రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జిటి) 120వ వార్షికోత్సవ ఎడిషన్స్ వస్తున్నాయ్!

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఇటలీలోని మిలాన్ లో జరుగుతున్న 78వ ఎడిషన్ ఇంటర్నేషనల్ మోటార్‌సైకిల్ అండ్ యాక్ససరీస్ ఎగ్జిబిషన్ (EICMA 2021) లో తమ పాపులర్ 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్ ఐఎన్‌టి 650 మరియు కాంటినెంటల్ జిటి650) మోడళ్ల యొక్క 120వ వార్షికోత్సవ ఎడిషన్లను ఆవిష్కరించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ టూవీలర్ వ్యాపారంలోకి ప్రవేశించి 120 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్లను ప్రవేశపెట్టింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జిటి) 120వ వార్షికోత్సవ ఎడిషన్స్ వస్తున్నాయ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 కవలలు (650 Twins) గా పేరు పొందిన Interceptor INT 650 మరియు Continental GT 650 మోడళ్లు ఈ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిళ్లుగా ఉన్నాయి. ప్రస్తుతం, రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి లభిస్తున్న అత్యంత ఖరీదైన మరియు ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన మోడళ్లు కూడా ఇవే. కాగా, వీటితో పాటుగా కంపంనీ మరో కొత్త 650సిసి మోటార్‌సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎస్‌జి650 (Royal Enfield SG650) కాన్సెప్ట్ ను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శించింది. ఇది చూడటానికి క్లాసిక్ 350 మోడల్ యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లా బాగా బల్కీగా కనిపిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జిటి) 120వ వార్షికోత్సవ ఎడిషన్స్ వస్తున్నాయ్!

కాగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ రెండు స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిళ్ల (ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 120వ వార్షికోత్సవ ఎడిషన్స్‌) ఉత్పత్తిని కేవలం 480 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయనుంది. కంపెనీ ఒక్కో ప్రాంతానికి 120 యూనిట్లను (60 యూనిట్లు కాంటినెంటల్ జిటి 650 బైక్‌లు మరియు 60 యూనిట్లు ఇంటర్‌సెప్టర్ 650 బైక్‌లను) మాత్రమే కేటాయించింది. ఈ బైక్‌లు విక్రయించబడే దేశాలలో భారత్, యూరప్, అమెరికా మరియు సౌత్ ఈస్ట్ ఆసియా మార్కెట్లు ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జిటి) 120వ వార్షికోత్సవ ఎడిషన్స్ వస్తున్నాయ్!

పరిమిత సంఖ్యలో విక్రయించబడే ఈ 120వ యానివర్సరీ ఎడిషన్ మోటార్‌సైకిళ్లలో ప్రతి ఒక్కటి గ్లోబల్ ఔత్సాహికులు మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు సదరు బ్రాండ్ యొక్క మోటార్‌సైక్లింగ్ చరిత్రను సొంతం చేసుకునేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందజేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నవంబర్ 1901లో లండన్‌లోని స్టాన్లీ సైకిల్ షోలో తన మొదటి బైక్‌ను విడుదల చేయడం ద్వారా దాని ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ బ్రాండ్ 1901లో తన నిరాడంబరమైన ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు ప్రపంచంలోనే ఇప్పటి వరకు నిరంతర ఉత్పత్తిలో ఉన్న అత్యంత పురాతనమైన మోటార్‌సైకిల్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జిటి) 120వ వార్షికోత్సవ ఎడిషన్స్ వస్తున్నాయ్!

ఈ మైలురాయికి గుర్తుగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన మంగళవారం నాడు తమ ప్రసిద్ధ 650 ట్విన్ మోటార్‌సైకిళ్లలో ఈ కొత్త 120వ వార్షికోత్సవ ఎడిషన్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోటార్‌సైకిళ్లు తమ ప్రత్యేక ఎడిషన్ స్కిన్‌ల ద్వారా కంపెనీ 120 సంవత్సరాల ఉనికిని గుర్తుచేస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ ప్రత్యేకమైన 650 కవలలను (650 ట్విన్స్) 1960 కాలం నాటి ప్రముఖ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 750 మరియు కాంటినెంటల్ జిటి 250 మోడళ్ల నుండి ప్రేరణ పొంది రూపొందించారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జిటి) 120వ వార్షికోత్సవ ఎడిషన్స్ వస్తున్నాయ్!

కొత్త తరం టెక్నాలజీ మరియు డిజైన్ ఫీచర్లతో వచ్చిన ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 మోటార్‌సైకిళ్లు, గత కొన్ని సంవత్సరాలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ యొక్క గ్లోబల్ విస్తరణ మరియు విజయంలో కీలక పాత్ర పోషించాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ బ్రాండ్ తన ప్రయాణంలో సాధించిన మైలురాయిని దృష్టిలో ఉంచుకొని, ఈ ప్రత్యేకమైన 120వ సంవత్సర వార్షికోత్సవ ఎడిషన్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోడళ్లను యూకే మరియు భారతదేశంలోని కంపెనీ బృందాలు సంయుక్తంగా కలిసి రూపొందించాయి మరియు ఇవి ప్రత్యేకంగా చేతితో తయారు చేయబడ్డాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జిటి) 120వ వార్షికోత్సవ ఎడిషన్స్ వస్తున్నాయ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థకు భారతదేశంలోని చెన్నై నగరంలో ఉన్న తిరువొత్తియూర్‌లో ఓ కర్మాగారం ఉంది. ఇది సంస్థ యొక్క అసలైన 1950 కాలం నాటి తయారీ కర్మాగారం, ఇందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ఇండస్ట్రీ లీడింగ్ క్రోమింగ్ టెక్నాలజీతో కూడిన ప్రత్యేకమైన, బ్లాక్-క్రోమ్ ట్యాంక్ కలర్ స్కీమ్ అంతర్గతంగా అభివృద్ధి చేయబడింది. ఈ మోటార్‌సైకిళ్లు ప్రత్యామ్నాయ మరియు స్థిరమైన ట్రివాలెంట్ పర్యావరణ అనుకూల ప్రక్రియతో క్రోమ్ చేయబడ్డాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జిటి) 120వ వార్షికోత్సవ ఎడిషన్స్ వస్తున్నాయ్!

ఈ బ్లాక్ క్రోమ్ ట్యాంక్‌లతో ఫినిష్ చేయబడిన ఈ కాంటినెంటల్ జిటి 650 మరియు ఇంటర్‌సెప్టర్ 650 మోటార్‌సైకిళ్లు రెండూ కూడా మొదటి సారిగా పూర్తిగా బ్లాక్ అవుట్ చేయబడిన భాగాలను కలిగి ఉంటాయి. ఇందులో ఇంజన్, సైలెన్సర్ వంటి ఇతర అంశాలు ఉన్నాయి. స్టాండర్డ్ మోడళ్లతో పోల్చితే, ఈ వార్షికోత్సవ ఎడిషన్లను ప్రత్యేకంగా ఉంచేందుకు కంపెనీ ఈ మోటార్‌సైకిళ్లలోని ఫ్లైస్క్రీన్‌లు, ఇంజన్ గార్డ్‌లు, హీల్ గార్డ్‌లు, టూరింగ్ మరియు బార్ ఎండ్ మిర్రర్‌లు వంటి భాగాలను బ్లాక్ కలర్ లో ఫినిష్ చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జిటి) 120వ వార్షికోత్సవ ఎడిషన్స్ వస్తున్నాయ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ప్రత్యేకమైన 120వ సంవత్సర వార్షికోత్సవ ఎడిషన్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోడళ్లు త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. గుర్తుంచుకోండి, మనదేశంలో ఇవి ప్రతి మోడల్ కూడా కేవలం 60 యూనిట్లు మాత్రమే అమ్మకానికి ఉంటాయి. ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లలో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా, మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. ఇవి రెండూ ఒకేరకమైన ఇంజన్ ను కలిగి ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జిటి) 120వ వార్షికోత్సవ ఎడిషన్స్ వస్తున్నాయ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 మోటార్‌సైకిళ్లలో 649 సిసి ఎయిర్ మరియు ఆయిల్-కూల్డ్, ప్యారలల్ -ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. వీటి ధరలు మరియు ఇతర వివరాలకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Royal enfield unveils 120th anniversary edition models of interceptor int 650 and continental gt 650 at eicma 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X