోడ్‌ లభిస్తుంది. ఈ మోడ్ లో స్కూటర్ గరిష్ట వేగంతో నడపవచ్చు. ఓలా ఎస్1 గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు కాగా, ఎస్1 ప్రో గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లుగా ఉంటుంది.

నవంబర్ 10వ తేదీ నుండి Ola S1 మరియు S1 Pro టెస్ట్ రైడ్స్ షురూ..

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో కొలతలు

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండూ కూడా కొలతల పరంగా ఒకేలా ఉంటాయి. ఇవి 1859 మిమీ పొడవు, 712 మిమీ వెడల్పు మరియు 1160 మిమీ ఎత్తును కలిగి ఉంటాయి. రెండు స్కూటర్ల వీల్‌బేస్ పొడవు 1359 మిమీ మరియు ఇవి రెండూ 36 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ ని కలిగి ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల సీట్ ఎత్తు 792 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీగా ఉంటుంది. ఓలా ఎస్1 బరువు 121 కిలోగ్రాములు కాగా, ఎస్1 ప్రో బరువు 125 కిలోగ్రాములుదా ఉంటుంది.

నవంబర్ 10వ తేదీ నుండి Ola S1 మరియు S1 Pro టెస్ట్ రైడ్స్ షురూ..

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఒకే రకమైన ట్యూబ్యులర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడి ఉంటాయి. ఇందులో ముందువైపు సింగిల్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో-షాక్‌ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు (ముందు చక్రంలో 220 మిమీ డిస్క్ మరియు చక్రంలో 180 మిమీ డిస్క్) ఉంటాయి. ఇది కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ను సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో ఇరువైపులా 12 ఇంచ్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ 110/70 R12 టైర్లు ఉంటాయి.

నవంబర్ 10వ తేదీ నుండి Ola S1 మరియు S1 Pro టెస్ట్ రైడ్స్ షురూ..

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఫీచర్లు

ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో స్కూటర్లలో జియో-ఫెన్సింగ్, ప్రాక్సిమిటీ లాక్/అన్‌లాక్, రిమోట్ బూట్ లాక్/అన్‌లాక్, వైఫై మరియు బ్లూటూత్ కనెక్టివిటీ, GPS, OTA అప్‌డేట్‌లు, వెహికల్ ట్రాకింగ్ మరియు రివర్స్ మోడ్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అయితే, ఎస్1 ప్రో లో హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు లభిస్తాయి.

Most Read Articles

English summary
Ola s1 and s1 pro test rides will begin from nov 10 specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X