Revolt RV400 బైక్ ఇప్పుడు అదిరిపోయే కొత్త కలర్‌లో

భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో కొత్త కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే Revolt Motors కంపెనీ కూడా ఇప్పటికే తన RV400 ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు RV400 ఎలక్ట్రిక్ బైక్ ను కొత్త కలర్ ఆప్సన్ లో ప్రవేశపెట్టింది.

Revolt RV400 బైక్ ఇప్పుడు అదిరిపోయే కొత్త కలర్‌లో

Revolt Motors (రివాల్ట్ మోటార్స్) తన RV400 బైక్ ను వైట్-సిల్వర్ పెయింట్ స్కీమ్‌లో ప్రవేశపెట్టింది. కానీ ప్రస్తుతం, కంపెనీ ఈ కొత్త కలర్ పేరును వెల్లడించలేదు. కొత్త కలర్ స్కీమ్‌తో పాటు ఇప్పుడు ఈ బైక్ ఇప్పుడు రెబెల్ రెడ్ మరియు కాస్మిక్ బ్లాక్‌తో సహా మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Revolt RV400 బైక్ ఇప్పుడు అదిరిపోయే కొత్త కలర్‌లో

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ బైక్ లో కొత్త కలర్ స్కీమ్ కాకుండా, ఇతర మార్పులు చేయలేదు. Revolt RV400 బైక్ చూడటానికి ఈ కొత్త కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. కావున ఎక్కువమంది వాహన కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

Revolt RV400 బైక్ ఇప్పుడు అదిరిపోయే కొత్త కలర్‌లో

Revolt Motors (రివాల్ట్ మోటార్స్) సీఈఓ రాహుల్ శర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా, ఈ కొత్త కలర్ Revolt RV400 బుకింగ్స్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు కంపెనీ ఈ బైక్ లో ఒక అప్‌డేట్‌ కూడా చేసింది. RV400 బైక్ లో స్వైప్ టు స్టార్ట్ ఫీచర్‌ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది.

Revolt RV400 బైక్ ఇప్పుడు అదిరిపోయే కొత్త కలర్‌లో

ఈ కొత్త ఫీచర్‌తో, వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా రివాల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. ప్రారంభించడానికి ఫీచర్‌ని స్వైప్‌తో బైక్‌ను స్విచ్-ఆన్ చేయడానికి, వినియోగదారు కేవలం యాప్‌ను ఓపెన్ చేయాలి మరియు పవర్ బటన్‌ని ఎడమ నుండి కుడికి స్లైడ్ చేయాలి. ఈ ఫీచర్ యూజర్ కీ లేకుండా బైక్‌ను స్టార్ట్ చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో లాక్, అన్‌లాక్ మరియు బైక్ ట్రాకింగ్ వంటి వాటికోసం కూడా వినియోగించుకోవచ్చు.

Revolt RV400 బైక్ ఇప్పుడు అదిరిపోయే కొత్త కలర్‌లో

Revolt RV400 బైక్ 72V, 3.24 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తినిస్తుంది. ఈ బైక్‌ను గరిష్టంగా గంటకు 85 కిమీ వేగంతో నడపవచ్చు. బైక్ లొకేటర్ మరియు జియో-ఫెన్సింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించే MyRevolt మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఇవి బైక్ రైడర్ కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఇవి మాత్రమే కాకుండా ఇందులో బ్యాటరీ స్టేటస్, మెయింటెనెన్స్, రైడ్ డేటా, రైడింగ్ హిస్టరీ, బైక్ సౌండ్ మరియు ఛార్జింగ్ స్టేషన్‌తో సహా అనేక సమాచారాన్ని ఈ అప్లికేషన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. Revolt RV400 బైక్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, గరిష్టంగా 180 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

Revolt RV400 బైక్ ఇప్పుడు అదిరిపోయే కొత్త కలర్‌లో

ఈ Revolt RV400 ఎలక్ట్రిక్ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి సిటీ, ఎకో మరియు స్పోర్ట్ మోడ్స్. MyRevolt అప్లికేషన్ సహాయంతో, బైక్ యొక్క ధ్వనిని కేవలం స్క్రీన్ నొక్కడం ద్వారా మార్చవచ్చు. Revolt RV400 బైక్ లో ఒక రిమూవబుల్ బ్యాటరీ కూడా అందుబాటులో ఉంటుంది. దీనిని బైక్ నుండి బయటకు తీయడం ద్వారా ఛార్జ్ చేయవచ్చు. బైక్ నుండి బ్యాటరీని తీసివేయడానికి 60 సెకన్ల కన్నా తక్కువ సమయం పడుతుంది.

Revolt RV400 బైక్ ఇప్పుడు అదిరిపోయే కొత్త కలర్‌లో

జూన్ 2021 లో, ఎలక్ట్రిక్ వాహనాల కోసం FAME II (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) సబ్సిడీని సవరించిన తరువాత RV 400 ధరలను తగ్గించారు. ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, రివాల్ట్ RV400 రూ .28,000 తగ్గించబడింది. సబ్సిడీ తర్వాత, ఈ బైక్ ఇప్పుడు రూ. 90,799 ధర, ఎక్స్-షోరూమ్, ఇది గతంలో రూ .1,19,000 ధర వద్ద అందుబాటులో ఉంది.

Revolt RV400 బైక్ ఇప్పుడు అదిరిపోయే కొత్త కలర్‌లో

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు ప్రయత్నాలుగా కొనుగోలుదారులకు భారీ రాయితీలతోపాటు, ఫేమ్ 2 కింద సబ్సిడీ కూడా అందిస్తున్నారు. అయితే మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేదు, దీనికోసం అనేక కంపెనీలు దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను అనుకూలంగా ఉండటానికి ఛార్జింగ్ పాయింట్ లను ఏర్పాటు చేస్తోంది. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెంచడానికి మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అనుకూలంగా ఉంటాయి.

Most Read Articles

English summary
Revolt rv 400 offered with new paint scheme booking to start soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X