రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందో చూడండి

భారత మార్కెట్లోని చాలామంది వాహనతయారీదారులు తమ బ్రాండ్ యొక్క ధరలను ఈ 2021 నూతన సంవత్సరంలో పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా ప్రముఖ రెట్రో-మోడరన్ బైక్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన లైనప్ ధరను పెంచినట్లు ప్రకటించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్రవాహన తయారీదారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

కంపెనీ తన బ్రాండ్ వాహనాలపై దాదాపు రూ. 200 నుండి రూ. 3 వేలకు వరకు పెంచింది. అయితే ఈ సమయంలో తమ బ్రాండ్ యొక్క రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధరను మాత్రమే పెంచలేదు. అయితే త్వరలో కంపెనీ తన రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను విడుదల చేయనుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ అప్డేట్ వెర్షన్ ప్రారంభించిన తరువాత దాని ధర పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంపెనీ యొక్క ఇతర మోడల్స్ విషయానికి వస్తే ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరను 1,33,446 రూపాయలకు పెంచింది, అయితే ఇంతకు ముందు ఇది 1,33,261 రూపాయలకు అమ్ముడైంది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఎక్స్ (కెఎస్), బుల్లెట్ 350 ఎక్స్ (ఇఎస్) లు కంపెనీని వరుసగా రూ. 1,27,279 మరియు రూ. 1,42,890 లకు విక్రయించబోతున్నాయి. అంతకుముందు వీటి ధరలు వరుసగా రూ. 1,27,094 మరియు రూ .1,42,705 గా ఉండేది [ఎక్స్‌షోరూమ్].

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

అంతే కాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌ను ఇంతకుముందు రూ. 1,69,617 నుంచి రూ. 1,86,319 కు విక్రయించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (డ్యూయల్-ఛానల్ ఎబిఎస్) విషయానికి వస్తే, ఇప్పుడు కంపెనీ దీనిని కంపెనీ రూ. 1,71,569 నుంచి రూ. 1,88,436 రూపాయలకు విక్రయించబోతోంది.

MOST READ:ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం కల్పించిన గల్ఫ్ ఆయిల్.. ఏంటో చూసారా!

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి
Model Old Price New Price
Bullet 350 ₹1,33,261 ₹1,33,446
Bullet 350 X (KS) ₹1,27,094 ₹1,27,279
Bullet 350 X (ES) ₹1,42,705 ₹1,42,890
Classic 350 (Dual-Channel ABS) ₹1,69,617 - ₹1,86,319 ₹1,71,569 - ₹1,88,436
Meteor 350 ₹1,75,817 - ₹1,19,510 ₹1,78,744 - ₹1,93,656
Interceptor 650 ₹2,66,775 - ₹2,87,787 ₹2,69,764 - ₹2,91,007
Continental GT 650 ₹2,82,513 - ₹3,03,544 ₹2,85,679 - ₹3,06,922
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

ఇటీవల విడుదలైన రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క మీటియార్ 350 విషయానికి వస్తే, ఈ బైక్‌ను ఇప్పటివరకు రూ. 1,75,817 నుండి రూ. 1,90,510 రూపాయల మధ్య విక్రయించింది. అయితే ధరల పెరుగుదల తర్వాత, ఇప్పుడు కంపెనీ దీనిని రూ. 1,78,744 నుండి రూ. 1,93,656 రూపాయల మధ్య విక్రయించబోతోంది.

MOST READ:ఒక ఛార్జ్‌తో 240 కి.మీ అందించగల సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ ని కంపెనీ ఇప్పుడు రూ. 2,69,764 నుండి రూ. 2,91,007 కు పెంచింది. ఇప్పటి వరకు ఈ బైక్‌ను కంపెనీ రూ. 2,66,775 మరియు రూ. 2,87,787 రూపాయలకు అమ్మకాలను జరిపినట్లు తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే సమయంలో, 650 సిసి కాంటినెంటల్ జిటి 650 ధరను రూ. 2,85,679 నుంచి రూ. 3,06,922 కు పెంచింది. ఇది ధరల పెరుగుదలకు ముందు రూ. 2,82,513 నుంచి రూ. 3,03,544 కు అమ్ముడైంది. ఏది ఏమైనా ఈ ధర పెరుగుదల తరువాత కంపెనీ యొక్క అమ్మకాలు ఏ విధంగా ఉంటాయో గమనించాలి. అయితే ఈ ధరలన్నీ 2021 జనవరి 11 నుండి అమల్లో ఉంటాయి.

MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు

Most Read Articles

English summary
Royal Enfield Bikes Prices Hiked New Price List Details. Read in Telugu.
Story first published: Tuesday, January 12, 2021, 11:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X