TVS Apache RTR 165 RP వర్సెస్ TVS Apache RTR 160 4V: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఇటీవల తమ సరికొత్త మోటార్‌సైకిల్ 'టీవీఎస్ అపాచే 165 ఆర్‌పి' (TVS Apache 165 RP) ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కొత్త Apache RTR 165 RP కంపెనీ విక్రయిస్తున్న ప్రస్తుత Apache RTR 160 4V యొక్క స్పెషల్ ఎడిషన్ మాదిరిగా ఉంటుంది. కంపెనీ ఈ కొత్త వేరియంట్ ను 'రేస్ పెర్ఫార్మెన్స్ (RP) సిరీస్ కింద అభివృద్ధి చేసింది.

TVS Apache RTR 165 RP వర్సెస్ TVS Apache RTR 160 4V: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

స్టాండర్డ్ అపాతే ఆర్టీఆర్ 160 4వి తో పోల్చుకుంటే, ఈ కొత్త ఆపాచే ఆర్టీఆర్ 165 ఆర్‌పి మోడల్ మరింత ఎక్కువ పవర్ మరియు మరింత అదనపు స్టైల్ ను కలిగి ఉంటుంది. మరి ఈ రేస్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ స్టాండర్డ్ వేరియంట్ తో ఎలా విభిన్నంగా ఉందో ఈ కథనంలో చూద్దాం రండి.

TVS Apache RTR 165 RP వర్సెస్ TVS Apache RTR 160 4V: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

స్టాండర్డ్ TVS Apache RTR 160 4V బైక్ లో ఉపయోగించిన 159.7 cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌కు బదులుగా ఈ కొత్త TVS Apache RTR 165 RP వేరియంట్‌లో మరింత శక్తివంతమైన 164.9 cc ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ కొత్త ఇంజన్ లో బైక్ యొక్క రేస్ మెషీన్‌లలో సాధారణంగా కనిపించే హై - లిఫ్ట్ క్యామ్‌లు, పెద్ద వాల్వ్‌లు, డ్యూయల్ యాక్యుయేటర్ స్ప్రింగ్‌లు మరియు డోమ్ ఆకారపు పిస్టన్‌లు వంటి అనేక భాగాలను కూడా కంపెనీ సవరించింది.

TVS Apache RTR 165 RP వర్సెస్ TVS Apache RTR 160 4V: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఈ అప్‌గ్రేడెడ్ ఇంజన్ 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 19.2 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదు. టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వితో పోలిస్తే, ఆర్టీఆర్ 165 ఆర్‌పి మోడల్ సుమారుగా 1.65 బిహెచ్‌పి అదనపు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాగా, అపాచే ఆర్టీఆర్ 165 ఆర్‌పి వేరియంట్ 14.2 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అదే సమయంలో స్టాండర్డ్ అపాచే ఆర్టీఆర్ 160 4వి మోడల్ 14.77 ఎన్ఎమ్ టార్క్‌తో పోలిస్తే ఇది కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే, ట్రాక్ రైడింగ్ కోసం ఇందులోని ఇంజన్ ను రీట్యూన్ చేసినట్లుగా తెలుస్తోంది.

TVS Apache RTR 165 RP వర్సెస్ TVS Apache RTR 160 4V: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఈ కొత్త మోడల్ లో గరిష్ట టార్క్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద నిర్మించబడింది. స్టాండర్డ్ 160 4వి వేరియంట్ కంటే ఇది 1500 రెవ్స్ ఎక్కువ. దీని పీక్ పవర్ కూడా చాలా ఎక్కువ, ఫలితంగా దీని పవర్ డెలివరీ చాలా ఎక్కువగా ఉంటుంది, అగ్రెసివ్ డౌన్ షిఫ్టుల సమయంలో వెనుక చక్రానికి అదనపు మద్దతు కోసం స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే, మరింత స్పోర్టీయర్ లుక్ కోసం జిపి165ఆర్ రేస్ బైక్‌లో ఉన్న అదే కలర్ ఆప్షన్ నుండి ప్రేరణ పొందిన ఈ కొత్త TVS RTR 165 RP ఎడిషన్‌ ను కలర్ చేయడం జరిగింది.

TVS Apache RTR 165 RP వర్సెస్ TVS Apache RTR 160 4V: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఈ కలర్ ఆప్షన్ లోని ముదురు నీలం మరియు తెలుపు ఎరుపు గీతలు స్పోర్టీ అనుభూతిని అందిస్తాయి. రెడ్ వీల్స్ జోడింపుతో స్పోర్టీ అప్పీల్ మరింత పెరుగుతుంది. అపాచో ఆర్టీఆర్ 165 ఆర్‌పి మోడల్‌లోని బ్రాస్ కోటింగ్ తో కూడిన చైన్ కూడా చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. సాధారణ చైన్‌ల కంటే ఇది మరింత మన్నికగా మరియు నిశ్శబ్దంగా ఉంటుందని టీవీఎస్ పేర్కొంది. అపాచే యొక్క స్టాండర్డ్ ఎడిషన్ ఆర్టీఆర్ 160 4వి కూడా స్పాన్ అడ్జస్టబుల్ లివర్‌లతో పాటు రెడ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

TVS Apache RTR 165 RP వర్సెస్ TVS Apache RTR 160 4V: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఈ ఫీచర్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 165 ఆర్‌పి ఎడిషన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేకమైన టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 165 ఆర్‌పి వేరియంట్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ గా అందుబాటులో ఉంటుంది. ఫలితంగా, కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని కేవలం 200 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. భారత మార్కెట్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.45 లక్షలు గా ఉంది.

TVS Apache RTR 165 RP వర్సెస్ TVS Apache RTR 160 4V: ఈ రెండింటిలో తేడాలు ఏంటి?

ఇది స్టాండర్డ్ అపాచే ఆర్టీఆర్ 160 4వి మోడల్ ధర కంటే దాదాపు రూ. 25,000 ఎక్కువగా ఉంటుంది. కంపెనీ ఈ మోటార్‌సైకిల్ విక్రయాలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది మరియు దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం టీవీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. రేసింగ్ శ్రేణిలో నిర్మించబడిన కొత్త టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 165 ఆర్‌పి, కంపెనీ యొక్క రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో క్రింద తయారైన మొదటి ఉత్పత్తి. ఈ లైనప్ లో కంపెనీ భవిష్యత్తులో మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Tvs apache rtr 165 rp and tvs apache rtr 160 4v major differences explained in details
Story first published: Sunday, December 26, 2021, 16:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X