1971 యుద్ధ విజయం యొక్క 50వ వార్షికోత్సం: స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ బైక్స్ విడుదల

ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ జావా మోటార్‌సైకిల్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న క్లాసిక్ మోడల్‌లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. కొత్త జావా క్లాసిక్ మోటార్‌సైకిల్ ఇప్పుడు ఖాకీ మరియు మిడ్‌నైట్ గ్రే అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

1971 యుద్ధ విజయం యొక్క 50వ వార్షికోత్సం: స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ బైక్స్ విడుదల

భారతదేశం యొక్క 1971 యుద్ధ విజయం 50వ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు కంపెనీ ఈ రెండు కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. మార్కెట్లో వీటి ధర రూ.1.93 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జావా డీలర్‌షిప్‌ల ద్వారా ఇవి లభిస్తాయని కంపెనీ తెలిపింది.

1971 యుద్ధ విజయం యొక్క 50వ వార్షికోత్సం: స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ బైక్స్ విడుదల

ఖాకీ మరియు మిడ్‌నైట్ గ్రే రంగులు భారత సైన్యం యొక్క శౌర్యం మరియు ధైర్యానికి ప్రతీకగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ కొత్త రంగులతో పాటు, ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌లపై ఓ స్మారక చిహ్నం కూడా ఉంటుంది, ఇది ఆర్మీ చిహ్నాన్ని మరియు 1971 విజయానికి ప్రతీక అయిన 'లారెల్ దండ'ను కలిగి ఉంటుంది.

1971 యుద్ధ విజయం యొక్క 50వ వార్షికోత్సం: స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ బైక్స్ విడుదల

ఈ చిహ్నాన్ని బైక్ యొక్క ఇంధన ట్యాంక్ మధ్యలో త్రివర్ణ చారల వృత్తంలో ఉంచబడింది, ఇది దేశ గర్వానికి చిహ్నంగా ఉంటుంది. ఆర్మీ ఇన్సిగ్నియాను ప్రదర్శించే మొదటి ప్రొడక్షన్ మోటార్‌సైకిళ్లు జావా క్లాసిక్ ఖాకీ మరియు జావా క్లాసిక్ మిడ్‌నైట్ గ్రే అని కంపెనీ తెలిపింది.

1971 యుద్ధ విజయం యొక్క 50వ వార్షికోత్సం: స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ బైక్స్ విడుదల

ఈ స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ మోటార్‌సైకిళ్లలో ప్రవేశపెట్టబడిన ఖాకీ మరియు మిడ్‌నైట్ గ్రే రంగులు రెండూ కూడా మ్యాట్ ఫినిష్‌లో ఉంటాయి మరియు ఇవి ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంటాయి. ఈ థీమ్‌ను మోటారుసైకిల్ యొక్క యాంత్రిక భాగాల వరకు ఉపయోగించబడింది.

1971 యుద్ధ విజయం యొక్క 50వ వార్షికోత్సం: స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ బైక్స్ విడుదల

అంతే కాకుండా, ఈ మోటార్‌సైకిళ్లలో బ్లాక్ అవుట్ స్పోక్ రిమ్స్ ఉపయోగించబడ్డాయి, ఇది ఈ మోటార్‌సైకిళ్ల మొత్తం రూపాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది. ఈ బైక్‌లలో ఉపయోగించిన సీట్లను కూడా కంపెనీ రీడిజైన్ చేసింది. రీడిజైన్ చేయబడిన సీట్లు ఇప్పుడు రైడర్‌కు మరింత మెరుగైన సౌకర్యాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

1971 యుద్ధ విజయం యొక్క 50వ వార్షికోత్సం: స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ బైక్స్ విడుదల

జావా క్లాసిక్ మోటార్‌సైకిళ్లలోని ఈ కొత్త కలర్ ఆప్షన్లు డ్యూయెల్-ఏబిఎస్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని గమనించాలి. ఈ సేఫ్టీ ఫీచర్ ఈ జావా బైక్‌లను స్వారీ చేయడం మరింత సురక్షితంగా చేస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ మోటార్‌సైకిళ్లలో కంపెనీ ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు.

1971 యుద్ధ విజయం యొక్క 50వ వార్షికోత్సం: స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ బైక్స్ విడుదల

జావా క్లాసిక్ మోడల్‌లో ఉపయోగించిన 293సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌నే ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌లోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 27.33 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27.02 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

1971 యుద్ధ విజయం యొక్క 50వ వార్షికోత్సం: స్పెషల్ ఎడిషన్ జావా క్లాసిక్ బైక్స్ విడుదల

ఇదిలా ఉంటే, జావా పెరాక్ మోటార్‌సైకిల్ కోసం కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. బాబర్ తరహా లాంటి ఈ క్రూయిజర్ మోడల్ బైక్ ఇప్పుడు మ్యాట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో వచ్చింది. ఈ కస్టమైజేషన్‌ ఆప్షన్ ధరను కంపెనీ రూ.9,999 గా నిర్ణయించింది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Special Edition Jawa Classic Bikes Launched To Celebrate 1971 Indian War Victory, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X