భారత మార్కెట్లో Triumph Tiger 1200 బుకింగ్స్ ప్రారంభం; ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ప్రముఖ బ్రిటీష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ (Triumph) భారత మార్కెట్లో తమ సరికొత్త అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ 'ట్రైయంప్ టైగర్ 1200' (Triumph Tiger 1200) ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, కంపెనీ ఈ కొత్త బైక్ కోసం ముందస్తు బుకింగ్ లను కూడా ప్రారంభించింది. ట్రైయంప్ టైగర్ 1200 బైక్ ను GT మరియు Rally అనే రెండు వేరియంట్లలో విడుదల చేయనున్నారు. ఆసక్తిగల కస్టమర్లు ఈ బైక్ ను కంపెనీ డీలర్‌షిప్ ద్వారా కానీ లేదా ఆన్‌లైన్‌లో కానీ బుక్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో Triumph Tiger 1200 బుకింగ్స్ ప్రారంభం; ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ట్రైయంప్ తమ కొత్త టైగర్ 1200 ను ఇటీవలే సరికొత్త అవతార్‌లో అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేసింది. ఇప్పుడు ఈ అడ్వెంచర్ బైక్ అనేక ఆధునిక ఫీచర్లతో పాటుగా కొత్త 1,160 సిసి ఇంజన్‌తో రానుంది. టైగర్ 1200 మోటార్‌సైకిల్ ను కంపెనీ కొత్త తేలికపాటి ఛాసిస్‌పై నిర్మించింది. ఫలితంగా, ఇది ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో కూడా మంచి స్థిరత్వాన్ని అందిస్తుంది. కొత్త ట్రైయంప్ టైగర్ 1200 యొక్క ముఖ్యాంశాలలో ఒకటి, కాంటినెంటల్ భాగస్వామ్యంతో కంపెనీ అభివృద్ధి చేసిన సరికొత్త ట్రయంఫ్ బ్లైండ్ స్పాట్ రాడార్ సిస్టమ్.

భారత మార్కెట్లో Triumph Tiger 1200 బుకింగ్స్ ప్రారంభం; ఫీచర్లు మరియు ఇతర వివరాలు

అంతేకాకుండా, ఇందులో కొత్త షోవా సెమీ-యాక్టివ్ సస్పెన్షన్, ఇంటిగ్రేటెడ్ మై ట్రయంఫ్ కనెక్టివిటీ సిస్టమ్‌తో కూడిన 7 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే యూనిట్, ఐఎమ్‌యూవీ ఆప్టిమైజ్ చేయబడిన కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, వివిధ రకాల రైడింగ్ మోడ్‌లు, ఇగ్నిషన్‌తో కూడిన కీలెస్ సిస్టమ్, స్టీరింగ్ లాక్ మరియు ఫ్యూయెల్ క్యాప్ వంటివి ఈ బైక్‌లో లభిస్తున్న ఇతర ముఖ్యమైన ఫీచర్లు. ఈ రెండు వేరియంట్లలో టైగర్ 1200 జిటి బైక్ రోడ్ మరియు ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం రూపొందించగా, టైగర్ 1200 ర్యాలీని మాత్రం పూర్తిగా అడ్వెంచర్ ఆఫ్-రోడ్ ప్రయోజనం కోసం తయారు చేశారు.

భారత మార్కెట్లో Triumph Tiger 1200 బుకింగ్స్ ప్రారంభం; ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ట్రైయంప్ టైగర్ 1200 జిటి మోటార్‌సైకిల్ లో ముందు వైపు 19 ఇంచ్ టైరును అమర్చగా, వెనుక వైపు 18 ఇంచ్ టైరును ఉపయోగించారు. కాగా, ట్రైయంప్ టైగర్ 1200 ర్యాలీ మోటార్‌సైకిలో ముందు వైపు 21 ఇంచ్ టైరును మరియు వెనుక వైపు 18 ఇంచ్ టైరును ఉపయోగించారు. ఈ టైర్లు ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో రైడర్ కు మంచి హ్యాండ్లింగ్ ను ఆఫర్ చేయడంలో సహకరిస్తాయి. ఇతర మెకానికల్స్ ను గమనిస్తే, ఈ బైక్‌లో ట్రై-లింక్ స్వింగార్మ్ మరియు షాఫ్ట్ డ్రైవ్, షోవా సస్పెన్షన్ మరియు ముందువైపు 320 మిమీ రోటర్ మరియు బ్రేకింగ్ కోసం వెనుకవైపు డిస్క్ బ్రేక్ మొదలైనవి ఉన్నాయి.

భారత మార్కెట్లో Triumph Tiger 1200 బుకింగ్స్ ప్రారంభం; ఫీచర్లు మరియు ఇతర వివరాలు

కొత్త 2022 ట్రైయంప్ టైగర్ 1200 సిరీస్ ఇప్పుడు సరికొత్త 1160 సిసి ఇంజన్ తో లభ్యం కానున్నాయు. ఈ ఇంజన్ పాత మోడల్ కంటే మరింత శక్తివంతమైనది. ఇది గరిష్టంగా 9,000 rpm వద్ద 150 bhp శక్తిని మరియు 7,000 rpm వద్ద 130 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్ తో పోల్చి చూసినప్పుడు ఇది దాని కంటే 9 bhp ఎక్కువ పవర్ మరియు 8 Nm ఎక్కువ టార్క్ ను అందిస్తుంది. అధిక పవర్ అవుట్‌పుట్ ఇవ్వడానికి ఈ ఇంజన్‌ను మెరుగుపరిచినట్లు కంపెనీ పేర్కొంది.

భారత మార్కెట్లో Triumph Tiger 1200 బుకింగ్స్ ప్రారంభం; ఫీచర్లు మరియు ఇతర వివరాలు

కంపెనీ ఈ ఇంజన్‌లో బోర్ మరియు స్ట్రోక్ నుండి క్రాంక్, సిలిండర్ హెడ్, గేర్‌బాక్స్, క్లచ్, షాఫ్ట్ డ్రైవ్ మరియు బెవెల్ బాక్స్ వరకు అన్నింటినీ అప్‌గ్రేడ్ చేసింది. కొత్త టైగర్ 1200 జిటి స్నోడోనియా వైట్, సఫైర్ బ్లాక్ మరియు లూసర్న్ బ్లూ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాగా, టైగర్ 1200 ర్యాలీ స్నోడోనియా వైట్, సఫైర్ బ్లాక్ మరియు మ్యాట్ ఖాకీ కలర్లలో లభ్యం కానుంది. మార్కెట్లో వీటి ధరలు రూ.18 లక్షల రేంజ్ లో ఉండొచ్చని అంచనా. ఇవి ఈ విభాగంలో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4, హోండా ఆఫ్రికా ట్విన్ మరియు బిఎమ్‌డబ్ల్యు ఆర్ 1250 జిఎస్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటాయి.

భారత మార్కెట్లో Triumph Tiger 1200 బుకింగ్స్ ప్రారంభం; ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ట్రైయంప్ టైగర్ 660 స్పోర్ట్ బుకింగ్స్ కూడా షురూ..

ఇదిలా ఉంటే ట్రైయంప్ మోటార్‌సైకిల్ ఇండియా, దేశీయ మార్కెట్లో తమ సరికొత్త టైగర్ 660 స్పోర్ట్ మోటార్‌సైకిల్ కోసం కూడా బుకింగ్ లను ప్రారంభించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో యూకే ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబడిన ఈ మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది. ట్రైయంప్ లైనప్‌లో ఇది కొత్త ఎంట్రీ-లెవల్ టైగర్ సిరీస్ బైక్ మరియు ఇప్పటివరకు అత్యంత సరసమైన ట్రైయంప్ టైగర్ బైక్.

భారత మార్కెట్లో Triumph Tiger 1200 బుకింగ్స్ ప్రారంభం; ఫీచర్లు మరియు ఇతర వివరాలు

కొత్త ట్రైయంప్ టైగర్ 660 స్పోర్ట్ కంపెనీ యొక్క లేటెస్ట్ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ ట్రైడెంట్ 660 మాదిరిగానే అదే ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. కొత్త ట్రైయంప్ టైగర్ 660 స్పోర్ట్‌ను విడుదల చేయడానికి ముందే ట్రైయంప్ ఇండియా ఈ బైక్ కోసం బుకింగ్‌లను అంగీకరించడం ప్రారంభించింది. సమాచారం ప్రకారం, ఆసక్తిగల కస్టమర్లు టైగర్ 660 స్పోర్ట్‌ను రూ. 50,000 అడ్వాన్స్‌ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఏదైనా అధికారిక డీలర్‌షిప్ నుండి బుక్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో Triumph Tiger 1200 బుకింగ్స్ ప్రారంభం; ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ట్రైయంప్ ట్రైడెంట్ 660, కొత్త ఎంట్రీ-లెవల్ మిడిల్ వెయిట్ నేక్డ్ బైక్, ఈ ఏడాది ప్రారంభంలో ఇది గ్లోబల్ మార్కెట్లలో విడుదలయ్యింది. దేశీయ మార్కెట్లో దీని ధర రూ. 7.00 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్ లో ఉండొచ్చని అంచనా. కొత్త ట్రైయంప్ టైగర్ 660 స్పోర్ట్ మోటార్‌సైకిల్ ఒక రోడ్-బయాస్డ్ టూరర్ బైక్ అయితే, ఇందులో దాని యొక్క పూర్తిస్థాయి హార్డ్‌కోర్ అడ్వెంచర్ వెర్షన్ కూడా తరువాత దశలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Triumph tiger 1200 bookings started in india engine sepcs features and other details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X