YouTube

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ (Triumph) అందిస్తున్న ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ టైగర్ 900 (Tiger 900) లో కంపెనీ ఓ కొత్త అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ బాండ్ ఎడిషన్‌ (Bond Edition) ను ఆవిష్కరించింది. జేమ్స్ బాండ్ 007 థీమ్ తో కంపెనీ ఈ మోటార్‌సైకిల్ ను ప్రత్యేకంగా కస్టమైజ్ చేసింది. ఇది చూడటానికి అచ్చం జేమ్స్ బాండ్ సినిమాలలో హీరో ఉపయోగించే బైక్‌లా కనిపిస్తుంది.

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

ఈ లిమిటెడ్ ఎడిషన్ 'ట్రైయంప్ టైగర్ 900 బాండ్ ఎడిషన్' (Triumph Tiger 900 Bond Edition) ను ప్రపంచ వ్యాప్తంగా 250 యూనిట్లు మాత్రమే విక్రయించనున్నారు. జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజీతో ట్రైయంప్ యొక్క అధికారిక భాగస్వామ్యంలో భాగంగా ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్తగా రాబోయే బాండ్ సినిమాలో కూడా ఈ బైక్ కనిపించనుంది.

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

కొత్త ట్రైయంప్ టైగర్ 900 బాండ్ ఎడిషన్ ను కంపెనీ విక్రయిస్తున్న ట్రైయంప్ టైగర్ 900 ర్యాలీ ప్రో (Triumph Tiger 900 Rally Pro) మోడల్ నుండి ప్రేరణ పొంది కస్టమైజ్ చేశారు. రాబోయే 25వ '007' జేమ్స్ బాండ్ సినిమా 'నో టైమ్ టు డై' (No Time To Die) లో కొన్ని అద్భుతమైన స్టంట్ సీక్వెన్స్ లలో ఈ బైక్ మనకు కనిపిస్తుంది.

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

జేమ్స్ బాండ్ థీమ్ ఆధారంగా లిమిటెడ్ ఎడిషన్ వాహనాలను విడుదల చేయటం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క ల్యాండ్ రోవర్ డిఫెండర్ మోడల్ లో కంపెనీ ఓ బాండ్ ఎడిషన్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. కొత్త డిఫెండర్ బాండ్ ఎడిషన్ యొక్క లిమిటెడ్ ఎడిషన్‌లు కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

ఇక ట్రైయంప్ టైగర్ 900 బాండ్ ఎడిషన్ విషయానికి వస్తే, ఇదివరకు చెప్పుకున్నట్లుగా దీనిని ఈ మోడల్ లైనప్‌లో టాప్-స్పెక్ వేరియంట్ అయిన ట్రైయంప్ టైగర్ 900 ర్యాలీ ప్రో ను ఆధారంగా చేసుకొని రూపొందించారు. పరిమిత ఎడిషన్ కారణంగా, ఇవి 250 యూనిట్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ప్రతి బైక్ కూడా వ్యక్తిగతంగా నంబర్ చేయబడి ఉంటుంది మరియు దానిపై బాండ్ సిగ్నేచర్ కూడా ఉంటుంది.

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

ఈ 250 జేమ్స్ బాండ్ మోటార్‌సైకిళ్లన్నీ కూడా ప్రత్యేకమైన సర్టిఫికెట్‌తో వస్తాయి. ట్రైయంప్ టైగర్ 900 బాండ్ ఎడిషన్ జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ సహకారంతో నిర్మించబడిన రెండవ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కావటం విశేషం. గత సంవత్సరం, ఈ కంపెనీ జేమ్స్ బాండ్ థీమ్‌తో రూపొందించిన స్క్రాంబ్లర్ 1200 బాండ్ ఎడిషన్‌ ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

ట్రైయంప్ టైగర్ 900 బాండ్ ఎడిషన్ ప్రత్యేకమైన మ్యాట్ సఫైర్ బ్లాక్ పెయింట్ స్కీమ్ మరియు స్పెషల్ 007 బాడీ గ్రాఫిక్స్ తో డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లలోని ప్రతి ఒక్క దానిలో హ్యాండిల్ బార్ క్లాంప్‌పై, అది ఎన్నొవ యూనిట్ అనే సంఖ్యను తెలియజేసే శాస్వత ముద్రతో వస్తుంది. తద్వారా వీటి ప్రామాణికతను ధృవీకరించవచ్చు.

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ బైక్ లోని ఫ్రేమ్, హెడ్‌లైట్ ఫినిషర్లు, సైడ్ ప్యానెల్‌లు, సంప్ గార్డ్, కుషన్ ఫుట్‌రెస్ట్ హ్యాంగర్లు, ఆక్సిలరీ ల్యాంప్ షౌడ్స్ మరియు ఇంజన్ గార్డ్‌లు అన్నీ కూడా ప్రీమియం బ్లాక్ ఫినిషింగ్‌తో పెయింట్ చేయబడి ఉంటాయి. ఈ బాండ్ ఎడిషన్ థీమ్‌ను మరింత మెరుగుపరచేందుకు, ఈ లిమిటెడ్ ఎడిషన్ టైగర్ 900 బాండ్ ఎడిషన్ బ్రాండింగ్‌లో ఆకర్షణీయమైన బెస్పోక్ 007 స్టార్ట్-అప్ స్క్రీన్ యానిమేషన్ ఉంటుంది.

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

అంతేకాకుండా, ఇందులోని రైడర్ మరియు పిలియన్ రైడర్ సీట్లు హీటెడ్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో మిష్లిన్ అనాకీ వైల్డ్ ఆఫ్-రోడ్ టైర్లు కూడా ఉంటాయి. స్టాండర్డ్ మోడల్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ బ్రిడ్జ్‌స్టోన్ బ్యాట్‌లాక్‌లెస్ టైర్‌లు ఉంటాయి. అదనంగా, ఇందులో ప్రీమియం యారో బ్రాండ్ సైలెన్సర్ ఉంటుంది, ఇది స్టీల్ బాడీ, కార్బన్ ఎండ్ క్యాప్ స్ట్రాప్‌ మరియు తేలికపాటి బ్రష్డ్ స్టెయిన్లెస్‌తో తయారు చేయబడి ఉంటుంది.

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

కాగా, మెకానికల్స్ పరంగా, టైగర్ 900 బాండ్ ఎడిషన్ మరియు టైగర్ 900 ర్యాలీ ప్రో మోడళ్లు రెండూ కూడా ఒకే మాదిరిగా ఉంటాయి. ఈ రెండింటిలో ప్రధానంగా కాస్మెటిక్ మార్పులు మాత్రమే ఉంటాయి. కొత్త ట్రైయంప్ టైగర్ 900 బాండ్ ఎడిషన్ లో బిఎస్-6 (యూరో 5) కంప్లైంట్ 888 సిసి లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్‌ ను ఉపయోగించారు.

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

ఈ ఇంజన్ 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 95 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 87 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో ఆరు విభిన్న రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. వీటిలో రెయిన్, రోడ్, స్పోర్ట్స్, ఆఫ్-రోడ్, రైడర్-కాన్ఫిగర్ మరియు ఆఫ్-రోడ్ ప్రో రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

ట్రైయంప్ టైగర్ 900 బాండ్ ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా 250 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరియు ఇందులో భారతదేశం ఉందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే ఇది యూరప్, యుఎస్ మరియు కెనడా మార్కెట్లలో అధికారికంగా విక్రయించబడుతుంది.

Triumph Tiger 900 జేమ్స్ బాండ్ ఎడిషన్; కేవలం 250 యూనిట్లు మాత్రమే

మనదేశంలో ట్రైయంప్ ఈ ఏడాది ప్రారంభంలో తమ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ శ్రేణిలో కొత్త టైగర్ 900 ని పరిచయం చేసింది. ఈ మోడల్ దేశీయ మార్కెట్లో టైగర్ 800 ఎక్స్ఆర్ సిరీస్‌కి వారసుడిగా వచ్చింది మరియు ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి: జిటి, ర్యాలీ (ఆఫ్-రోడ్) మరియు ర్యాలీ ప్రో. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 13.70 లక్షలు, రూ. 14.35 లక్షలు మరియు రూ. 15.50 లక్షలుగా ఉన్నాయి.

Most Read Articles

English summary
Triumph tiger 900 bond edition revealed only 250 units will be sold globally
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X