స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది, ఈ కారణంగా ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాయి. ఇందులో ద్విచక్ర వాహన తయారీదారులు కూడా ఉన్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు మార్కెట్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తుండగా, మరికొన్ని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ విధంగా సన్నాహాలు సిద్ధం చేస్తున్న కంపెనీలలో ఒకటి సుజుకి మోటార్ సైకిల్.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

జపనీస్ బైక్ మరియు స్కూటర్ తయారీదారు "సుజుకి మోటార్ సైకిల్" కంపెనీ తన ప్రసిద్ధ బర్గ్‌మన్ స్ట్రీట్ 125 ఆధారిత ఎలక్ట్రిక్ స్కూటర్‌పై చాలా చురుకుగా పనిచేస్తోంది. ఇప్పటికే కంపెనీ యొక్క ఈ స్కూటర్ భారతదేశంలో టెస్టింగ్ చేస్తూ చాలా సార్లు గుర్తించబడింది. ఇటీవల ఈ స్కూటర్ మరోసారి టెస్టింగ్ దశలో కనిపించింది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ తన బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని చాలా రోజులుగా టెస్ట్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే కంపెనీ యొక్క బర్గ్‌మన్ స్ట్రీట్ 125 అత్యధికంగా అమ్ముడైన వాహనాల్లో ఒకటిగా నిలిచింది. ఈ స్కూటర్ చాలామంది వాహనదారులను ఆకర్షించడంలో విజయం సాధించింది.

MOST READ:వాహనదారులకు గుడ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన డ్రైవింగ్ లైసెన్స్ గడువు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రూపకల్పన విషయానికి వస్తే, ఇది దాని స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే, దాని రూపకల్పనలో ఎటువంటి మార్పు లేదు. టెస్టింగ్ దశలో మనకు కనిపించే ఈ స్కూటర్ ని చూస్తే దాని మునుపే మోడల్ ని పోలి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడ బర్గ్‌మన్ స్ట్రీట్ యొక్క పెద్ద హెడ్‌లైట్ మరియు ఫ్రంట్ ఆప్రాన్‌లో చూడవచ్చు.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు రియర్ స్ప్రింగ్ లోడెడ్ డ్యూయల్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంది. ఈ స్కూటర్‌కు 5-స్పోక్ అల్లాయ్ వీల్ మరియు రియర్ టైర్ మడ్‌గార్డ్ కూడా లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కలిగి ఉంది.

MOST READ:ట్రాఫిక్ సిగ్నెల్‌లో డాన్స్ చేసిన కెటిఎమ్ బైక్ రైడర్ [వీడియో]

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇవి మాత్రమే కాకుండా, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టైల్ లైట్స్, యూఎస్‌బీ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ దాదాపు తెలుపు రంగులో ఉంటుంది, అయితే సైడ్ ప్రొఫైల్‌ మాత్రం బ్లూ యాక్సెంట్స్ కలిగి ఉంది. ఈ స్కూటర్ కూడా దాని బర్గ్‌మన్ స్ట్రీట్ వలె పెద్దదిగా ఉంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ దాని స్టాండర్డ్ సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 110 సిసి కంటే మెరుగైన పనితీరుని అందించే అవకాశం ఉందని తెలిపింది. ఈ స్కూటర్‌లో బెల్ట్ డ్రైవ్ ఉపయోగించవచ్చు. నివేదిక ప్రకారం, సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు 100 కిమీ నుంచి 120 కిలోమీటర్ల ARAI సర్టిఫికేట్ పరిధిని అందించే అవ్కాడ్స్డం ఉంది.

MOST READ:భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్; వివరాలు

ఈ సుజుకి బర్గ్‌మన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుకు ఫేమ్-2 స్కీమ్ కింద సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఈ స్కూటర్ విభాగంలో బజాజ్ చేతక్, టివిఎస్ ఐక్యూబ్ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని భావిస్తున్నారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేయనున్నట్లు సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ తెలిపింది, దీని ప్రకారం ఇది పూర్తిగా భారతదేశంలో కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది.

Source: GaadiWaadi

Most Read Articles

English summary
Suzuki Burgman Electric Spotted Testing Rear Profile Revealed Details. Read in Telugu.
Story first published: Saturday, March 27, 2021, 18:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X