ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

భారతీయ మార్కెట్లో ఎంతోమంది వాహన ప్రియులు ఎదురు చూస్తున్న కొత్త 'ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్' ఎట్టకేలకు విడుదలైంది. దేశీయ మార్కెట్లో విడుదలై ఈ కొత్త ఎలక్ట్రిక్క్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 99,999. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో విడుదలైంది. ఇందులో ఒకటి ఎస్ 1 కాగా, రెండవ మోడల్ ఎస్ 1 ప్రో.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

దేశీయ మార్కెట్లో ఎస్1 వేరియంట్ ధర రూ. 99,999 కాగా, ఇందులో టాప్ ఎండ్ మోడల్ అయిన ఎస్1 ప్రో ధర రూ. 1,29,999. 2021 అక్టోబర్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అయితే ఈ స్కూటర్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కేవలం 499 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ:

 • ఎస్1: రూ. 85,099
 • ఎస్1 ప్రో: రూ. 1.10 లక్షలు
 • గుజరాత్:

  • ఎస్1: రూ. 79,999
  • ఎస్1 ప్రో: రూ 1.09 లక్షలు
  • మహారాష్ట్ర:

   • ఎస్1: రూ. 94,999
   • ఎస్1 ప్రో: రూ. 1.24 లక్షలు
   • రాజస్థాన్

    • ఎస్1: రూ. 89,968
    • ఎస్1 ప్రో: రూ 1.19 లక్షలు
    • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో 10 కలర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది.

     ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

     ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ డిజైన్ విషయానికి వస్తే, ఇది సింపుల్‌గా కనిపించే ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది.

     ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

     ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్, కాంటూర్డ్ సీట్లు, అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

     ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

     ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో శక్తినిస్తుంది, ఇది 3.92 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడుతుంది. దీనిని బయటకు తీయటానికి అవకాశం లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

     ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

     ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ 60 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం నుండి ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. అయితే, ఇది 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. 50 శాతం ఛార్జ్ తో 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ ద్వారా 6 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.

     ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

     ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 115 కి.మీ. ఈ స్కూటర్ లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎస్1 స్కూటర్ మరియు ఎస్1 ప్రో రెండింటికీ 750W పోర్టబుల్ ఛార్జర్ లభిస్తుంది.

     ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

     ఓలా కంపెనీ ఇప్పటికే హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్‌ను ప్రకటించింది. మొదటి సంవత్సరంలో 400 నగరాల్లో 1 లక్ష ఛార్జింగ్ స్పాట్‌లను సృష్టించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 100 నగరాల్లో 5000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా దీనిని ప్రారంభిస్తారు.

     ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

     కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కనెక్ట్టెడ్ స్మార్ట్ టెక్నాలజీ ఫీచర్ కలిగి ఉంటుంది. దీనిని TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే సహాయంతో ఉపయోగించవచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌తో స్కూటర్‌ని కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. ఈ యాప్ద్వారా సమీప ఛార్జింగ్ స్టేషన్‌తో సహా స్కూటర్‌కు సంబంధించిన కార్యకలాపాల గురించి సమాచారాన్ని పొందవచ్చు.

     ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

     స్కూటర్ హోమ్ ఛార్జర్‌తో వస్తుంది, దీనిని సాధారణ వాల్ సాకెట్‌పై అమర్చవచ్చు. దీనితో పాటుగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రివర్స్ మోడ్ కూడా ఇవ్వబడింది, ఇది పార్కింగ్ సమయంలో లేదా ఇరుకైన ప్రదేశం నుండి సులభంగా బయటకు రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో కీలెస్ ఎంట్రీ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది.

     ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

     ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తమిళనాడులోని కంపెనీ ఫ్యాక్టరీలో తయారు చేయబడుతుంది. కంపెనీకి ప్రతి సంవత్సరం 10 మిలియన్ స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.

     ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

     ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, ఫీచర్స్ & వివరాలు

     ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుల నుండి గొప్ప స్పందనను అందుకుంది మరియు ఇప్పుడు ధర ప్రకటించిన తర్వాత, మరిన్ని బుకింగ్‌లను అందుకునే అవకాశం ఉంటుంది. ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో ఏథర్ 450 ఎక్స్, బజాజ్ చేతక్, టివిఎస్ ఐక్యూబ్ వంటి స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Ola s1 electric scooter launched price rs 99999 range charging features battery delivery details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X