ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత "రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350"

కుర్రకారుని ఉర్రూతలూగిస్తూ అమ్మకాలపరుగులు పెడుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క మీటియార్ 350 క్రూయిజర్ బైక్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే భారతీయ ఆటో పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత

2021 ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల జాబితా విడుదలైంది. విడుదలైన ఈ ఫలితాల ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 బైక్ "2021 ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు"ను సొంతం చేసుకుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్, ఇంజిన్ మరియు పనితీరు మరియు ధరల కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 మొదటి స్థానంలో నిలువగా, తరువాత స్థానాల్లో కెటిఎమ్ 390 అడ్వెంచర్ మరియు హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ నిలిచాయి.

ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత

2007 నుండి, ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును భారతీయ ఆటో పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా పిలుస్తారు. ఇందులో గెలుపొందే వాటిని అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇప్పడు ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఖాతాలో చేరింది.

MOST READ:2021 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్న "హ్యుందాయ్ ఐ20"

ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత

2021 ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 బైక్‌కు దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇది భారతమార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను సాగించింది.

ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ దాని మునుపటి థండర్‌బర్డ్ ఎక్స్ మోడల్‌లో ఆధారంగా నిర్మించినప్పటికీ, దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 బైక్ ఫైర్‌బాల్, స్టెల్లార్ మరియు సూపర్నోవా అనే మూడు వేరియంట్లలో విక్రయించబడుతుంది.

MOST READ:మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్

ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 ధరల విషయానికి వస్తే ఇందులో ఫైర్‌బాల్ వేరియంట్ ధర రూ. 2.22 లక్షలు, స్టెల్లార్ వేరియంట్ ధర రూ. 2.28 లక్షలు మరియు సూపర్నోవా హై ఎండ్ మోడల్ ధర రూ. 2.40 లక్షలు.

ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 బైక్ థండర్బర్డ్ కంటే సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో 41-మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు 6 లెవెల్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి.

MOST READ:పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !

ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత

మీటియోర్ 350 మోటారుసైకిల్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, ఇందులో కొత్త డబుల్-క్రాడిల్ ఛాస్సిస్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన గుండ్రటి హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, పొడవాటి సైలెన్సర్, ఇగ్నిషన్ మరియు హెడ్‌ల్యాంప్ ఆపరేషన్ల కోసం డయల్స్‌తో కూడిన సరికొత్త స్విచ్ గేర్ యూనిట్ మొదలైనవి ఉన్నాయి.

ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ మోటార్‌సైకిల్‌లో తొలిసారిగా సరికొత్త 349సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

Most Read Articles

English summary
Royal Enfield Meteor 350 Has Won The Prestigious Indian Motorcycle Of The Year 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X