Just In
- 9 min ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
- 34 min ago
టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?
- 1 hr ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 2 hrs ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
Don't Miss
- News
లాలూకు భారీ ఊరట- గడ్డి స్కాంలో నాలుగో కేసులో ఎట్టకేలకు బెయిల్..
- Sports
మరో అద్దిరిపోయే రికార్డ్‌కు చేరువలో రోహిత్: ఆ మైల్ స్టోన్‌కు దగ్గరగా: జాయింట్‌గా జాయిన్
- Movies
చావు కబురు చల్లగా.. ఓటీటీలో మరింత కొత్తగా..
- Lifestyle
ఆరోగ్య చిట్కాలు: దంతాల సంరక్షణ కోసం 'కొబ్బరి నూనె' ఇలా వాడండి!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విడుదలకు సిద్ధమవుతున్న ట్రైయంప్ ట్రైడెంట్ 660: బుకింగ్స్, ఈఎమ్ఐ స్కీమ్
బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ గతేడాది చివరి భాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించిన తమ ట్రైడెంట్ 660 రోడ్‌స్టర్ మోటర్‌సైకిల్‌ను కంపెనీ మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

ఈ మేరకు కంపెనీ తమ సోషల్ మీడియా ఛానెళ్లలో టీజర్లను కూడా విడుదల చేసింది. ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోటార్‌సైకిల్ కోసం ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా, ట్రైయంప్ తమ కస్టమర్ల కోసం రూ.9,999 ప్రత్యేక ఈఎమ్ఐ స్కీమ్‌ను కూడా పరిచయం చేసింది.

మార్కెట్ అంచనా ప్రకారం, ఈ మోటార్‌సైకిల్ ధర సుమారు రూ.6.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, సరసమైన ధరకే ఈ మోడల్‌ను అందించేందుకు కంపెనీ దీనిని సరికొత్త ట్యూబ్లర్ స్టీల్ ఛాస్సిస్‌పై తయారు చేయనుంది.

ఈ మోటార్‌సైకిల్‌లో విశాలమైన హ్యాండిల్‌బార్‌లు, గుండ్రటి హెడ్‌ల్యాంప్ క్లస్టర్, మోకాలి ఇండెంట్‌లతో కూడిన వంపులు తిరిగిన ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, స్టెప్-అప్ సీట్, పెరిగిన టెయిల్ డిజైన్, ఎక్స్‌పోజ్డ్ మెకానికల్ బిట్స్, కాంపాక్ట్ ఎగ్జాస్ట్ మరియు పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లతో రావచ్చని సమాచారం.

అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో తలక్రిందులుగా ఉన్న ఫోర్కులు (అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్) మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. అలాగే, ఇందులోని బ్రేక్‌లను నిస్సిన్ బ్రాండ్ నుండి గ్రహించనున్నారు. ఇవి డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇంకా ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ఇంజన్ విషయానికి వస్తే, ట్రైయంప్ ట్రైడెంట్ 660 మోడల్‌లో కంపెనీ తమ స్ట్రీట్ ట్రిపుల్ మరియు డేటోనా మోడళ్లలో ఉపయోగించిన 675 సిసి, లిక్విడ్-కూల్డ్ ట్రిపుల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

ఈ ఇంజన్ బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది మరియు ఇది సుమారు 88 బిహెచ్‌పి శక్తి మరియు 65 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది మరియు ఇందులో స్లిప్పర్ క్లచ్ కూడా ఉండే అవకాశం ఉంది.

ఈ మోటార్‌సైకిల్ ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ గురించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు, అయితే ఈ మోటార్‌సైకిల్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు కూడా లభిస్తాయని తెలుస్తోంది. ఇది ఈ విభాగంలో కవాసకి జెడ్650 మరియు హోండా సిబి650ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

ట్రైడెంట్ పేరుకు పెద్ద చరిత్రే ఉంది..
ట్రైయంప్ 1970 చివర్లో బిఎస్ఏ (బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్) కంపెనీతో చేతులు కలిపి ట్రైడెంట్ మరియు బిఎస్ఏ రాకెట్ 3 అనే మోడళ్లను ప్రవేశపెట్టింది.

ఈ బ్రాండ్ తిరిగి 1990 ఆరంభంలో ట్రైడెంట్ పేరుతో 900సిసి ట్రిపుల్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. అయితే, ఆ మోటార్‌సైకిల్ 1998లో నిలిపివేయబడింది.
కాగా.. ట్రైయంప్ ముచ్చటగా మూడోసారి ట్రైడెంట్ పేరును తమ కొత్త 2021 660సీసీ మోటార్‌సైకిల్ కోసం ఉపయోగిస్తోంది.