TVS నుంచి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.45 లక్షలు మాత్రమే

ప్రముఖ టూవీలర్ కంపెనీ టీవీఎస్ మోటార్ (TVS Motor) ఎట్టకేలకు తన కొత్త అపాచీ ఆర్‌టిఆర్ 165 ఆర్‌పి (Apache RTR 165 RP) రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 1.45 లక్షల (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కొత్త మరియు లేటెస్ట్ బైక్ ని కేవలం 200 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

TVS నుంచి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.45 లక్షలు మాత్రమే

టీవీఎస్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త Apache RTR 165 RP బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ 160 సిసి సెగ్మెంట్లో అత్యంత శక్తివంతమైన బైక్ అని కంపెనీ తెలిపింది. ఈ బైక్ కొత్త ఇంజిన్ తో విడుదల చేయబడింది.

TVS నుంచి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.45 లక్షలు మాత్రమే

కొత్త టీవీఎస్ అపాచీ RTR 165 RP బైక్ 164.9 సిసి సింగిల్ సిలిండర్, 4 వాల్వ్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 19.2 బిహెచ్‌పి పవర్ మరియు 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది. ఈ బైక్ ను కంపెనీ ప్రత్యేకంగా రేసింగ్ పర్ఫామెన్స్ కోసం రూపొందించింది. ఈ కారణంగానే ఈ బైక్‌లో కొత్త సిలిండర్‌ను అమర్చారు, ఇది మునుపటికంటే కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

TVS నుంచి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.45 లక్షలు మాత్రమే

అంతే కాకుండా కంపెనీ ఈ ఇంజిన్‌లో ట్విన్ ఎలక్ట్రోడ్ స్పార్క్ ప్లగ్ ఇన్‌స్టాల్ చేసింది. కావున ఈ బైక్‌కు 15 శాతం పెద్ద వాల్వ్‌లను అమర్చారు, ఇది ఇంజిన్ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. మొత్తానికి ఇది వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

TVS నుంచి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.45 లక్షలు మాత్రమే

కొత్త అపాచీ RTR 165 RP మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో రేసింగ్ డెకాల్, స్లిప్పర్ క్లచ్, అడ్జస్టబుల్ బ్రేక్ లివర్ మరియు క్లచ్, ఎల్ఈడీ హెడ్‌లైట్ మరియు సిగ్నేచర్ ఎల్ఈడీ లైట్‌ వంటివి ఉంటాయి. అంతే కాకుండా ఈ బైక్ వెనుక రేడియల్ టైర్లు, రెడ్ అల్లాయ్ వీల్స్, కస్టమైజ్డ్ స్టిక్కర్, బ్రాస్ కోటెడ్ డ్రైవ్ చైన్ మరియు స్ప్రాకెట్ కూడా అందుబాటులో ఉంటుంది.

TVS నుంచి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.45 లక్షలు మాత్రమే

అపాచీ RTR 165 RP బైక్ తన సెగ్మెంట్‌లో మొదటి 240 మిమీ డిస్క్ బ్రేక్ పొందుతుంది. అంతే కాకుండా ఇటీవల కంపెనీ అపాచీ బైక్ సిరీస్‌లో అందించిన TVS కనెక్ట్ యాప్‌ను అప్‌డేట్ చేసింది. What3words ఫీచర్ TVS Connect యాప్‌కి జోడించబడింది, దీని ద్వారా GPS నావిగేషన్‌ను మరింత ఖచ్చితంగా తెలుస్తుంది. TVS మోటార్ తన మోడళ్లలో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చిన మొదటి భారతీయ ద్విచక్ర వాహన తయారీదారుగా నిలిచింది. What3words ఫీచర్ ఇప్పటికే ఫోర్ వీలర్ సెగ్మెంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.

TVS నుంచి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.45 లక్షలు మాత్రమే

Apache శ్రేణిలో, కంపెనీ Apache RTR 160 4V, Apache RTR 200 4V మరియు Apache RR 310లలో TVS కనెక్ట్ యాప్ ఫీచర్‌ను అందజేస్తుంది, కానీ ఇది కాకుండా, TVS కనెక్ట్ యాప్ ఫీచర్ కూడా NTorq 125 స్కూటర్‌లో అందుబాటులో ఉంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

TVS నుంచి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.45 లక్షలు మాత్రమే

ఇదిలా ఉండగా కంపెనీ ఈ నెల మొదటి భాగంలోనే 2021 నవంబర్ అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. దీని ప్రకారం కంపెనీ యొక్క అమ్మకాలు కొంత క్షీణించినట్లు తెలిసాయి. కంపెనీ గణాంకాల ప్రకారం, కంపెనీ గత నెలలో మొత్తం 2,57,863 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

TVS నుంచి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.45 లక్షలు మాత్రమే

అయితే, ఇవి గడచిన నవంబర్ 2020 నెలలో విక్రయించిన 3,11,519 యూనిట్లతో పోలిస్తే, 17 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఈ మొత్తం విక్రయంలో దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు రెండూ కలిసి ఉన్నాయి. నవంబర్ 2021 లో, కంపెనీ దేశీయ అమ్మకాలను గమనిస్తే, అవి 1,75,940 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, నవంబర్ 2020 నెలలో ఇవే దేశీయ అమ్మకాలు 2,47,789 యూనిట్లుగా నమోదయ్యాయి.

TVS నుంచి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.45 లక్షలు మాత్రమే

టీవీఎస్ స్కూటర్ అమ్మకాల విషయానికి వస్తే, నవంబర్ 2020 నెలలో కంపెనీ మొత్తం 1,06,196 స్కూటర్లను విక్రయించగా, గత నెలలో (నవంబర్ 2021 లో) 75,022 స్కూటర్లను మాత్రమే విక్రయించింది. గత నెలలో స్కూటర్ విక్రయాలు బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తం ఎగుమతుల విషయానికి వస్తే, టీవీఎస్ నవంబర్ 2020లో మొత్తం 74,074 యూనిట్లను ఎగుమతి చేయగా, నవంబర్ 2021 నెలలో 96,000 యూనిట్లను ఎగుమతి 30 శాతం వృద్ధిని నమోదు చేసింది.

TVS నుంచి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.45 లక్షలు మాత్రమే

చెన్నై కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ రాబోయే నాలుగేళ్లలో తమిళనాడులో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలు మరియు ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం సుమారు రూ. 1,200 కోట్ల పెట్టుబడిని వెచ్చించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ పెట్టుబడిని ప్రధానంగా డిజైన్, డెవలప్‌మెంట్, కొత్త ఉత్పత్తుల తయారీ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో సామర్థ్య విస్తరణ కోసం కేటాయించనున్నట్లు తెలిపింది.

Most Read Articles

English summary
Tvs apache rtr 165 rp edition launched price features details
Story first published: Thursday, December 23, 2021, 19:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X