మీకు తెలుసా.. ప్రపంచంలోనే అత్యధిక పరిధిని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇదే

భారతీయ మార్కెట్లో వాహనాల సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వాహన కొనుగోలుదారులు ఎక్కువ కావడమే, వాహన కొనుగోలుదారులు వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు, అందులోని ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ వంటివి మాత్రమే కాకుండా వాటి రేంజ్ కూడా పరిశీలించడం సర్వసాధారణం. అది పెట్రోల్ వాహనాలు కావచ్చు లేదా ఎలక్ట్రిక్ వాహనాలు కావచ్చు. ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతారు.

మీకు తెలుసా.. ప్రపంచంలోనే అత్యధిక పరిధిని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇదే

ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు అమాంతం పెరుగుతున్న తరుణంలో ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో కూడా అధిక రేంజ్ ఇచ్చే వాహనాలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. మార్కెట్లో అధిక రేంజ్ ఇచ్చే వాహనాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇందులో ఒకటి Raft Motors (ర్యాఫ్ట్ మోటార్స్).

మీకు తెలుసా.. ప్రపంచంలోనే అత్యధిక పరిధిని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇదే

Raft Motors యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు ఇతర వాహనాలకంటే కూడా ఎక్కువ రేంజ్ అందిస్తాయి. ముంబైకి చెందిన Raft Motors ఇటీవల ఇండస్ NX (ఎన్ఎక్స్) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ తో దాదాపు 480 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

మీకు తెలుసా.. ప్రపంచంలోనే అత్యధిక పరిధిని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇదే

ఒక్క ఛార్జ్ తో అత్యధిక పరిధిని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే అని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఆప్టేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

మీకు తెలుసా.. ప్రపంచంలోనే అత్యధిక పరిధిని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇదే

Raft Motors తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని మూడు వేరియంట్లలో విడుదల చేసింది. అవి ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ మరియు టాప్ వేరియంట్ వేరియంట్స్. వాహన వినియోగారుల సమయాన్ని ఆదా చేయడానికి ఈ స్కూటర్‌లో 10 ఆంపియర్‌ల ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని అందించింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో తెఫ్ట్ అలారం, రివర్స్ గేర్ ఆప్సన్, కీలెస్-స్టార్ట్, రిమోట్-లాకింగ్, స్టైలిష్ డిస్క్ బ్రేకులు మరియు చైల్డ్-సేఫ్ పార్కింగ్ మోడ్ వంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మీకు తెలుసా.. ప్రపంచంలోనే అత్యధిక పరిధిని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇదే

Raft Indus NX ఎంట్రీ-లెవల్ మోడల్ 48వి 65 యాంపియర్ రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇందులోని బ్యాటరీ బయటకు తీసి చార్జ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి సదుపాయం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

మీకు తెలుసా.. ప్రపంచంలోనే అత్యధిక పరిధిని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇదే

Raft Indus NX ఎంట్రీ-లెవల్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 156 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ముంబై ఎక్స్-షోరూమ్ ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,18,500.

ఇక Raft Indus NX మిడ్-రేంజ్ మోడల్‌లో కూడా ఇలాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్‌లో, కంపెనీ 48వి 135 యాంపియర్ ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌ను ఇన్‌స్టాల్ చేసింది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో దాదాపు 324 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. Raft Indus NX మిడ్-రేంజ్ వేరియంట్ ధర రూ. 1,91,976 (ఎక్స్-షోరూమ్, ముంబై).

మీకు తెలుసా.. ప్రపంచంలోనే అత్యధిక పరిధిని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇదే

Raft Indus NX యొక్క టాప్ మోడల్ ఒక్క చార్జ్ తో 480 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో కంపెనీ 9.6 కిలోవాట్ సామర్థ్యం కలిగిన డ్యూయల్ బ్యాటరీ ఆప్సన్స్ అందిస్తుంది. ఇండస్ NX యొక్క టాప్ వేరియంట్ ధర రూ. 2,57,431 (ఎక్స్-షోరూమ్, ముంబై).

మీకు తెలుసా.. ప్రపంచంలోనే అత్యధిక పరిధిని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇదే

భారతదేశంలో మొత్తం 550 కి పైగా నగరాలలో Raft Motors తన డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. అయితే 2022 మార్చి నాటికి దేశంలోని ప్రతి నగరంలోనూ, మార్చి 2023 నాటికి ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ తన ఉనికిని చాటుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే Raft Motors కంపెనీకి ప్రపంచం నలుమూలల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తుంది.

మీకు తెలుసా.. ప్రపంచంలోనే అత్యధిక పరిధిని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇదే

Raft Motors కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కాకుండా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. ఇందులో భాగంగానే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ టీవీలు మరియు హై-ఫై కచేరీ సౌండ్ సిస్టమ్‌ని కూడా కంపెనీ ప్రారంభించింది. ఇవి కూడా మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందాయి.

Most Read Articles

English summary
Raft indus nx electric scooter with 480 km range launched features details
Story first published: Wednesday, September 29, 2021, 16:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X