ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్!

స్పెయిన్‌కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్ట్-అప్ సంస్థ ఓఎక్స్ (OX) తమ మొట్టమొదటి మోటార్‌సైకిల్ 'ఓఎక్స్ వన్'ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయడానికి రెడీగా ఉంది. ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఉత్పత్తికి సిద్ధంగా ఉందని కంపెనీ పేర్కొంది.

ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్!

ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రాజెక్ట్ దాదాపుగా పూర్తయ్యిందని, ఇక ఈ మోడల్ యొక్క మాస్ ప్రొడక్షన్ మాత్రమే బాకీ ఉందని కంపెనీ తెలిపింది. మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్ ఉత్పత్తి దశకు చేరుకోనుంది.

ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్!

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చూడటానికి కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్‌గా అనిపిస్తుంది. ట్రెడిషన్ మోటార్‌సైకిళ్లతో పోల్చుకుంటే, ఇది చాలా సరళమైన డిజైన్‌ను కలిగి, చూడటానికి ఎంతో ఫ్యూచరిస్టిక్‌గా అనిపిస్తుంది.

MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్!

రెట్రో-మోడ్రన్ డిజైన్‌ను తలపించే ఈ బైక్ ముందు వైపు క్లాసిక్ మోటార్‌సైకిల్ మాదిరిగా సైడ్స్ నుండి మోడ్రన్ బైక్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ బైక్‌పై ఎలాంటి క్రీజ్ లైన్స్, స్పెషల్ డిజైన్ ఎలిమెంట్స్ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది.

ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్!

ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో స్థిరమైన సెంటర్ ఆఫ్ గ్రావిటీని అందించేందుకు దీని బ్యాటరీ వ్యవస్థను బైక్ మధ్య భాగంలో అమర్చారు. ఈ బైక్‌ను చాలా ధృడమైన ఫ్రేమ్‌పై నిర్మించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్‌ను వెనుక చక్రంలో అమర్చబడి ఉంటుంది.

MOST READ:భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్!

బైక్ ముందు వైపు గుండ్రటి ఎల్ఈడి హెడ్‌లైట్, దానికి ఇరువైపులా సన్నటి మరియు గుండ్రటి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. హ్యాండిల్ బార్‌పై ఇరువైపులా గుండ్రటి రియర్ వ్యూ మిర్రర్స్ అమర్చబడి కనిపిస్తాయి. హ్యాండిల్ బార్ మధ్యలో సన్నటి ఎల్‌సిడి డిజిటిల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది.

ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్!

ఇక ఈ బైక్ వెనుక డిజైన్‌ను గమనిస్తే, ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది. మధ్యలో గుండ్రటి బ్రేక్ ల్యాంప్ మరియు దానికి ఇరువైపులా టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. సీట్ క్రింది భాగంలో సన్నటి ఎల్ఈడి లైట్‌బార్ కూడా ఉంటుంది.

MOST READ:హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో.. అదుర్స్

ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్!

ఓఎక్స్ వన్ హార్డ్‌వేర్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో అడ్జస్టబల్ డ్యూయెల్ షాక్ అబ్జార్వర్లు, ముందు వైపు సింగిల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు డ్యూయెల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. అలాగే, ముందు వైపు స్పోక్ వీల్ మరియు వెనుక వైపు హబ్ మోటార్‌తో కూడిన అల్లాయ్ వీల్ ఉంటుంది.

ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్!

ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో 8 కిలోవాట్ బ్రష్‌లెస్ డిసి ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లు. ఇందులో రెండు 72వి, 30ఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీలు ఉంటాయి.

MOST READ:సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్!

ఈ బ్యాటరీల పూర్తి ఛార్జ్‌తో 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. కేవలం 140 కిలోగ్రాముల బరువున్న ఓఎక్స్ వన్ ఈ విభాగంలో తేలికైన మోటార్‌సైకిల్ మాత్రమే కాకుండా వేగవంతమైనదని కూడా కంపెనీ తెలిపింది.

ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్!

ఇందలోని ఎలరక్ట్రిక్ మోటార్ జనరేట్ చేసే పవర్ సుమారు 11 బిహెచ్‌పిలకు సమానంగా ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఓఎక్స్ వన్ ఎలక్ట్రిక్ మోటార్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. స్పెయిన్ మార్కెట్లో ఓఎక్స్ వన్ బైక్ ధర 5,200 యూరోలు (సుమారు రూ.4.71 లక్షలు)గా ఉంటుంది.

Most Read Articles

English summary
OX Revealed Production Ready One Electric Motorcycle, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X