Ola Electric Scooter టెస్ట్ రైడ్ మరియు డెలివరీ.. ఎప్పుడో తెలుసా?

భారతీయ మార్కెట్లో Ola కంపెనీ తన మొదటి Electric Scooter ని భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను (S1 మరియు S1 Pro) విడుదల చేసింది. ఈ స్కూటర్ల ధరల విషయానికి వస్తే ఓలా S1 ధర రూ. 99,999 కాగా, S1 ప్రో ధర రూ. 1,29,999. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదలకాకముందే అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే ఇప్పుడు Ola కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ, సబ్సిడీ మరియు ఇన్సూరెన్స్ వంటి విషయాలను గురించి వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

Ola Electric Scooter టెస్ట్ రైడ్ మరియు డెలివరీ ఎప్పుడంటే?

Ola కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, S1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2021 అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. అయితే ఈ స్కూటర్ యొక్క విక్రయాలు సెప్టెంబర్ 8 నుండి ప్రారంభం కానున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాచ్‌లుగా విక్రయించబడుతుంది.

Ola Electric Scooter టెస్ట్ రైడ్ మరియు డెలివరీ ఎప్పుడంటే?

ఇందులో భాగంగానే ఈ స్కూటర్ నేరుగా కస్టమర్‌ యొక్క ఇంటికి డోర్ డెలివరీ చేయబడుతుంది. అయితే డెలివరీకి ముందు మొత్తం డబ్బును చేల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే తరువాత కస్టమర్ కి ఇది డెలివరీ చేయబడుతుంది. మీరు తరువాత చెల్లించినట్లయితే కొత్త డెలివరీ తేదీ మీకు వెల్లడిస్తారు. కావున కస్టమర్లు ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి.

Ola Electric Scooter టెస్ట్ రైడ్ మరియు డెలివరీ ఎప్పుడంటే?

Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క విక్రయాలు ప్రారంభమైన వెంటనే మొదట బుక్ చేసుకున్న కస్టమర్లకు మొదటగా అందించబడుతుంది. ఈ విధంగానే తరువాత కస్టమర్లకు బ్యాచ్ వారీగా కొనుగోలు చేసే అవకాశం ఇవ్వబడుతుంది. కావున కొంత ఆలస్యమైనా తప్పకుండా స్కూటర్ డెలివరీలు అందుతాయి.

Ola Electric Scooter టెస్ట్ రైడ్ మరియు డెలివరీ ఎప్పుడంటే?

Ola కంపెనీ తన స్కూటర్ అమ్మకాలను ప్రారమ్భహించిన వెంటనే, వినియోగదారులకు డెలివరీ డేట్ తెలియజేస్తారు. కావున కొనుగోలుదారులు ఎలాంటి ఇబ్బందిపడవలసిన అవసరం లేదు. Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా ఉంచబడింది, కావున ఈ స్కూటర్ కొనుగోలు కోసం ప్రత్యేకంగా షోరూమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. దీనిని కూడా కస్టమర్లు గుర్తహించాలి.

Ola Electric Scooter టెస్ట్ రైడ్ మరియు డెలివరీ ఎప్పుడంటే?

Ola S1 Electric Scooter కొనుగోలు ప్రక్రియ:

Ola S1 Electric Scooter ను ఓలా యొక్క అధికారిక యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం, ఓలా యాప్ అందుబాటులో ఉంది, అయితే ఓలా ఎలక్ట్రిక్ యాప్ సెప్టెంబర్ 8 న iOS మరియు Android స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు ప్రక్రియ మొత్తం డిజిటల్ గా ఉంటుంది.

Ola Electric Scooter టెస్ట్ రైడ్ మరియు డెలివరీ ఎప్పుడంటే?

Ola S1 Electric Scooter టెస్ట్ రైడ్:

ఓలా కంపెనీ అందించిన సమాచారం Ola S1 స్కూటర్ టెస్ట్ రైడ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది, వినియోగదారులు స్కూటర్ టెస్ట్ రైడ్ చేసిన తరువాత కూడా నచ్చకపోతే వారి బుకింగ్‌ని రద్దు చేసే సదుపాయం అందుబాటులో ఉంటుంది. అయితే కంపెనీ ఇంకా దాని టెస్ట్ రైడ్ ఎలా నిర్వహించబడుతుందో అధికారికంగా వెల్లడించలేదు, త్వరలో వెల్లడవుతుంది.

Ola Electric Scooter టెస్ట్ రైడ్ మరియు డెలివరీ ఎప్పుడంటే?

Ola S1 Electric Scooter పేమెంట్:

Ola S1 Electric Scooter కోసం పేమెంట్ చెల్లింపులు కస్టమర్‌ సౌలబ్యాన్ని బట్టి ఇప్పుడు కూడా చెల్లించవచ్చు. ఇది మాత్రమే కాకుండా కంపెనీ ఓలా ఫైనాన్షియల్ సర్వీస్ ద్వారా ఫైనాన్స్ ఎంపికను కూడా అందిస్తోంది. దీని కోసం, కంపెనీ IDFC ఫస్ట్ బ్యాంక్, HDFC మరియు టాటా క్యాపిటల్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఓలా S1 కోసం EMI రూ. 2,999 మరియు Ola S1 Pro EMI రూ. 3,199 వద్ద ప్రారంభమవుతుంది.

Ola Electric Scooter టెస్ట్ రైడ్ మరియు డెలివరీ ఎప్పుడంటే?

Ola S1 Electric Scooter ఇన్సూరెన్స్:

Ola Electric Scooter కొనుగోలుదారులు, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఓలా లేదా ఓలా ఎలక్ట్రిక్ యాప్‌లో ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ప్రాథమిక విధానం ప్రకారం, రిజిస్ట్రేషన్ కోసం ఒక సంవత్సరం ఓన్ డ్యామేజ్ మరియు 5 సంవత్సరాల తార్డ్ పార్టీ, తప్పనిసరి. ఇది కాకుండా, మీరు పర్సనల్ యాక్సిడెంట్ కవర్, జీరో డిప్రెషషన్ మరియు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా పొందవచ్చు.

Ola Electric Scooter టెస్ట్ రైడ్ మరియు డెలివరీ ఎప్పుడంటే?

Ola S1 Electric Scooter సబ్సిడీ:

ప్రస్తుతం మనదేశంలో ఎలక్ట్రిక్ వానల వినియోగాన్ని పెంచ్చడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను అందిస్తున్నాయి. ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాలలో FAME-2 స్కీమ్ కింద అదనపు సబ్సిడీ అందుబాటులో ఉంచబడింది. దీని కోసం, మీరు మీ రాష్ట్రంలో సబ్సిడీ అందిస్తున్నారా లేదా అని తనిఖీ చేయవచ్చు. ఓలా ఎస్ 1 కొనుగోలు చేసిన తర్వాత దీనిని పొందవచ్చు. ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, ఒడిశా మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా సబ్సిడీ అందించబడుతోంది.

Ola Electric Scooter టెస్ట్ రైడ్ మరియు డెలివరీ ఎప్పుడంటే?

అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Electric Scooter) ఇప్పుడు దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లో కూడా అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ Ola Electric Scooter ఎగుమతి 2022 నుంచి ఎగుమతి చేయబడతాయని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఖండాంతరాలు దాటడానికి సిద్ధంగా ఉంది.

Most Read Articles

English summary
Ola s1 electric scooter purchase delivery test ride insurance subsidy details
Story first published: Tuesday, September 7, 2021, 9:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X