మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన పియాజియో: వివరాలు

భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది. ఈ సమయంలో చాలా కంపెనీలు తమ బ్రాండ్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే పియాజియో తన కొత్త వన్-ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది.

మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన పియాజియో: వివరాలు

ఈ కొత్త పియాజియో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అధికారిక ప్రయోగం సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం టిక్ టాక్‌లో జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని యువ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని చాలా స్టైలిష్ గా తయారు చేయడం జరిగింది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన పియాజియో: వివరాలు

కొత్త పియాజియో యొక్క వన్-ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సరౌండ్ ఎల్‌ఈడీ లాంప్స్, కీలెస్ ఎంట్రీ, విశాలమైన అండర్-సీట్ స్టోరేజ్ వంటి అనేక ఫీచర్లు మరియు అప్డేటెడ్ టెక్నాలజీ వంటి వాటిని కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో రూబస్ట్ పుల్ అవుట్ ఫుట్‌పాగ్‌లు మరియు విశాలంగా ఉండే ఫుట్‌బోర్డ్ కూడా ఉంది.

MOST READ:ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు

మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన పియాజియో: వివరాలు

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను అధికారికంగా ఆవిష్కరించినప్పటికీ దానిలో ఉన్న టెక్నికల్ ఫీచర్స్ వెల్లడించలేదు. అయితే 2021 మే 28 న బీజింగ్ లో జరిగే మోటార్ షోలో టెక్నీకల్ ఫీచర్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది. కావున త్వరలో ఈ టెక్నీకల్ ఫీచర్స్ గురించి పూర్తి సమాచారం అందుబాటులోకి రానుంది.

మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన పియాజియో: వివరాలు

పియాజియో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక వేరియంట్లలో అందించబడుతుందని కంపెనీ పేర్కొంది. దీనితో పాటు ఇందులో రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. కావున దీనిని సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. దేశీయ మార్కెట్లో పియాజియో కంపెనీ తన అమ్మకాలు మరియు సేవలను పెంచడానికి మరిన్ని డీలర్‌షిప్‌లను చేయడానికి చేస్తోంది.

MOST READ:లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన పియాజియో: వివరాలు

ఇటాలియన్‌ మార్కెట్ కి చెందిన ఈ వాహన తయారీ సంస్థ పియాజియో, ఎప్రిలియా మరియు వెస్పా బ్రాండ్ స్కూటర్లను తయారు చేస్తుంది. పియాజియో, వెస్పా మరియు ఎప్రిలియా వాహనాలకు భారతదేశం ప్రధాన మార్కెట్. నివేదికల ప్రకారం పియాజియో యొక్క 45% వాహనాలు భారతదేశంలోనే అమ్ముడవుతున్నాయి.

మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన పియాజియో: వివరాలు

ఈ కారణంగానే కంపెనీ ఇప్పుడు తన డీలర్‌షిప్‌లను మరింత విస్తరింహడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది కంపెనీ 100 కొత్త డీలర్‌షిప్‌లను తెరవాలని కూడా యోచిస్తోంది. దీనితో పాటు పియాజియో తన ప్రసిద్ధ బెవర్లీ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ 2021 పియాజియో బెవర్లీ స్కూటర్ కొత్త స్టైలింగ్, మరింత కొత్త టెక్నాలజీ వంటివి కలిగి ఉంటుంది.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేసిన మరో బాలీవుడ్ స్టార్, ఎవరో తెలుసా?

మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన పియాజియో: వివరాలు

ఈ పియాజియో బెవర్లీ స్కూటర్‌లో 300 సిసి, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ అమర్చారు. ఇంజిన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 25.5 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది మునుపటి మోడల్ కంటే 23 శాతం ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ నిర్ధారించింది.

మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన పియాజియో: వివరాలు

కొత్త వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాది జూన్ నుంచి యూరోపియన్ మార్కెట్లలో విక్రయించబడుతుందని పియాజియో ధృవీకరించింది. తర్వాత దశలో ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయవచ్చని కంపెనీ తెలిపింది. కానీ భారతదేశంలో పియాజియో యొక్క వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల గురించి ఎటువంటి సమాచారం కంపెనీ అందించలేదు.

MOST READ:గిఫ్ట్‌గా పొందిన థార్ ఎస్‌యూవీలో ఆఫ్-రోడ్ డ్రైవ్ చేసిన క్రికెటర్ [వీడియో]

Most Read Articles

English summary
Piaggio One Electric Scooter Unveiled. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X