కంపారిజన్: సుజుకి అవెనిస్ vs టీవీఎస్ ఎన్‌టార్క్ vs యమహా రే జెడ్ఆర్

జపాన్‌కి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, 125 సిసి స్కూటర్ విభాగంలో యాక్సెస్ మరియు బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ వంటి మోడళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కాగా, ఈ కంపెనీ తాజాగా దేశీయ విపణిలో తమ సరికొత్త స్పోర్టీ 125 సిసి స్కూటర్ 'సుజుకి అవెనిస్' (Suzuki Avenis) ను విడుదల చేసింది. ఇది ఈ విభాగంలో టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS Ntorq) మరియు యమహా రే జెడ్ఆర్ (Yamaha RayZR) వంటి మోడళ్లతో ఏవిధంగా పోటీ పడుతుందో ఈ కథనంలో చూద్దాం రండి.

కంపారిజన్: సుజుకి అవెనిస్ vs టీవీఎస్ ఎన్‌టార్క్ vs యమహా రే జెడ్ఆర్

ఈ మూడు స్కూటర్లు కూడా 125 సిసి ఇంజన్‌తో లభిస్తాయి మరియు ఇవి చూడటానికి ఒకేరకమైన స్పోర్టీ క్యారెక్టరిస్టిక్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి షార్ప్ బాడీ లైన్స్, స్పోర్టీ ప్యానెల్స్, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ మరియు ఏరోడైనమిక్స్‌తో స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటాయి. అయితే, వీటిలో సుజుకి అవెనిస్ లేటెస్ట్ గా వచ్చిన మోడల్ కాబట్టి ఇది మిగతా రెండింటి కంటే కాస్తంత మెరుగైన మోడ్రన్ స్టైల్ ను కలిగి ఉంటుంది.

కంపారిజన్: సుజుకి అవెనిస్ vs టీవీఎస్ ఎన్‌టార్క్ vs యమహా రే జెడ్ఆర్

సుజుకి అవెనిస్ బాడీ గ్రాఫిక్స్ డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ లో చాలా అద్భుతంగా ప్రదర్శించబడ్డాయి మరియు ఇది మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంటుంది. అవెనిస్ స్కూటర్ కోసం సుజుకి తమ మోటోజిపి నుండి స్పూర్తి పొంది రూపొందించిన బ్లూ కలర్ రేస్ స్పెక్ పెయింట్ స్కీమ్ ను కూడా అందిస్తోంది. స్టాండర్డ్ అవెనిస్ తో పోల్చుకుంటే, ఈ రేస్ స్పెక్ బ్లూ కలర్ వేరియంట్ ధర రూ. 1,000 అధికంగా ఉంటుంది.

కంపారిజన్: సుజుకి అవెనిస్ vs టీవీఎస్ ఎన్‌టార్క్ vs యమహా రే జెడ్ఆర్

కొలతల పరంగా చూస్తే, సుజుకి అవెనిస్ మిగతా రెండింటి కంటే పొడవుగా ఉంటుంది. సుజుకి అవెనిస్ కన్నా టీవీఎస్ ఎన్‌టార్క్ తక్కువ పొడవును కలిగి ఉంటుంది. అయితే, అవెనిస్ కన్నా యమహా రే జెడ్ఆర్ వెడల్పు మరియు ఎత్తులో పెద్దదిగా ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ విషయంలో అవెనిస్ మరియు రే జెడ్ఆర్ రెండింటిలో 5.2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. అయితే, టీవీఎస్ ఎన్‌టార్క్ మాత్రం 5.8 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. సీట్ హైట్ లో ఇవి మూడు ఒకేలా ఉంటాయి.

కంపారిజన్: సుజుకి అవెనిస్ vs టీవీఎస్ ఎన్‌టార్క్ vs యమహా రే జెడ్ఆర్

గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో సుజుకి అవెనిస్ 160 మిమీ గానూ, టీవీఎస్ ఎన్‌టార్క్ 155 మిమీ గానూ మరియు యమహా రే జెడ్ఆర్ 145 మిమీ గాను ఉంటుంది. బరువు విషయానికి వస్తే సుజుకి అవెనిస్ బరువు 106 కేజీలు, టీవీఎస్ ఎన్‌టార్క్ 116 కేజీలు మరియు యమహా రే జెడ్ఆర్ 99 కేజీలుగా ఉంటుంది. బరువు పరంగా చూస్తే, ఈ మూడింటింలో రే జెడ్ఆర్ అత్యంత తేలికైనది మరియు ఎన్‌టార్క్ అత్యంత బరువైనది.

కంపారిజన్: సుజుకి అవెనిస్ vs టీవీఎస్ ఎన్‌టార్క్ vs యమహా రే జెడ్ఆర్

అవెనిస్ అండర్ సీట్ స్టోరేజ్ 12.8 లీటర్లుగా ఉంటే, ఎన్‌టార్క్ 22 లీటర్లు మరియు రే జెడ్ఆర్ 21 లీటర్లుగా ఉంటుంది. ఈ విషయంలో అవెనిస్ కన్నా మిగిలిన రెండు స్కూటర్లు చాలా మెరుగ్గా ఉన్నాయి. టెక్నాలజీ పరంగా చూస్తే, ఈ మూడు 125 సిసి స్కూటర్లు కూడా బ్లూటూత్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడి హెడ్‌లైట్లు మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను కలిగి ఉంటాయి.

కంపారిజన్: సుజుకి అవెనిస్ vs టీవీఎస్ ఎన్‌టార్క్ vs యమహా రే జెడ్ఆర్

సుజుకి అవెనిస్ 125 మరియు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్లలో నావిగేషన్ ఫీచర్ మరియు ఇంజిన్ కిల్ స్విచ్ ఫీచర్‌లు అందించబడ్డాయి. అయితే, రే జెడ్ఆర్ లో మాత్రం ఈ ఫీచర్లు ఉండవు. అదేవిధంగా ఈ రెండింటిలో (అవెనిస్, ఎన్‌టార్క్) ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్ బయటి వైపు ఉంటే, రే జెడ్ఆర్ లో మాత్రం సీటు క్రింది భాగంలో ఉంటుంది. అలాగే, యమహా రే జెడ్ఆర్ స్కూటర్ వెనుక టెయిల్ లైట్ సాధారణంగా ఉంటే, మిగిలిన రెండు మోడళ్లలో ఎల్ఈడి టెయిల్ లైట్ ఉంటుంది.

కంపారిజన్: సుజుకి అవెనిస్ vs టీవీఎస్ ఎన్‌టార్క్ vs యమహా రే జెడ్ఆర్

చివరిగా ఇంజన్స్ విషయానికి వస్తే, సుజుకి అవెనిస్‌లో 124.3 సిసి ఇంజన్, ఎన్‌టార్క్‌లో 124.8 సిసి ఇంజన్ మరియు రే జెడ్ఆర్‌లో 125 సిసి ఇంజన్‌లు అమర్చబడి ఉన్నాయి. ఈ మూడింటిలో టీవీఎస్ ఎన్‌టార్క్ ఇంజన్ ఎక్కువ శక్తిని అందించగలదు. ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 10.2 పిఎస్ శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ప్రతి సిలిండర్‌కు 3 వాల్వ్‌లు ఉంటాయి. కానీ, మిగిలిన రెండు మోడళ్లలో ప్రతి సిలిండర్ కు రెండు వాల్వ్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి, పెర్ఫార్మెన్స్ విషయంలో ఎన్‌టార్క్ చాలా ఉత్తమంగా ఉంటుంది.

కంపారిజన్: సుజుకి అవెనిస్ vs టీవీఎస్ ఎన్‌టార్క్ vs యమహా రే జెడ్ఆర్

ఇక సుజుకి అవెనిస్ విషయానికి వస్తే ఇందులోని 124.3 సిసి ఇంజన్ 6750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 పిఎస్ శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, యమహా రే జెడ్ఆర్ ఇంజన్ గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 8.2 పిఎస్ శక్తిని మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. యమహా రే జెడ్ఆర్ స్కూటర్‌లోని V-బెల్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు సరిపోతుంది, మిగిలిన రెండు మోడళ్లు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందించబడుతున్నాయి.

Most Read Articles

English summary
Suzuki avenis 125 vs tvs n torq 125 price engine features comparison
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X