రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన మోటార్‌సైకిళ్ళ ధరలు!
చెన్నైకి చెందిన ప్రముఖ భారతీయ టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్, తన ప్రోడక్ట్ లైనప్‌లో అన్ని మోటార్‌సైకిళ్ల ధరలను మరోసారి పెంచింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి వాటి ధరలు రూ.4,470 నుండి రూ.8,405 మధ్యలో పెరిగినట్లు కంపెనీ పేర్కొంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలోని బుల్లెట్ 350, క్లాసిక్ 350, హిమాలయన్, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 మరియు మీటియోర్ 350 మోడళ్ల ధరలు పెరిగాయి. పెరిగిన ముడి సరుకులు ధరలు, అధిక రవాణా ఖర్చుల కారణంగా ధరలు పెంచకతప్పడం లేదని కంపెనీ వివరించింది. మోడల్ మరియు వేరియంట్ల వారిగా పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి:

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 యొక్క కొత్త ధరలు:
| Bullet 350 | Latest Price | Old Price | Increase |
| Bullet 350 KS | Bullet Silver & Onyx Black: ₹1,58,485
Black: ₹1,65,754 | Bullet Silver & Onyx Black: ₹1,53,718
Black: ₹1,60,775 | ₹4,767 - ₹4,979 |
| Bullet 350 ES | Jet Black, Regal Red &
Royal Blue: ₹1,82,190 | Jet Black, Regal Red &
Royal Blue: ₹1,76,731 | ₹5,459 |

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 యొక్క కొత్త ధరలు:
| Royal Enfield Classic 350
| Latest Price | Previous Price | Premium |
| Single-channel ABS, Chestnut Red, Ash, Mercury Silver, Redditch Red, Pure Black | ₹1,79,782 | ₹1,72,466 | ₹7,316 |
| Dual-channel ABS, Classic Black, Pure Black & Mercury Silver | ₹1,88,531 | Pure Black & Mercury Silver: ₹1,80,877, Classic Black: ₹1,80,879 | Pure Black & Mercury Silver: ₹7,654, Classic Black: ₹7,652 |
| Dual-channel ABS, Gunmetal Grey | ₹2,03,480 (Alloy)
₹1,90,555 (Spoke) | ₹1,95,252 (Alloy)
₹1,82,825 (Spoke) | ₹8,228 (Alloy)
₹7,730 (Spoke) |
| Dual-channel ABS, Signals edition (Airborne Blue & Stormrider Sand) | ₹1,99,777 | Airborne Blue: ₹1,91,693,
Stormrider Sand: ₹1,91,692 | Airborne Blue: ₹8,084
Stormrider Sand: ₹8,085 |
| Dual-channel ABS, Stealth Black & Chrome Black | ₹2,06,962 | ₹1,98,600 | ₹8,362 |
| Dual-Channel ABS, Orange Ember & Metallo Silver | ₹2,03,480 | ₹1,95,252 | ₹8,228 |

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కొత్త ధరలు:
| Himalayan | New Price | Old Price | Difference |
| Granite Black, Pine Green | ₹2,13,273 | ₹2,08,657 | ₹4,616 |
| Mirage Silver, Gravel Grey | ₹2,05,784 | ₹2,01,314 | ₹4,470 |
| Lake Blue, Rock Red | ₹2,09,529 | ₹2,04,985 | ₹4,544 |

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 యొక్క కొత్త ధరలు:
| Interceptor 650 | New Price | Old Price | Difference |
| Mark 2 Chrome | ₹3,03,620 | ₹2,97,134 | ₹6,486 |
| Baker Express, Sunset Strip, Downtown Drag | ₹2,89,805 | ₹2,83,593 | ₹6,212 |
| Orange Crush, Ventura Blue, Canyon Red | ₹2,81,518 | ₹2,75,467 | ₹6,051 |

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 యొక్క కొత్త ధరలు:
| Continental GT650 | New Price | Old Price | Difference |
| Mr. Clean | ₹3,20,177 | ₹3,13,368 | ₹6,809 |
| British Racing Green, Rocker Red | ₹2,98,079 | ₹2,91,700 | ₹6,379 |
| Dux Deluxe, Ventura Storm | ₹3,06,368 | ₹2,99,830 | ₹6,538 |

రాయల్ ఎన్ఫీల్డ్ ఉల్కాపాతం 350 యొక్క కొత్త ధరలు:
| Meteor 350 | New Price | Old Price | Difference |
| Fireball (Red, Yellow) | ₹1,92,109 | ₹1,84,319 | ₹7,790 |
| Stellar (Blue, Red, Black) | ₹1,98,099 | ₹1,90,079 | ₹8,020 |
| Supernova (Brown, Blue) | ₹2,08,084 | ₹1,99,679 | ₹8,405 |

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలను కంపెనీ భారీగా పెంచింది. ఈ బైక్ ధరలు రూ.2 లక్షల మార్కును దాటడం ఇదే మొదటిసారి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ధరను కూడా కంపెనీ అత్యధికంగా రూ.8,405 మేర పెంచింది.

ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కొత్త తరం క్లాసిక్ 350 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ పాత మోడల్ ధరలను భారీగా పెంచింది. ఎందుకంటే, భవిష్యత్తులో ఈ కొత్త మోడల్‌ను విడుదల చేసిన తర్వాత ప్రస్తుత తరం మోడల్‌కి మరియు కొత్త మోడల్‌కి మధ్య ధరల వ్యత్యాసం పెద్దగా ఉండకూడదని కంపెనీ భావిస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న లేటెస్ట్ మోడల్ మీటియోర్ 350ను తయారు చేసిన జే-ప్లాట్‌ఫామ్ ఆధారంగానే కొత్త తరం క్లాసిక్ 350ని కూడా తయారు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్ సహా అనేక భాగాల్లో పోలికలు ఉండే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








