YouTube

Royal Enfield నుండి మరో కొత్త 650 సిసి బైక్ ఆవిష్కరణ; డీటేల్స్

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తమ సరికొత్త 650 సిసి మోటార్‌సైకిల్ 'ఎస్‌జి 650' (SG 650) ని ఆవిష్కరించింది. ఇటలీలోని మిలాన్ లో జరుగుతున్న 78వ ఎడిషన్ ఇంటర్నేషనల్ మోటార్‌సైకిల్ అండ్ యాక్ససరీస్ ఎగ్జిబిషన్ (EICMA 2021) లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎస్‌జి650 (Royal Enfield SG650) కాన్సెప్ట్ ను కంపెనీ ప్రదర్శించింది. ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Royal Enfield నుండి మరో కొత్త 650 సిసి బైక్ ఆవిష్కరణ; డీటేల్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం 650 సిసి విభాగంలో విక్రయిస్తున్న కాంటినెంటల్ జిటి650, ఇంటర్‌సెప్టర్ 650 మోడళ్ల తర్వాత ఈ బ్రాండ్ నుండి వస్తున్న మూడవ మిడిల్-వెయిట్ మోటార్‌సైకిల్ ఈ కొత్త ఎస్‌జి650. చైన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ దేశీయ బ్రాండ్ గతంలో తయారు చేసిన 650 ట్విన్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే అదే ప్లాట్‌ఫామ్‌పై ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎస్‌జి650 ని కూడా డిజైన్ చేశారు.

Royal Enfield నుండి మరో కొత్త 650 సిసి బైక్ ఆవిష్కరణ; డీటేల్స్

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎస్‌జి650 కాన్సెప్ట్ బ్రాండ్ యొక్క రాబోయే 650 సిసి బాబర్ స్టైల్ మోటార్‌సైకిల్‌ మాదిరిగా ఉంటుంది. ఇది రాబోయే నెలల్లో కంపెనీ దీనిని భారతదేశంలో కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. కొత్త ఎస్‌జి650 కాన్సెప్ట్ కంపెనీ యొక్క క్లాసిక్ డిజైన్‌ను కొన్ని ఫ్యూచరిస్టిక్ టచ్‌లతో మిళితం చేస్తుంది. ఈ కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ ను డిజిటల్ గ్రాఫిక్స్ స్కీమ్‌, బ్రష్డ్ అల్యూమినియం మెటీరియల్స్ తో ఫినిష్ చేశారు.

Royal Enfield నుండి మరో కొత్త 650 సిసి బైక్ ఆవిష్కరణ; డీటేల్స్

ఈ మోటార్‌సైకిల్‌లో ఇంటిగ్రేటెడ్ పొజిషన్ లైట్‌లతో కూడిన రౌండ్ హెడ్‌ల్యాంప్‌ లు, బ్లూ కలర్‌ లో ఉండే 'RE' లోగోతో కూడిన చంకీ ఫ్యూయల్ ట్యాంక్, తగ్గించిన ఫెండర్ డిజైన్ మరియు పెద్ద మెట్‌జెలర్ టైర్లు కూడా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎస్‌జి650 కాన్సెప్ట్‌ లో USD (అప్ సైడ్ డౌన్) ఫోర్కులు మరియు ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. అలాగే, ఇందులో ప్రొడక్షన్-స్పెక్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు, ఫుట్‌పెగ్‌లు మరియు సరికొత్త స్విచ్‌గేర్‌ను కూడా కలిగి ఉంటుంది.

Royal Enfield నుండి మరో కొత్త 650 సిసి బైక్ ఆవిష్కరణ; డీటేల్స్

ఇంకా ఇందులో బ్లాక్ లెదర్‌తో చుట్టబడిన సింగిల్ పీస్ సీట్‌ను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతానికి కంపెనీ ఈ సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎస్‌జి650 (Royal Enfield SG650) మోటార్‌సైకిల్ కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించలేదు. కానీ, ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోడళ్లలో ఉపయోగించిన అదే 650 సిసి పారలల్ ట్విన్ ఇంజన్ ను ఈ కొత్త ఎస్‌జి650 లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 47 బిహెచ్‌పి పవర్ ను మరియు 52 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Royal Enfield నుండి మరో కొత్త 650 సిసి బైక్ ఆవిష్కరణ; డీటేల్స్

కొత్త ఎస్‌జి650 కాన్సెప్ట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాన్సెప్ట్‌కు సంబంధించిన కొన్ని ప్రత్యేక అంశాలు ఉన్నాయి. ఈ బైక్‌లోని ఫ్యూయెల్ ట్యాంక్ CNC బిల్లెట్ అల్యూమినియం యొక్క ఘన బ్లాక్‌తో తయారు చేయబడింది, ఇందులో ఇంటిగ్రేటెడ్ ఏబిఎస్, బెస్పోక్ డిజైన్ చేయబడిన బ్రేక్ కాలిపర్‌లు మరియు డ్యూయల్ ఫ్రంట్ బ్రేక్ డిస్క్‌లతో కూడిన వీల్ రిమ్‌లు మొదలైన అంశాలు ఉన్నాయి.

Royal Enfield నుండి మరో కొత్త 650 సిసి బైక్ ఆవిష్కరణ; డీటేల్స్

అంతేకాకుండా, ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో కనిపించినట్లుగా ఇందులో కూడా ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది గూగుల్ ఆధారిత ట్రిప్పర్ నావిగేషన్‌తో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కనెక్టింగ్ ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది. ఈ బైక్‌లో పునర్నిర్మించిన సబ్‌ఫ్రేమ్, చంకీ వైట్ కలర్ గ్లోసీ ఫ్రంట్ ఫెండర్, SG 650 ట్విన్ గ్రాఫిక్స్‌తో కూడిన సైడ్ ప్యానెల్‌లు, 650 ట్విన్స్ మాదిరిగానే ఉండే ఇంధన ట్యాంక్, డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్‌తో కూడిన ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లు, మిడిల్-సెట్ ఫుట్‌పెగ్‌లు, నిటారుగా ఉండే హ్యాండిల్‌బార్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. త్వరలోనే ఈ కాన్సెప్ట్ ఉత్పత్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

Royal Enfield నుండి మరో కొత్త 650 సిసి బైక్ ఆవిష్కరణ; డీటేల్స్

కొత్త 2021 Royal Enfield Classic 350 విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ కొత్త 2021 క్లాసిక్ 350 (Classic 350) మోటార్‌సైకిల్ గడచిన సెప్టెంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త 2021 Royal Enfield Classic 350 ప్రారంభ ధర రూ. 1.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. కొత్త 2021 Classic 350 మోటార్‌సైకిల్‌ను కంపెనీ మొత్తం 11 కలర్ ఆప్షన్ లలో ప్రవేశపెట్టింది. మార్కెట్లో వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 1.84 లక్షల నుండి రూ. 2.15 లక్షల వరకు ఉన్నాయి.

Royal Enfield నుండి మరో కొత్త 650 సిసి బైక్ ఆవిష్కరణ; డీటేల్స్

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్ ని కూడా కంపెనీ గతంలో విడుదల చేసిన మీటియోర్ 350 (Meteor 350) మోడల్ ని తయారు చేసిన కొత్త J ప్లాట్‌ఫామ్ ఆధారంగానే నిర్మించారు. ఇందులో కంపెనీ తమ లేటెస్ట్ 349 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్ ను మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 న్యూటన్ మీటర్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Royal enfield sg 650 concept unveiled in icma details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X