ఐదు నెలలకు పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 వెయిటింగ్ పీరియడ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుండి గతేడాది నవంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదలైన సరికొత్త క్రూయిజర్ మోటార్‌సైకిల్ 'మీటియోర్ 350' వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది. ఈ మోడల్‌కి అనూహ్య స్పందనతో ప్రస్తుతం దీని వెయిటింగ్ పీరియడ్ ఐదు నెలల వరకూ ఉంటున్నట్లు సమాచారం.

ఐదు నెలలకు పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 వెయిటింగ్ పీరియడ్!

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఢిల్లీ ఎన్‌సిఆర్, పూణే మరియు ముంబైలోని కొన్ని డీలర్‌షిప్‌లలో ఈ మోటార్‌సైకిల్ స్టాక్స్ పూర్తిగా అయిపోయాయి. కొత్తగా బుకింగ్‌లు చేసుకున్న కస్టమర్లను 5 నెలలు వేచి ఉండమని చెబుతున్నట్లు సమాచారం. థండర్‌బర్డ్ సిరీస్ మోడళ్లను రీప్లేస్ చేసేందుకు వచ్చిన మీటియోర్ 350 మార్కెట్లో ఆశించిన దాని కన్నా ఎక్కువ విజయాన్నే సాధించింది.

ఐదు నెలలకు పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 వెయిటింగ్ పీరియడ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోడల్‌ను ఫైర్‌బాల్, స్టెల్లార్, సూపర్‌నోవా అనే మూడు వేరియంట్లలో విడుదల చేశారు. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ మోడల్‌ను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. ఇది మొత్తం ఏడు కలర్ అప్షన్లలో అందుబాటులో ఉంది.

MOST READ:మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

ఐదు నెలలకు పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 వెయిటింగ్ పీరియడ్!

టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ పొందిన మొట్టమొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ ఈ మీటియోర్ 350. ఈ క్రూయిజర్ స్టైల్ మోటార్‌సైకిల్‌లో గుండ్రటి హాలోజన్ హెడ్‌ల్యాంప్, టియర్ డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్, రియర్ బ్యాక్ రెస్ట్, స్ప్లిట్ సీట్, గుండ్రటి ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు మరియు ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, హై హ్యాండిల్‌బార్ మరియు గుండ్రటి సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఐదు నెలలకు పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 వెయిటింగ్ పీరియడ్!

ఇంజన్ పరంగా చూస్తే, ఇందులోని 350 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 20.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది సరికొత్త జె-సిరీస్ ఓహెచ్‌సి ఇంజన్.

MOST READ:తనకు తానుగా కదిలిన బైక్.. బహుశా ఇది దెయ్యం పనేనా.. అయితే వీడియో చూడండి

ఐదు నెలలకు పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 వెయిటింగ్ పీరియడ్!

ఇంకా ఇందులో మెషీన్డ్ అల్లాయ్ వీల్స్, బైక్‌పై క్రోమ్ గార్నిష్ మరియు బ్లాకవుట్ ఎలిమెంట్స్, డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్, విండ్‌స్క్రీన్, యుఎస్‌బి పోర్ట్, డ్యూయల్ ఛానెల్ ఏబిఎస్, ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు, ట్విన్ సైడ్ రియర్ షాక్ అబ్జార్బర్స్, ఇరువైపులా సింగిల్ డిస్క్ బ్రేక్స్ మరియు ట్యూబ్‌లెస్ టైర్స్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

ఐదు నెలలకు పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 వెయిటింగ్ పీరియడ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోటార్‌సైకిల్‌లో 'ట్రిప్పర్ నావిగేషన్' అని పిలువబడే టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ సిస్టమ్‌ను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో మోటార్‌సైకిల్‌కు రిమోట్‌గా కనెక్ట్ అయిన వివిధ రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

MOST READ:కన్నుల పండుగ చేయనున్న ఏరో ఇండియా 2021 ఎగ్జిబిషన్‌ : వివరాలు

ఐదు నెలలకు పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 వెయిటింగ్ పీరియడ్!

రానున్న నెలల్లో ఇదే తరహా ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్‌ను కంపెనీ విక్రయిస్తున్న హిమాలయన్, క్లాసిక్ 350 మరియు 650సిసి ట్విన్ బైక్స్ (కాంటినెంటల్ జిటి, ఇంటర్‌సెప్టర్)లో కూడా చేర్చనున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ మీటియోర్ 350 మోడల్‌ను థాయిలాండ్ మరియు యూరప్ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తోంది.

ఐదు నెలలకు పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 వెయిటింగ్ పీరియడ్!

ఈ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, గడచిన జనవరి 2021 నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం అమ్మకాలు 5 శాతం పెరిగినట్లు కంపెనీ ప్రకటించింది. గత నెలలో కంపెనీ మొత్తం 68,887 యూనిట్ల బైక్‌లను విక్రయించగా, జనవరి 2020లో వీటి సంఖ్య 63,520 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ జనవరి సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. చూసారా..!

Most Read Articles

English summary
Royal Enfield Meteor 350 Motorcycle Waiting Period Increased To Five Months. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X