Ola Electric విడుదల చేసిన మరో వీడియో; ఇందులో ఏముంది

Ola Electric (ఓలా ఎలక్ట్రిక్) తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదలచేసి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రవేశించింది. Ola Electric ఇటీవల తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ నుంచి Ola S 1 మరియు Ola S 1 Pro లను భారత మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. Ola Electric Scooter 10 కలర్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది.

Ola Electric విడుదల చేసిన మరో వీడియో; ఇందులో ఏముంది

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త Ola S 1 ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) కాగా, Ola S 1 Pro ధర 1,29,999 రూపాయలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ Ola ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పటికే చాలా సమాచారాన్ని అందించింది. అయితే కంపెనీ ఇప్పుడు తన టాప్-స్పెక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన Ola S 1 Pro యొక్క వీడియోను విడుదల చేసింది.

Ola Electric విడుదల చేసిన మరో వీడియో; ఇందులో ఏముంది

కంపెనీ ఇది వరకు విడుదల చేసిన సమాచారం ప్రకారం Ola S1 యొక్క గరిష్ట వేగం గంటకు 90 కిమీ అని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు అదేవిధంగా కంపెనీ యొక్క Ola S 1 Pro యొక్క గరిష్ట వేగం 115 కిలోమీటర్లు అని తెలిపింది. కంపెనీ విడుదల చేసిన ఈ వీడియోలో Ola S 1 Pro యొక్క స్పీడ్ తెలియజేస్తుంది. Ola Electric తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ కొత్త వీడియో అప్‌లోడ్ చేసింది.

Ola Electric విడుదల చేసిన మరో వీడియో; ఇందులో ఏముంది

ఈ వీడియోలో Ola S 1 Pro Scooter 'హైపర్' డ్రైవింగ్ మోడ్‌ టెస్ట్ చేయబడింది. ఇది మాత్రమే కాకుండా Ola S 1 Pro నార్మల్ మరియు స్పోర్ట్‌ అనే మరో రెండు డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే కంపెనీ యొక్క S 1 ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం నార్మల్ మరియు స్పోర్ట్స్ మోడ్స్ మాత్రమే పొందుతుంది. ఈ వేరియంట్ లో హైపర్ మోడ్ ఆప్షన్ అందుబాటులో లేదు.

Ola Electric విడుదల చేసిన మరో వీడియో; ఇందులో ఏముంది

మీరు ఈ వీడియోలో గమనించినట్లతే Ola S 1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3 సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్లు మరియు 5 సెకన్లలో 0 నుండి 60 కిలోమీటర్లు వేగవంతమయ్యింది. తరువాత ఈ స్కూటర్ 115 కిమీ/గం గరిష్ట వేగాన్ని అందించింది.

Ola Electric విడుదల చేసిన మరో వీడియో; ఇందులో ఏముంది

అదేవిధముగా కంపెనీ యొక్క Ola S1 వేరియంట్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు అని ఇప్పటికే కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలో 40 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుంది. Ola S 1 గరిష్టంగా 121 కిమీల శ్రేణిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే Ola S 1 Pro గరిష్టంగా 181 కిలోమీటర్లు.

Ola Electric విడుదల చేసిన మరో వీడియో; ఇందులో ఏముంది

Ola Electric Scooters ఎలక్ట్రిక్ స్కూటర్లు 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉండి, 3.92 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులోని బ్యాటరీని బయటకు తీసే అవకాశం ఉండదు. Ola S 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జర్‌తో 60 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. హోమ్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయడానికి 6 గంటలు పడుతుంది. Ola ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సింపుల్ డిజైన్‌తో అందించింది మరియు దాని ముందు ఆప్రాన్‌లో Ola బ్యాడ్జింగ్ చూడవచ్చు. ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్ దాని హెడ్‌లైట్ క్లస్టర్‌లో ఇవ్వబడింది.

Ola Electric విడుదల చేసిన మరో వీడియో; ఇందులో ఏముంది

Ola Electric Scooter యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది. Ola Electric Scooter భారత మార్కెట్లో Ather 450 X, Bajaj Chetak, TVS iQube వంటి స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Ola Electric విడుదల చేసిన మరో వీడియో; ఇందులో ఏముంది

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎల్ఈడీ టైల్ లైట్, పెద్ద సీటు, అల్లాయ్ వీల్స్, రియర్ గ్రాబ్ రైల్, 50 లీటర్ల అండర్ స్టోరేజ్, ఫ్రంట్ లగేజ్ స్పేస్, క్రూయిజ్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ వంటి ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వివిధరకాలుగా ఉంటుంది. అంతే కాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను బట్టి వాటి ధరలు ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

Ola కంపెనీ ఇప్పటికే హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్‌ను ప్రకటించింది. మొదటి సంవత్సరంలో 400 నగరాల్లో 1 లక్ష ఛార్జింగ్ స్పాట్‌లను సృష్టించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 100 నగరాల్లో 5000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా దీనిని ప్రారంభిస్తారు.

Ola Electric విడుదల చేసిన మరో వీడియో; ఇందులో ఏముంది

కొత్త Ola Electric Scooter కనెక్ట్టెడ్ స్మార్ట్ టెక్నాలజీ ఫీచర్ కలిగి ఉంటుంది. దీనిని TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే సహాయంతో ఉపయోగించవచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌తో స్కూటర్‌ని కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. ఈ యాప్ ద్వారా సమీప ఛార్జింగ్ స్టేషన్‌తో సహా స్కూటర్‌కు సంబంధించిన కార్యకలాపాల గురించి సమాచారాన్ని పొందవచ్చు.

Most Read Articles

English summary
Ola s1 pro electric scooter top speed revealed official video details
Story first published: Friday, August 20, 2021, 15:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X