Just In
- 47 min ago
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- 2 hrs ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 3 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 4 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
Don't Miss
- News
వైసీపీ నేత పీవీపీ షాకింగ్ ట్వీట్..లంగా డ్యాన్సులేసే సార్లకు 50 కోట్లు,లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
- Finance
Petrol, Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్: సిఇ సర్టిఫైడ్ రైడింగ్ గేర్ విడుదల!
రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కస్టమర్ల కోసం రైడింగ్ మరియు ప్రొటెక్టివ్ గేర్‌ను ఆఫర్ చేసేందుకు ఈ కంపెనీ నాక్స్ అనే సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

నాక్స్ బ్రాండ్ దేశంలో ప్రముఖ రైడింగ్ గేర్ తయారీదారుగా ఉంది మరియు ఈ బ్రాండ్ విస్తృత శ్రేణి దుస్తులను కూడా అందిస్తుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఇరు కంపెనీలు రైడర్ అవసరం మరియు రైడింగ్ కండిషన్ ప్రకారం దుస్తుల శ్రేణిని అందించనున్నాయి.

అన్ని రకాల వాతావరణాలలో సురక్షితంగా ఉండేలా ఈ దుస్తులను డిజైన్ చేశారు. ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన సర్టిఫైడ్ రైడింగ్ గేర్ తమ కస్టమర్లకు అందించనున్నట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఈ రైడింగ్ గేర్లు రైడర్ల రక్షణ, సౌకర్యం మరియు స్టైల్‌ను అందించేలా రూపొందించామని నాక్స్ తెలిపింది.
MOST READ:క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

నాక్స్ అనుబంధంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశపెట్టిన ఈ రైడింగ్ గేర్ జాబితాలో హ్యాండ్ గ్లవ్స్, క్నీ ప్యాడ్స్, రైడింగ్ జాకెట్స్, రైడింగ్ టౌజర్స్, బెల్టులు, బూట్లు, ఫేస్ కవర్లు మొదలైనవి ఉన్నాయి. ఆసక్తి గల కస్టమర్లు ఈ అఫీషియల్ యాక్ససరీలను అన్ని అధీకృత డీలర్‌షిప్‌లు, ఆన్‌లైన్ స్టోర్, అమేజాన్ మరియు ఎంపిక చేసిన సెంట్రల్ మరియు షాపర్స్ స్టాప్ అవుట్‌లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ బ్యాడ్జింగ్‌తో రైడింగ్ గేర్లు, రైడింగ్ జాకెట్లు, హ్యాండ్ గ్లవ్స్ మరియు రైడింగ్ ప్యాంట్‌లలో కొత్త శ్రేణిని తీసుకురావడానికి రెండు సంవత్సరాల క్రితమే నాక్స్ సంస్థతో తమ సహకారాన్ని ప్రకటించింది. ఇప్పుడు ఆ భాగస్వామ్యం పొడిగింపుగా, ఈ రెండు బ్రాండ్లు నాక్స్ మైక్రోలాక్ రక్షణతో నిర్మించిన సిఇ సర్టిఫైడ్ లెవల్ 2 ఎక్స్‌టర్నల్ క్నీ గార్డును కూడా ప్రారంభించాయి.
MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ మోకాలి (క్నీ) గార్డును కాంకరర్ అని పిలుస్తారు. మార్కెట్లో ఈ కాంకరర్ సిఇ లెవల్ 2 సర్టిఫైడ్ మోకాలి గార్డు ధర రూ.3,950 గా ఉంది. వీటితో పాటుగా కంపెనీ వివిధ రకాల సిఇ సర్టిఫైడ్ గ్లవ్స్‌ను కూడా విక్రయిస్తోంది. ఈ హ్యాండ్ గ్లవ్స్ ధరలు రూ.2,250 నుండి రూ.4,500 మధ్యలో ఉన్నాయి.

నాక్స్ ఆర్మోర్‌తో (కవచాలతో) కూడిన మూడు రకాల రైడింగ్ జాకెట్లను కంపెనీ విక్రయిస్తోంది. అవి: స్ట్రీట్‌విండ్ వి2 రూ.4950, విండ్‌ఫేరర్ రూ.6950 మరియు ఎక్స్‌ప్లోరర్ వి3 రూ.8950 - (సిఇ సర్టిఫైడ్).
MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]

ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా తమ సరికొత్త 2021 ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్‌లు ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్స్‌తో సల్వ డిజైన్ అప్‌గ్రేడ్‌లను కూడా కలిగి ఉన్నాయి. మార్కెట్లో వీటి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి.
* 2021 ఇంటర్‌సెప్టర్ 650 - రూ.2,75,467
* 2021 కాంటినెంటల్ జిటి 650 - రూ.2,91,701
(రెండు ధరలు ఎక్స్-షోరూమ్)

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ 2021 మోడల్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోడళ్లను కస్టమర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఇందుకోసం కంపెనీ ప్రత్యేకంగా అందిస్తున్న మేక్ ఇట్ యువర్స్ ప్రోగ్రామ్‌లో ఈ రెండు మోడళ్లను చేర్చింది.
MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

బ్రాండ్ యొక్క మేక్-ఇట్-యువర్స్ కస్టమైజేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా కస్టమర్ తమ మోటార్‌సైకిళ్లను తమకు నచ్చినగా మార్చుకుని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ కస్టమైజేషన్ ఆప్షన్లలో వివిధ రకాల సీటింగ్ ఆకారాలు, టూరింగ్ మిర్రర్స్, ఫ్లైస్క్రీన్స్ మరియు మడ్ గార్డ్స్ మొదలైనవి ఉన్నాయి. - ఈ కొత్త మోడళ్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.