Just In
- 30 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 40 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 49 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Movies
ముసలి గెటప్‌లో నందమూరి బాలకృష్ణ: సాహసాలు చేయడానికి సిద్ధమైన నటసింహం
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫిబ్రవరి 9న వస్తున్న ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ - పూర్తి వివరాలు
బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్, గతేడాది నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన తమ సరికొత్త టైగర్ 850 స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ను ఇప్పుడు భారత మార్కెట్లో కూడా ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 9, 2021వ తేదీన ఈ మోడల్‌ను దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ట్రైయంప్ ప్రకటించింది.

కొత్తగా వస్తున్న ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ ఈ బ్రాండ్ యొక్క 'టైగర్' సిరీస్‌లోనే అత్యంత సరసమైన కొత్త ఎంట్రీ లెవల్ మోడల్‌గా ఉంటుంది. ఈ మోటారుసైకిల్‌ను రోడ్-ఓరియెంటెడ్ అడ్వెంచర్-టూరర్‌గా డిజైన్ చేశారు. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న టైగర్ 900 మోడల్‌కు దిగువన ఈ కొత్త టైగర్ 850 స్పోర్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ దాని పెద్ద ఇంజన్ వెర్షన్ల మాదిరిగానే ఒకేరకమైన స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఈ రెండింటి మధ్య తేడా కోసం కంపెనీ కొత్త టైగర్ 850కి ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్, రెండు కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్స్ (గ్రాఫైట్ / డయాబ్లో రెడ్ మరియు గ్రాఫైట్ / కాస్పియన్ బ్లూ)ను జోడించింది.
MOST READ:విమనాలు ల్యాండ్ అయ్యేటప్పుడు వాటర్ సెల్యూట్ ఎదుకు చేస్తారో మీకు తెలుసా..?

ఇందులోని ఫ్రంట్ బీక్, సర్దుబాటు చేయగల విండ్‌షీల్డ్, ఫ్యూయల్ ట్యాంక్, రేడియేటర్ ష్రుడ్ మరియు ఎల్‌ఈడి లైట్స్ మరియు బాడీ ప్యానెళ్లను ట్రైయంప్ టైగర్ 900 మోడల్ నుండి గ్రహించారు. కొత్త ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్‌ను కస్టమర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవటం కంపెనీ అనేక రకాల యాక్ససరీలను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ఇంజన్ పరంగా చూసుకుంటే, కొత్త ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్‌లో కూడా అదే 888సిసి లిక్విడ్-కూల్డ్ ఇన్-లైన్ త్రీ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. కాకపోతే, ఈ ఇంజన్ టైగర్ 900 కన్నా 10 బిహెచ్‌పి తక్కువ పవర్ మరియు 5 ఎన్ఎమ్ తక్కువ టార్క్‌ను కలిగి ఉంటుంది.
MOST READ:సరికొత్త రూపంలోకి మారిన బెంట్లీ కాంటినెంటల్ జిటి [వీడియో]

టైగర్ 850 స్పోర్ట్ మోడల్‌లోని ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 82 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఈ ఇంజన్ స్లిప్ అసిస్ట్ క్లచ్ మరియు సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

టైగర్ 850 స్పోర్ట్‌లోని ఇంజన్‌ను డీట్యూన్ చేసిన కారణంగా మరింత లీనియర్ పవర్ డెలివరీ లభిస్తుందని మరియు ఇది చాలా తేలికైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుందని ట్రైయంప్ చెబుతోంది. ఈ బైక్ రెండు రైడింగ్ మోడ్‌లతో (రెయిన్ అండ్ రోడ్) లభిస్తుంది. ఈ మోడ్స్‌ని సెలక్ట్ చేసుకోవటం కోసం ప్రత్యేకమైన క్విక్-షిఫ్టర్ కూడా ఉంటుంది.
MOST READ:ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

ఇక ఇందులోని మెకానికల్స్ విషయాని వస్తే, ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ రెండింటినీ మార్జోచి బ్రాండ్ నుండి గ్రహించారు. ఫ్రంట్ సస్పెన్షన్ 180 మిమీ ట్రావెల్‌తో వస్తుంది అలాగే, వెనుకవైపు సస్పెన్షన్ 170 మిమీ మాన్యువల్ ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్‌తో లభిస్తుంది.

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో రెండు 320 మిమీ డిస్క్‌లు మరియు వెనుకవైపు ఒకే 255 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇవి రెండూ డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ చేస్తాయి. కొత్త ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ 100 -90 మరియు 150/70 టైర్ ప్రొఫైల్‌లతో 19-ఇంచ్ ఫ్రంట్ ముందు మరియు 17ఇంచ్ రియర్ అల్లాయ్ వీల్స్‌ని కలిగి ఉంటుంది.
MOST READ:భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

కొత్త టైగర్ 850 స్పోర్ట్, టైగర్ 900 జిటి మోడల్ కంటే 2 కిలోల తేలికగా ఉండి, 810 మిమీ వద్ద కొంచెం తక్కువ సీటు ఎత్తును కలిగి ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లు మరియు ఇది లీటరుకు 19.23 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో దీని ధర రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.