వడ్డీ లేని రుణం (నో కాస్ట్ ఈఎమ్ఐ)తో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి

చెన్నైకి చెందిన ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ అందిస్తున్న పాపులర్ స్పోర్ట్స్ కమ్యూటర్ బైక్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి కోసం కంపెనీ ఓ సరికొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఆసక్తిగల కస్టమర్లు ఇప్పుడు నో కాస్ట్ ఈఎమ్ఐ ద్వారా వడ్డీ లేని రుణంతో ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.

వడ్డీ లేని రుణం (నో కాస్ట్ ఈఎమ్ఐ)తో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్ క్రింద కస్టమర్లు మూడు లేదా ఆరు నెలల రుణ కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. ఈ సమయంలో కస్టమర్లు తమ రుణానాన్ని క్రమం తప్పకుండా చెల్లించినట్లయితే, తీసుకున్న రుణ మొత్తానికి వారు ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు.

వడ్డీ లేని రుణం (నో కాస్ట్ ఈఎమ్ఐ)తో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి

ఎంపిక చేయబడిన కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాకుండా, ఈ ఆఫర్ జూలై 15, 2021 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. కస్టమర్లు టీవీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు.

వడ్డీ లేని రుణం (నో కాస్ట్ ఈఎమ్ఐ)తో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి

ఈ ప్లాన్ ఇప్పటికే టీవీఎస్ ఎన్‌టార్క్, అపాచీ ఆర్టీఆర్ 200 4వి, స్కూటీ పెప్ ప్లస్ మోడళ్లకు కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ యొక్క ప్రత్యేకతలను నిర్ధారించడానికి మీకు సమీపంలో ఉన్న టీవీఎస్ డీలర్‌షిప్‌తో సంప్రదించాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము.

వడ్డీ లేని రుణం (నో కాస్ట్ ఈఎమ్ఐ)తో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి

భారత మార్కెట్లో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి డ్రమ్ మరియు డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.1,08,565 మరియు రూ.1,11,615 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.

వడ్డీ లేని రుణం (నో కాస్ట్ ఈఎమ్ఐ)తో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి

భారతీయ యువకుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి ఎంట్రీ లెవల్ కమ్యూటర్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ రోజూవారీ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఈ బైక్‌లో షార్ప్‌గా కనిపించే ఎల్‌ఇడి హెడ్‌లైట్లు, డ్యూయల్ డిఆర్‌ఎల్‌లు మరియు వెనుక భాగంలో ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్ ఉంటాయి.

వడ్డీ లేని రుణం (నో కాస్ట్ ఈఎమ్ఐ)తో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి

ప్రయాణీకుల భద్రత కోసం ఈ మోటార్‌సైకిల్‌లో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు గ్లైడ్ త్రూ టెక్నాలజీ (జిటిటి) కూడా ఉన్నాయి. ఈ అపాచీ బైక్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మరియు రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

వడ్డీ లేని రుణం (నో కాస్ట్ ఈఎమ్ఐ)తో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి బైక్‌లో పవర్‌ఫుల్ 159.7సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 17.39 బిహెచ్‌పి శక్తిని మరియు 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

వడ్డీ లేని రుణం (నో కాస్ట్ ఈఎమ్ఐ)తో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి

ఈ ఇంజన్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు చక్రంపై 270 మి.మీ డిస్క్ మరియు వెనుక చక్రంపై 200 మి.మీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

Most Read Articles

English summary
Own A TVS Apache RTR 160 4V With No Cost EMI Plan, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X