Just In
- 1 hr ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 4 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 5 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 6 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- News
Covid: భారత్‌కు మరో దెబ్బ -విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం -భారతీయు ప్రయాణికులపైనా ఆంక్షలు
- Sports
RCB vs RR: శాంసన్ ఆటను ఎక్కువగా ఆస్వాదిస్తా.. అతడి షాట్లను బాగా ఇష్టపడతా: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Finance
భారీ నష్టాల నుండి లాభాల్లోకి మార్కెట్, సెన్సెక్స్ 375 పాయింట్లు జంప్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 & కాంటినెంటల్ జిటి 650 లాంచ్ : వివరాలు
చెన్నై ఆధారిత ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ "రాయల్ ఎన్‌ఫీల్డ్" భారత మార్కెట్లో విక్రయించే ప్రధాన మోటార్‌సైకిళ్లను ఇప్పటికే అప్‌డేట్ చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోటార్ సైకిళ్ళు అప్డేట్స్ పొందాయి. అప్డేట్స్ పొందిన ఈ కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ఇప్పుడు కొత్త నవీనీకరణలతో వచ్చిన ఈ రెండు మోటార్‌సైకిళ్లలో కొన్ని కొత్త పెయింట్ స్కీమ్స్ ఉన్నాయి. దీని ఆధారంగా ధర కూడా నిర్ణయించబడుతుంది. 2021 ఇంటర్‌సెప్టర్ 650 యొక్క ప్రారంభ ధర రూ. 2.75 లక్షలు. ఇది కస్టమ్ స్కీమ్ తో కూడా లభిస్తుంది, దీని ధర రూ. 2.83 లక్షలు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 యొక్క టాప్-స్పెక్ క్రోమ్ పెయింట్ స్కీమ్ ధర రూ. 2.97 లక్షలు. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ఆధారంగా నిర్ణయించబడ్డాయి.
MOST READ:విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

2021 కాంటినెంటల్ జిటి 650 విషయానికి వస్తే, ఇది కూడా కొన్ని కొత్త కలర్ స్కీమ్స్ అందుకుంటుంది. కొత్త మోటారుసైకిల్ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 2.91 లక్షలు. కాంటినెంటల్ జిటి 650 కస్టమ్ పెయింట్ స్కీమ్‌లో కూడా లభిస్తుంది, అయితే దీని ధర రూ. 2.99 లక్షలు. ఇందులో టాప్-స్పెక్ మిస్టర్ క్లీన్ కలర్ స్కీమ్ యొక్క ధర అక్షరాలా రూ. 3.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఈ కొత్త బైక్స్ కొత్త కలర్స్ స్కీమ్స్ పొందటమే కాకుండా, బ్రాండ్ యొక్క మేక్-ఇట్-యువర్స్ కస్టమైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఉంటాయి. దీని సహాయంతో కస్టమర్ తనకు నచ్చిన మార్పులను చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో వివిధ సీటింగ్ ఆకారాలు, టూరింగ్ మిర్రర్స్, ఫ్లైస్క్రీన్స్ మరియు సంప్ గార్డ్లు వంటివి ఉన్నాయి.
MOST READ:మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 ఒకే 649 సిసి ఎయిర్ మరియు ఆయిల్-కూల్డ్,ప్యారలల్ -ట్విన్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. ఇది 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి పవర్ మరియు 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

రెండు మోటార్‌సైకిళ్ల యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 41 మిమీ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్-గ్యాస్ చార్జ్డ్ షాక్‌లు 5 టైప్స్ అడ్జస్టబుల్ ప్రీ-లోడ్ డంపింగ్ వంటివి కలిగి ఉంటుంది. మోటారుసైకిల్‌పై బ్రేకింగ్ సిస్టంలో, బైక్ యొక్క ముందు భాగంలో 320 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 240 మిమీ డిస్క్ ద్వారా డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌తో స్టాండర్డ్ గా అందించబడుతుంది. ఈ రెండు మోటార్ సైకిళ్ళు 18 ఇంచెస్ స్పోక్డ్ వీల్స్ కలిగి ఉంటాయి.
MOST READ:హైదరాబాద్‌లో సిట్రోయెన్ కార్ షోరూమ్ ఎక్కడుందో తెలుసా? అడ్రస్, వివరాలు

ఈ 2021 కొత్త మోటార్‌సైకిళ్ల యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ఒకే రౌండ్ షేప్ హెడ్‌ల్యాంప్‌లు, టైల్ లాంప్స్, ట్విన్-ఎగ్జాస్ట్ సెటప్, సింగిల్-పీస్ ఫ్లాట్ సీట్ వంటివి ఉన్నాయి.

2021 ఇంటర్సెప్టర్ 650 మరింత రిలాక్స్డ్ మరియు నిటారైన రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది, అయినప్పటికీ, కాంటినెంటల్ జిటి 650 దాని లాంగ్ ట్యాంక్ డిజైన్ మరియు క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్‌లతో మరింత దూకుడుగా ఉంటుంది.
MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

ఇంటర్సెప్టర్ 650 బ్లాక్-అవుట్ రిమ్ మరియు మడ్‌గార్డ్‌లను కూడా అందిస్తుంది. బైక్ యొక్క పాత రెట్రో రూపాన్ని నిర్వహించడానికి కొత్త మోడళ్లలో టిప్పర్ నావిగేషన్ మరియు అల్లాయ్ వీల్స్‌ను కంపెనీ అందించలేదు. ఈ బైక్స్ యొక్క యాక్ససరీస్ కూడా త్వరలో ప్రారంభించబడతాయి.