దేశవ్యాప్తంగా వెస్పా, ఆప్రిలియా షోరూమ్‌లను రీఓపెన్ చేసిన పియాజియో

కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా గడచిన ఏప్రిల్ నెల నుండి దాదాపు రెండు నెలల పాటు దేశం లాక్‌డౌన్‌లో ఉన్న పరిస్థితులను చూశాం. అయితే, ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. వైరస్ తీవ్రత తగ్గడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది, వ్యాపారాలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా వెస్పా, ఆప్రిలియా షోరూమ్‌లను రీఓపెన్ చేసిన పియాజియో

ఈ నేపథ్యంలో, పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పివిపిఎల్) భారతదేశం అంతటా తమ వెస్పా మరియు అప్రిలియా టూవీలర్ డీలర్‌షిప్ కేంద్రాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో, గడచిన ఏప్రిల్ మరియు మే నెల మధ్యలో కంపెనీ తమ డీలర్‌షిప్‌లను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసినదే.

దేశవ్యాప్తంగా వెస్పా, ఆప్రిలియా షోరూమ్‌లను రీఓపెన్ చేసిన పియాజియో

మహారాష్ట్రలోని బారామతి కేంద్రంగా ఉన్న పివిపిఎల్ ఇటాలియన్ ఆటో మేజర్ పియాజియో గ్రూప్ యొక్క పూర్తిగా యాజమాన్యంలో ఉంది. ఇది త్రీ-వీలర్ విభాగంలో అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది మరియు వెస్పా, అప్రిలియా వంటి బ్రాండ్ల క్రింద అనేక రకాల ప్రీమియం స్కూటర్లను తయారు చేస్తుంది.

దేశవ్యాప్తంగా వెస్పా, ఆప్రిలియా షోరూమ్‌లను రీఓపెన్ చేసిన పియాజియో

ఈ విషయం గురించి పియాజియో ఇండియా ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డియెగో గ్రాఫి మాట్లాడుతూ, కోవిడ్-19 యొక్క సెకండ్ వేవ్ వంటి క్లిష్ట సమయాల్లో తాము తమ డీలర్లతో కలిసి పని చేస్తున్నామని, ఈ లాక్డౌన్ల సమయంలో తమ కస్టమర్ల యొక్క ఆందోళనను కూడా దృష్టిలో ఉంచుకుని, లాక్డౌన్ సమయంలో ముగిసిన అసలైన పరికరాల వారంటీ మరియు ఉచిత సేవలను కూడా పొడగించామని ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా వెస్పా, ఆప్రిలియా షోరూమ్‌లను రీఓపెన్ చేసిన పియాజియో

గడచిన ఏప్రిల్, మే నెల మధ్య కాలంలో ముగిసిన వారంటీ మరియు ఫ్రీ సర్వీసుల గడువును కంపెనీ జులై 31, 2021వ తేదీ వరకు పొడగించింది. తాజా పరిస్థితుల తర్వాత, ఇప్పుడు తమ డీలర్‌షిప్‌లు అన్ని వాహన అమ్మకాలు మరియు సర్వీస్ అవసరాలను తీరుస్తాయని, కరోనా మార్గదర్శకాలను అనుసరించి అన్ని భద్రతా చర్యలు పాటిస్తున్నామని ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా వెస్పా, ఆప్రిలియా షోరూమ్‌లను రీఓపెన్ చేసిన పియాజియో

కోవిడ్-19 ఫస్ట్ వేవ్ సమయంలో కూడా పియాజియో ఏప్రిల్ 2020లో, భారతీయ వినియోగదారుల కోసం ఇలాంటి సేవా పొడిగింపులను ప్రకటించింది. అదే సమయంలో, భారత మార్కెట్లో మరింత చురుకుగా ఉండటానికి ఈ సంవత్సరం కంపెనీకి పెద్ద ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది.

దేశవ్యాప్తంగా వెస్పా, ఆప్రిలియా షోరూమ్‌లను రీఓపెన్ చేసిన పియాజియో

ఇందులో భాగంగా, పియాజియో త్వరలోనే భారత మార్కెట్లో పలు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తామని కంపెనీ ప్రకటించింది. అమ్మకాలను పెంచడంతో పాటు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి డీలర్‌షిప్‌ల సంఖ్యను మరింత పెంచాలని పియాజియో యోచిస్తోంది.

దేశవ్యాప్తంగా వెస్పా, ఆప్రిలియా షోరూమ్‌లను రీఓపెన్ చేసిన పియాజియో

ప్రస్తుతం, ఈ బ్రాండ్‌కు దేశంలో 725కి పైగా వాహన డీలర్‌షిప్‌లు మరియు 1,100 కి పైగా టచ్ పాయింట్లు ఉన్నాయి. అదనంగా, మార్కెటింగ్ విభాగాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి సరఫరాదారులు మరియు రిటైలర్ల యొక్క బలమైన నెట్‌వర్క్ కూడా తమకు ఉందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Piaggio Reopens Vespa And Aprilia Showrooms Across India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X