భారత్‌లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ప్రీ-బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్, భారత మార్కెట్లో మరో సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ట్రైయంప్ స్పీడ్ ట్విన్ పేరిట కంపెనీ ఓ కొత్త కెఫే రేసర్ స్టైల్ బైక్‌ను కంపెనీ విడుదల చేయనుంది. ఈ మోడల్ కోసం కంపెనీ ఇప్పటికే అధికారికంగా ప్రీ-బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది.

భారత్‌లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ప్రీ-బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ట్రైయంప్ స్పీడ్ ట్విన్ పట్ల ఆసక్తి గల కస్టమర్లు రూ.50,000 టెకెన్ అడ్వాన్స్ చెల్లించి, ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. రాబోయే వారాల్లోనే ఈ కొత్త 2021 ట్రైయంప్ స్పీడ్ ట్విన్ మోటార్‌సైకిల్ విడుదల కానుంది. కంపెనీ ఈ మోడల్‌లో అనేక అప్‌డేట్స్ చేసింది.

భారత్‌లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ప్రీ-బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

మునుపటి ట్రైయంప్ స్పీడ్ ట్విన్ మోడల్ కంటే ఇది మరింత మెరుగైన డిజైన్, పనితీరు మరియు యాంత్రిక పరమైన మార్పులను కలిగి ఉంటుంది. కొత్త 2021 ట్రైయంప్ స్పీడ్ ట్విన్ మూడు కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. అవి: జెట్ బ్లాక్, మ్యాట్ స్టార్మ్ గ్రే మరియు రెడ్ హాప్పర్.

భారత్‌లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ప్రీ-బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ఈ బైక్‌లో డిజైన్ మార్పుల విషయానికి వస్తే, కొత్త 2021 ట్రైయంప్ స్పీడ్ ట్విన్ మునుపటి మోడల్‌తో పోలిస్తే చాలా మార్పులకు గురైంది. ఈ మార్పులలో ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్ మౌంట్‌లతో పాటు కొత్త యానోడైజ్డ్ హెడ్‌ల్యాంప్ మౌంట్‌లు ఉన్నాయి. ఈ రెట్రో-రోడ్‌స్టర్‌లో కొత్త 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

భారత్‌లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ప్రీ-బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ఇకపోతే, మిగిలిన డిజైన్ మరియు ఫీచర్లు మునుపటి స్పీడ్ ట్విన్ మోడల్ మాదిరిగానే ఉంటాయి. వీటిలో 14.5 లీటర్ల ఇంధన ట్యాంక్, సింగిల్-పీస్ వైడ్ హ్యాండిల్ బార్, ట్విన్-పాడ్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హ్యాండిల్‌బార్‌పై స్విచ్ గేర్, ఆల్‌రౌండ్ ఎల్‌ఈడీ లైటింగ్, డ్యూయల్ క్రోమ్-ఫినిష్డ్ ఎగ్జాస్ట్స్ మరియు సింగిల్-పీస్ సీట్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ప్రీ-బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

కొత్త 2021 ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ఇంజన్‌లో యాంత్రికంగా మార్పులు చేశారు. మునుపటి కంటే మరింత శక్తిని ఉత్పత్తి చేయడానికి ఇందులో అంతర్గత మార్పులు చేశారు. ఇందులో కొత్త హై-కంప్రెషన్ పిస్టన్లు, రివైజ్డ్ పోర్ట్స్ మరియు కామ్ ప్రొఫైల్స్, తేలికపాటి క్రాంక్ షాఫ్ట్ మరియు కొత్త ఆల్టర్నేటర్లు ఉన్నాయి.

భారత్‌లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ప్రీ-బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ఇంజన్ విషయాని వస్తే, ఇందులో అదే 1200సిసి లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది పాత మోడల్ కంటే మరింత క్లీన్‌గా ఉండి, సమర్థవంతమైనది మరియు శక్తివంతమైనదిగా ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 98.6 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది పాత ఇంజన్ శక్తి కంటే 3 బిహెచ్‌పిలు ఎక్కువ. అయితే, గరిష్ట టార్క్ 112 ఎన్ఎమ్ గానే ఉంటుంది. ఈ ఇంజన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ప్రీ-బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

కొత్త 2021 ట్రైయంప్ స్పీడ్ ట్విన్ మెకానికల్స్‌ను గమనిస్తే, దీని సస్పెన్షన్ సెటప్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. దీని ముందు భాగంలో 43 మిమీ అప్ సైడ్ డౌన్ మార్జోచి ఫోర్కులు మరియు వెనుక భాగంలో 120 మిమీ ట్రావెల్‌తో కూడిన ప్రీలోడ్ అడ్జస్టబల్ ట్విన్-షాక్ యూనిట్ ఉంటాయి.

భారత్‌లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ప్రీ-బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 320 మిమీ బ్రెంబో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు బ్రెంబో ఎమ్50 4-పిస్టన్ రేడియల్ మోనోబ్లోక్ కాలిపర్‌లు ఉంటాయి. అలాగే, వెనుక భాగంలో నిస్సిన్ 2-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో కూడిన సింగిల్ 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇరువైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు వాటిపై మెట్జెలర్ రేసెటెక్ టైర్లు ఉంటాయి.

భారత్‌లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ప్రీ-బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ఈ మోటారుసైకిల్‌లోని ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లలో మూడు రైడ్ మోడ్‌లు (రెయిన్, రోడ్ మరియు స్పోర్ట్) ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ మొదలైనవి ఉంటాయి. రైడ్ మోడ్‌ల మధ్య వ్యత్యాసం థ్రోటల్ మ్యాపింగ్‌లో మార్పులు మరియు ట్రాక్షన్ కంట్రోల్ యొక్క సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌లోని డిజిటల్ డిస్ప్లే మరియు హ్యాండిల్‌బార్‌లో ఉన్న స్విచ్‌గేర్ ఉపయోగించి రైడర్ వివిధ రైడ్ మోడ్‌లను ఎంచుకోవచ్చు.

భారత్‌లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ప్రీ-బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

ట్రైయంప్ బ్రాండ్ యొక్క లైనప్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే, కంపెనీ ఈ కొత్త 20212 స్పీడ్ ట్విన్‌ను కూడా అనేక యాక్ససరీలతో అందిస్తోంది. ఈ ఆప్షనల్ యాక్ససరీస్‌లో ఫ్యాక్టరీ నుండి నేరుగా లభించే కాస్మెటిక్, ఫంక్షనల్ మరియు పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ కిట్స్ ఉంటాయి.

భారత్‌లో ట్రైయంప్ స్పీడ్ ట్విన్ ప్రీ-బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే విడుదల

అంతేకాకుండా, కస్టమర్లు తమ రెట్రో పెర్ఫార్మెన్స్-రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌ను బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ట్రైయంప్ తమ కొత్త 2021 స్పీడ్ ట్విన్‌తో, భారతదేశంలో పెరుగుతున్న పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్ల డిమాండ్‌ను తీర్చగలదని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Triumph Opens Pre-Bookings For Speed Twin Ahead Of India Launch, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X