Royal Enfield నుండి 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్లు

భారతదేశపు ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield), ఆటోమోటివ్ రంగంలో తన 120 సంవత్సరాల ప్రయాణాన్ని పురస్కరించుకుని గత వారం మార్కెట్లో రెండు లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్ లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' అనే మరో రెండు స్పెషల్ ఎడిషన్ హెల్మెట్లను కంపెనీ విడుదల చేసింది.

Royal Enfield నుండి 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్లు

ఈ స్పెషల్ ఎడిషన్ హెల్మెట్ శ్రేణిలో మొత్తం 12 రకాల హెల్మెట్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి కూడా కంపెనీ వారసత్వానికి చెందిన 12 దశాబ్దాల పోస్టర్ లేదా ప్రకటన ద్వారా స్ఫూర్తి పొందిన ప్రత్యేకమైన డిజైన్‌ ను కలిగి ఉంటుంది. ఇవన్నీ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్లు కాబట్టి, కంపెనీ 12 డిజైన్లలో ఒక్కొక్కటి కేవలం 120 యూనిట్లను మాత్రమే తయారు చేస్తుంది.

Royal Enfield నుండి 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్లు

తాజాగా ఆవిష్కరించిన లిమిటెడ్ ఎడిషన్ 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్‌లు ఒక్కొక్కటి కేవలం 120 యూనిట్లు మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఈ ఫుల్ ఫేస్ 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్ అక్టోబర్ 30, 2021 వ తేదీన రాయల్ ఎన్‌ఫీల్డ్ వెబ్‌సైట్‌ లో విక్రయించబడుతుంది. ఈ హెల్మెట్ ధర రూ. 8,450 గా ఉంటుంది.

Royal Enfield నుండి 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్లు

కాగా, ఓపెన్ ఫేస్ 'బర్త్ ఆఫ్ ద బుల్లెట్' హెల్మెట్ అక్టోబర్ 31, 2021 తేదీన రాయల్ ఎన్‌ఫీల్డ్ వెబ్‌సైట్‌ లో విక్రయించబడుతుంది మరియు దీని ధర రూ. 6950 గా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ 120 సంవత్సరాల ప్రయాణం యొక్క కథలను తిరిగి చెప్పడానికి ప్రతి హెల్మెట్ కూడా ప్రత్యేకంగా చేతితో పెయింట్ చేయబడి ఉంటుంది మరియు దాని విశిష్టతను తెలిపే ప్రత్యేక సంఖ్యతో వస్తుంది.

ఇందులో లేటెస్ట్ మోడల్ అయిన 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్ 1920 కాలం నుండి ప్రేరణ పొంది డిజైన్ చేయబడింది మరియు ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న దశాబ్దంగా పరిగణించబడుతుంది. ఆ తర్వాత కంపెనీ దాని మినిమలిస్ట్ టూ-మోడల్ ప్రోగ్రామ్‌ను విస్తరించింది.

Royal Enfield నుండి 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్లు

రాయల్ ఎన్‌ఫీల్డ్ శ్రేణిలో 1920 కాలంలో 350 సిసి మరియు 500 సిసి సైడ్-వాల్వ్ మరియు ఓవర్‌హెడ్-వాల్వ్ సింగిల్-సిలిండర్ బైక్‌లను కలిగి ఉండేది. వీటిలో మెకానికల్ లూబ్రికేషన్, ఎలక్ట్రిక్ లైటింగ్ మరియు శాడిల్ ట్యాంక్‌లు వంటి పురోగతులు ఉన్నాయి. 1920వ దశకంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్ యొక్క ప్రధాన మోటార్‌సైకిల్ V-ట్విన్ మోడల్ 180, ఇందులోని 976 సిసి ఇంజన్ కేవలం 8 హార్స్‌పవర్‌ శక్తిని మాత్రమే ఉత్పత్తి చేసేది.

Royal Enfield నుండి 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్లు

ది పిక్నిక్ స్పెషల్ హెల్మెట్ డిజైన్ కూడా అదే మోటార్‌సైకిల్‌ నుండి ప్రేరణ పొంది రూపొందించబడింది. ఈ హెల్మెట్ పై రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్ల బృందం వేసవిలో మధ్యాహ్న సమయంలో గ్రామీణ ప్రాంతాలలో కలిసి రైడింగ్ చేస్తున్న ఒక అందమైన దృశ్యాన్ని చూపే పెయిటింగ్ ఉంటుంది. ఈ హెల్మెట్ ISI, DOT మరియు ECE ద్వారా అత్యధిక భద్రతా ప్రమాణాలకు లోబడి ఉంటుంది.

Royal Enfield నుండి 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్లు

ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫుల్-ఫేస్ హెల్మెట్లలో అధిక భద్రత కోసం బ్రీత్ డిఫ్లెక్టర్, నెక్ కర్టెన్ మరియు D రింగ్ కూడా ఉన్నాయి. ఇది మెరుగైన వెంటిలేషన్ మరియు రియర్ ఎగ్జాస్ట్ హాట్ ఎయిర్ రిమూవర్‌ని కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కోసం సన్ వైజర్ మరియు యాంటీ ఫాగ్ ఫిల్మ్‌తో కూడిన సాధారణ విజర్‌లు కూడా ఉంటాయి. హెల్మెట్ యొక్క అంతర్గత భాగాలు పాలిజీన్ యాంటీ మైక్రోబియల్ ట్రీట్‌మెంట్‌ను కలిగి ఉంటాయి మరియు వీటిని శుభ్రం చేయడానికి చాలా తక్కువ నీరు సరిపోతుంది.

Royal Enfield నుండి 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్లు

ఇకపోతే, 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' రాయల్ ఎన్‌ఫీల్డ్ హెల్మెట్ విషయానికి వస్తే, దీనిని తమ ఐకానిక్ బుల్లెట్‌ను పరిచయం చేసిన 1930 కాలం నుండి ప్రేరణ పొంది రూపొందించబడింది. 1932 లో విడుదల అయిన ఈ బుల్లెట్ మోటార్‌సైకిల్, అప్పటి నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ లో చాలా ప్రధానమైన మోడల్ గా మారింది.

Royal Enfield నుండి 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్లు

1930 వ దశకంలో, బుల్లెట్ 250, 350 మరియు 500 సిసి సామర్థ్యాలతో కూడిన 'స్లోపర్' ఇంజన్లతో అందుబాటులో ఉండేది. ఈ శ్రేణి లోని 500 సిసి బుల్లెట్ ఫోర్-వాల్వ్ సిలిండర్ హెడ్‌ని కలిగి ఉండేది మరియు గరిష్టంగా గంటకు 100 మైళ్లు (గంటకు 160.9 కిమీ) వేగంతో పరుగులు తీసేది.

Royal Enfield నుండి 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్లు

హ్యాండ్-చేంజ్ నుండి ఫుట్-చేంజ్ గేర్‌బాక్స్‌లకు మారడం మరియు సెంటర్ స్టాండ్‌ల స్వీకరణలో కూడా బుల్లెట్‌ మోటార్‌సైకిళ్లు అప్పట్లో ముందంజలో ఉండేవి. 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలో ఆ దశాబ్దానికి నివాళులు అర్పించేలా డిజైన్ చేయబడింది. ఈ హెల్మెట్ ప్రకాశవంతమైన ఎరుపు మరియు తెలుపు చారలతో పాటు 1930ల నాటి బుల్లెట్ చిత్రాన్ని కూడా కలిగి ఉంటుంది.

Royal Enfield నుండి 'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' మరియు 'ది పిక్నిక్ స్పెషల్' హెల్మెట్లు

'బర్త్ ఆఫ్ ది బుల్లెట్' కూడా అత్యున్నత భద్రతా ప్రమాణాల కోసం ISI, DOT, ECE ధృవీకరణను పొందింది. ఈ హెల్మెట్‌లో ఫేస్-కవరింగ్ బబుల్ విజర్ (UV కోటింగ్‌తో), పాలిజీన్ ట్రీట్ చేసిన ఫ్యాబ్రిక్ ఇంటర్నల్‌లతో కూడిన ప్రీమియం లెదర్ మరియు షెల్ కోసం చేతితో కుట్టిన లెదర్ ట్రిమ్ ఉన్నాయి. దీని బయటి భాగం తేలికపాటి ఫైబర్‌గ్లాస్ మెటీరియల్‌తో తయారు చేయబడింది.

Most Read Articles

English summary
Royal enfield birth of the bullet and the picnic special helmets unveiled details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X