కొత్త సంవత్సరం రాకముందే కొత్త స్కూటర్ విడుదల చేసిన One-Moto: ధర & వివరాలు

దేశీయ విఫణిలో రోజు రోజుకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే వన్-మోటో (One-Moto) అనే ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 2 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త సంవత్సరం రాకముందే కొత్త స్కూటర్ విడుదల చేసిన One-Moto: ధర & వివరాలు

వన్-మోటో అనేది బ్రిటిష్ వాహన తయారీ సంస్థ. ఇప్పుడు ఈ కంపెనీ భారతీయ మార్కెట్లో వన్ మోటో ఎలక్టా (One-Moto Electa) అనే పేరుతో ఒక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ వన్-మోటో ఎలక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క మూడవ ఉత్పత్తి.

కొత్త సంవత్సరం రాకముందే కొత్త స్కూటర్ విడుదల చేసిన One-Moto: ధర & వివరాలు

వన్-మోటో కంపెనీ 2021 నవంబర్ నెలలోనే భారతీయ మార్కెట్లో రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇందులో ఒకటి కమ్యూటా స్కూటర్ కాగా, మరొకటి బైకా స్కూటర్. ఈ రెండు స్కూటర్ల తరువాత ఇప్పుడు వన్-మోటో ఎలక్ట్రా ముచ్చటగా మూడవ స్కూటర్.

కొత్త సంవత్సరం రాకముందే కొత్త స్కూటర్ విడుదల చేసిన One-Moto: ధర & వివరాలు

కంపెనీ యొక్క మూడు ఉత్పత్తులు ఒకే యాప్‌కు మద్దతునిస్తాయి. ఇది జియో-ఫెన్సింగ్, IoT మరియు బ్లూటూత్ వంటి ఫీచర్లను అందిస్తుంది. కానీ ఇప్పుడు విడుదలైన కొత్త స్కూటర్ ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు స్కూటర్‌ల నుండి వేరు చేస్తుంది. ఎందుకంటే ఇందులో 72 వి మరియు 45ఏ రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ కేవలం నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోగలదు.

కొత్త సంవత్సరం రాకముందే కొత్త స్కూటర్ విడుదల చేసిన One-Moto: ధర & వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క ఛార్జ్ తో గరిష్టంగా 150 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4KW QS బ్రష్‌లెస్ DC హబ్ మోటార్‌ను ఉపయోగిస్తుంది, ఇది 100 కిమీ/గం గరిష్ట వేగాన్ని పొందుతుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త సంవత్సరం రాకముందే కొత్త స్కూటర్ విడుదల చేసిన One-Moto: ధర & వివరాలు

వన్-మోటో ఎలక్టా స్కూటర్ చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికి ఇది అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ అనలాగ్ డిస్‌ప్లేను ఉపయోగించింది, అంతే కాకూండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రెండు చక్రాలపై హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లు మరియు ఆప్సనల్ క్రోమ్ అప్‌గ్రేడ్‌లు ఇవ్వబడ్డాయి. కావున ఇవన్నీ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కి మంచి క్లాసిక్ మరియు ఫ్రీమియం రూపాన్ని అందిస్తుంది.

కొత్త సంవత్సరం రాకముందే కొత్త స్కూటర్ విడుదల చేసిన One-Moto: ధర & వివరాలు

One-Moto కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎలక్ట్రిక్ మోటార్, కంట్రోలర్ మరియు బ్యాటరీపై మూడు సంవత్సరాల వారంటీని అందిస్తోంది. అయితే ఈ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 890 మి.మీ, వెడల్పు 720 మి.మీ, ఎత్తు 1,090 మి.మీ మరియు వీల్‌బేస్ 1,390 మి.మీ వరకు ఉంటుంది. One-Moto Electa మొత్తం బరువు 115 కిలోలు మరియు 150 కిలోల పేలోడ్ సామర్థ్యంతో వస్తుంది.

కొత్త సంవత్సరం రాకముందే కొత్త స్కూటర్ విడుదల చేసిన One-Moto: ధర & వివరాలు

One-Moto Electa మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మాట్ బ్లాక్, షైనీ బ్లాక్, బ్లూ, రెడ్ మరియు గ్రే కలర్స్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. మరియు చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న సమయంలో కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ విడుదల చేయడం జరిగిందని వన్-మోటో ఇండియా సీఈవో శుభంకర్ చౌదరి తెలిపారు.

కొత్త సంవత్సరం రాకముందే కొత్త స్కూటర్ విడుదల చేసిన One-Moto: ధర & వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఈ కారణంగానే చాలా కంపెనీలు ఆధునిక ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే వన్-మోటో కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఇది ప్రధానంగా మెట్రో నగరాల్లో ప్రారంభించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతోంది.

కొత్త సంవత్సరం రాకముందే కొత్త స్కూటర్ విడుదల చేసిన One-Moto: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో ఇప్పటికే విడుదలైన కంపెనీ యొక్క One-Moto బైకా స్కూటర్ ధర రూ. 1.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, One-Moto కమ్యుటా స్కూటర్ ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ కొత్త స్కూటర్ విడుదల చేసింది, అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, భారతీయ మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడంలో విజయం సాధించగలదా.. లేదా అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

Most Read Articles

English summary
One moto electra electric scooter launched in india price range specifications details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X